టమాటా రసం

0
736

టమాటా రసం:
కావలసిన పదార్థాలు :
టమాటాలు -3,
చింతపండు – గోలి అంత,
పసుపు -చిటికెడు,
ఉప్పు -1 టీస్పూన్ ,
కారం – 1/2 టీస్పూన్,
రసం పొడి -1 టీస్పూన్,
కొత్తిమీర -2 రెమ్మలు.

తాలింపు కొరకు:
కరివేపాకు- 2 రెమ్మలు ,
ఎండుమిర్చి -2,
జీలకర్ర – 1/4 టీస్పూన్,
ఆవాలు – 1/4 టీస్పూన్,
ఇంగువ – చిటికెడు,
పచ్చిపప్పు – 1/2 టీస్పూను,
నూనె/నెయ్యి – 2 స్పూన్,
వెల్లుల్లి -2/3.

తయారీ విధానం :
టమాటాలు , చింతపండు, పసుపు, ఉప్పు, కారం, రసం పొడి అన్నిటిని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని 2.1/2 కప్పులు నీళ్లు పోసుకుని పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె /నెయ్యి వేసుకుని అది వేడెక్కాకా తాలింపు సామాను మరియు వెల్లులి ముక్కలు వేసి అవి చిటపటలాడాక రసంలో వేసి 1 నిమిషం మరిగించాలి. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టమాటా రసం రెడీ.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.