థైరాయిడ్‌ తారుమారయితే

0
608

🔱🌞🎼
*థైరాయిడ్‌ తారుమారయితే*..

💫ఆడపిల్ల కౌమారం నుంచి యుక్తవయసులోకి అడుగు పెడుతోందంటే ఎన్నో మార్పులు. కానీ సహజంగా రావాల్సిన మార్పులకు బదులుగా నెలసరుల్లో తేడాలు జరుగుతున్నాయా? అసలు రజస్వలే కాలేదా? బరువు పెరుగుతోందా? వయసుకు తగిన ఎత్తు లేదా? అలసిపోతూ, నిస్సత్తువగా కనిపిస్తోందా? బహుశ అవి థైరాయిడ్‌ లక్షణాలు కావచ్చు. చాలామంది అమ్మాయిల్లో ఎదురయ్యే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చూద్దాం.ఎదిగే వయసులో థైరాయిడ్‌ గ్రంథి ప్రభావం అమ్మాయిలపై తీవ్రంగానే ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్‌ హార్మోను ఆడపిల్లల ఎదుగుదలపై, ముఖ్యంగా రుతుక్రమంపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమస్యను ముందే గుర్తించి చికిత్స అందిస్తే గనుక భవిష్యత్తులో ఎదురయ్యే ఇతరత్రా సమస్యల్ని అదుపు చేసుకోవడం సులువు అవుతుంది. థైరాయిడ్‌ గ్రంథి గొంతు భాగంలో ఉంటుంది.

💫 ఇది గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించడం, అధికరక్తపోటును అదుపులో ఉంచడం, కెలొరీలు కరిగించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందుకే థైరాయిడ్‌ హార్మోను విడుదలలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు తలెత్తినా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య రెండురకాలుగా ఉంటుంది. ఈ గ్రంథి తక్కువ మోతాదులో అంటే శరీర అవసరాలకు సరిపోనంతగా విడుదల చేయకపోతే అది హైపోథైరాయిడిజం అంటారు.

💫 ఒకవేళ అవసరానికి మించి హార్మోను విడుదల అవుతోంటే అది హైపర్‌ థైరాయిడిజంగా పరిగణిస్తారు.
లక్షణాలను బట్టీ సమస్య..

💫కొన్ని లక్షణాలు హైపోథైరాయిడిజం సమస్యను సూచిస్తాయి. ముఖ్యంగా పొడిచర్మం, నీరసం, బరువు పెరగడం, ఎత్తు తక్కువగా ఉండటం, అధిక కొలెస్ట్రాల్‌, ఆందోళన, కీళ్లనొప్పులూ, జుట్టు రాలడం, ఏకాగ్రత కుదరకపోవడం, నెలసరి సమస్యలు ఎదురవుతాయి.

💫మరికొందరు ఆడపిల్లలు రజస్వల కారు. మానసిక ఎదుగుదలా తగ్గుతుంది.

💫 ఇవన్నీ హైపోథైరాయిడిజం లక్షణాలే. ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్‌ స్వతహాగా హార్మోను తక్కువ విడుదల చేస్తే ఆ పరిస్థితిని ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటారు.

💫 అలా కాకుండా పిట్యూటరీ గ్రంథి కారణంగా హార్మోన్ల హెచ్చుతగ్గులు వస్తే దాన్ని సెకెండరీ హైపోథైరాయిడిజంగా పరిగణిస్తారు.

💫సాధారణంగా థైరాయిడ్‌ గ్రంథి హార్మోను స్రావాన్ని మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంథి నియంత్రిస్తుంది.

💫ఇలా నియంత్రించడం కోసం పిట్యూటరీ టీఎస్‌హెచ్‌అనే హార్మోన్‌ని విడుదల చేస్తుంది. దాని విడుదల తగ్గినా హైపోథైరాయిడిజం వస్తుంది.

💫హైపర్‌ ఉంటే: ఆకలి పెరగడం లేదా తగ్గడం, నిద్రలేమి, అలసటా, డయేరియా, గుండె పనితీరలో తేడా, విపరీతంగా చెమటలు పట్టడం, నెలసరిలో తేడాలు, అసలు కాకపోవడం, కండరాల బలహీనత, బరువు తగ్గడం, జుట్టు రాలడం, కొన్నిసార్లు రక్తంలోని చక్కెరస్థాయుల్లో తేడాలు, విపరీతమైన రక్తహీనత..

💫 లాంటివన్నీ హైపర్‌ థైరాయిడిజం సమస్యను సూచిస్తారు. ఒకవేళ థైరాయిడ్‌ గ్రంథి అవసరానికి మించి ఆ హార్మోన్‌ని విడుదల చేస్తుంటే దాన్ని ప్రైమరీ హైపర్‌థైరాయిడిజం సమస్యగా పేర్కొంటారు.

💫కొన్ని రకాల కిడ్నీ సమస్యల కారణంగా థైరాయిడ్‌ గ్రంథి కొన్నిసార్లు అతిగా ఆ హార్మోనును విడుదల చేస్తుంది.

💫ఆ పరిస్థితిని సెకెండరీ హైపర్‌ థైరాయిడిజం అని చెబుతారు.

💫కారణాలు ఎన్నో..
ఇప్పటి జీనవవిధానం వల్ల పర్యావరణం, రసాయనాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, ప్లాస్టిక్‌ వినియోగం పెరగడం..

💫 లాంటివన్నీ థైరాయిడ్‌ గ్రంథిని ప్రభావితం చేస్తున్నాయి.

అలాంటప్పుడూ థైరాయిడ్‌ సమస్య ఎదురవుతుంది.

💫 ఇందుకు కారణమయ్యే రసాయనాలని ఎండోక్రైన్‌ డిస్ట్రక్టింగ్‌ కెమికల్స్‌ (ఈడీసీ) అంటారు. అలాగే శరీరంలో యాంటీబాడీలు పెరిగినా, అధికంగా బరువు పెరిగినా కూడా థైరాయిడ్‌ పనితీరులో తేడాలు వస్తాయి.

అలాగే కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారంలో ఆయోడిన్‌ లోపించడం..

లాంటివన్నీ ఈ సమస్యకు కారణం అవుతాయి.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..

💫ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే గనుక భవిష్యత్తులో రకరకాల సమస్యలు ఎదురవుతాయి.

💫ముఖ్యంగా
హైపో థైరాయిడిజం ఉన్న అమ్మాయిలకు భవిష్యత్తులో సంతానసాఫల్యత లోపించవచ్చు.

💫గర్భం దాల్చినా అబార్షన్లు అయ్యే ప్రమాదాలు ఎక్కువ. ఒకవేళ నవమాసాలు గడిచినా పుట్టే పాపాయిలో బుద్ధిమాంద్యం సమస్య ఎదురుకావచ్చు.

💫అదే హైపర్‌థైరాయిడిజంతో బాధపడేవారికి అయితే..

💫 రక్తహీనత ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం గర్భం దాల్చినప్పుడు పుట్టబోయే పాపాయిపైనా ఉంటుంది.

💫సమస్య మరీ తీవ్రంగా ఉంటే గనక మందుల ప్రభావంతో పాపాయి చర్మంలేకుండా పుట్టే అవకాశాలూ ఉంటాయి.

💫ఆ పాపాయి గుండె అమరికలోనూ తేడాలు ఉండొచ్చు.

⏳ *రక్తపరీక్ష*..

ఈ సమస్యను గుర్తించేందుకు వైద్యులు రక్తపరీక్ష నిర్వహిస్తారు.
హైపోని గుర్తించేందుకు టీఎస్‌హెచ్‌ అనే పరీక్షను నిర్వహిస్తారు.

అవసరాన్ని బట్టి పిట్యూటరీ గ్రంథి పనితీరును తెలుసుకునేందుకు ప్రొలాక్టిన్‌ అనే పరీక్ష చేయాల్సి రావచ్చు.

🕸 ఇక హైపర్‌ని తెలుసుకునేందుకు
టి3 , టి4 , టిఎస్‌హెచ్‌లతోపాటూ ప్రొలాక్టిన్‌ని కూడా చేస్తారు.
మాత్రలు మొదలు..
సమస్యను బట్టి వైద్యులు మందులు సూచిస్తారు. వీటిని సాధారణంగా జీవితాంతం వాడాలి.

⏳అయితే ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి, హార్మోను పనితీరును బట్టి ఆ మాత్రల మోతాదును తగ్గించి, పెంచుతుంటారు వైద్యులు.

⏳అయోడిన్‌ లోపం ఉంటే దాన్ని పెంచుకోవాలి.

⏳వ్యాయామాన్ని జీవనవిధానంలో భాగం చేసుకోవాలి.🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.