Tomato powder

0
338

#Tomatopowder
టమాటాని పొడిచేసుకుందాం!

మొన్నటి వరకూ కిలో వందకూడా పలికిన టమాట ఇప్పుడు చూస్తే పదిరూపాయల్లోపే దొరుకుతోంది. తక్కువ కదాని కిలోలుకిలోలు కొని ఇంట్లో పెట్టుకోలేంగా అంటారా? అయితే మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎందుకంటే.. టమాటలని దాచిపెట్టుకునే పద్ధతులున్నాయి కాబట్టి!
పళ్లని, కూరగాయలని తాజాగానే తినాలని చెబుతుంటారు వైద్యులు. ఇందులో సందేహం లేదు. అయితే టమాటలను ఎండ బెట్టి.. ఎండు మిరపకాయ కారంలా నిల్వ చేసుకుని తినడం వల్ల కూడా ఎలాంటి నష్టం లేదు. ఇలా చేయడం వల్ల వాటిల్లోని నీటి శాతం పోతుందే తప్ప మరే పోషకాలు పోవు. ఎరుపు రంగు పోనంతవరకూ ఇందులో ముఖ్యమైన లైకోపిన్‌ చెక్కు చెదరదు. లైకోపిన్‌ శరీరంలోని చెడు పదార్థాలను తొలగించి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
• నిల్వ చేసే విధానం…
బాగా ఎర్రగా పండిన టమాటలని మాత్రమే తీసుకోవాలి. వాటిని బాగా కడిగి ఆరబెట్టాలి. వీటిని సన్నని చక్రాల్లా తరిగి ఎండలు బాగున్నప్పుడు ఎండలో పెట్టి గలగల మనే సమయానికి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. టమాట ముక్కలపై ఉప్పు చల్లితే.. బూజు పట్టకుండా ఉంటాయి. మబ్బుగా ఉంది అనుకుంటే ఒక శుభ్రమైన బట్టమైన వాటిని ఆరేసి నీరు పోయిన తర్వాత ముక్కలను ఓవెన్‌లో పెట్టి కూడా అందులో నీరు ఇంకేలా చేసుకోవచ్చు. అప్పుడు వాటిని కారం పొడిలా చేసుకోవచ్చు. లేదంటే అలానే వడియాల్లా డబ్బాల్లో వేసుకుని అవసరానికి కూరల్లో వాడుకోవచ్చు. లేదంటే తాజా వాటి గుజ్జు తీసి.. ఐస్‌ట్రేలల్లో ఈ గుజ్జు వేసి ఫ్రీజర్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు కలిపితే నాలుగైదు నెలలవరకూ చెక్కు చెదరదు. కూరల్లో నేరుగా ఈ సాస్‌ను వినియోగించుకోవచ్చు.
* ఉపయోగాలు: ఎసిడిటీతో బాధపడేవారు టమాటలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. ఇందులోని సిట్రిక్‌ ఆమ్లం ఎసిడిటీని దూరం చేస్తుంది. ఇందులోని లైకోపీన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ 25 మిల్లీ గ్రాములు లైకోపిన్‌ తీసుకుంటే శరీంలో చెడు కొవ్వు 10 శాతం మేర తగ్గుతుంది. రక్తనాళాలు గట్టిపడడం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.