చర్మంలో ముడుతలను నివారించే నేచురల్ రెమెడీస్

0
502

చర్మంలో ముడుతలను నివారించే నేచురల్ రెమెడీస్ :

1. కొబ్బరి నూనె :

– నేచురల్ ఆయిల్స్ లో ది బెస్ట్ ఆయిల్ కొబ్బరి నూనె. దీన్ని స్కిన్ కు అప్లై చేయడం వల్ల బెటర్ రిజల్ట్ ను అందిస్తుంది. ఇది చర్మంలోకి చొచ్చుకునిపోయి, చార్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. స్కిన్ వ్రింకిల్స్ నివారించుకోవడానికి బెస్ట్ నేచురల్ రెమెడీ.

2. ఆలివ్ ఆయిల్:

– ముడతలను నివారించడంలో మరో బెస్ట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్, ఇందులో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది స్కిన్ కు మాయిశ్చరైజర్ ను అందివ్వడంతోపాటు, స్కిన్ ఆరోగ్యంగా ఉండేట్లు సహాయపడుతుంది.

3. విటమిన్ ఇ ఆయిల్ :

– మెడిసినల్ వాల్యూస్ అధికంగా ఉండే ఆయిల్ విటమిన్ ఇ ఆయిల్. ఈ పిల్స్ మెడికల్ షాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. క్యాప్స్యూల్స్ లోపల ఆయిల్ తో మనకు ట్రాన్సపరెంట్ గా కనబడుతాయి. లోపల ఆయిల్ ఉంటుంది. పిల్ రెండ్ గా బ్రేక్ చేసి, లోపలున్న ఆయిల్ ను స్కిన్ కు అప్లై చేయడం వల్ల చర్మంలో ముడుతలు మాయమవుతాయి.

4. లోవెర జెల్:

– కలబంద ఆకుల నుండి జెల్ ను వేరుగా తీసి, చర్మానికి అప్లై చేయాలి. ఇది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలోవెర జెల్ చర్మంలోనికి చొచ్చుకుని పోయి, చర్మం డ్రై నెస్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని కూల్ గా చేసే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

5. బాదం ఆయిల్ :

– బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది, ఇది చర్మ సంరక్షణకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డ్రై స్కిన్ ను నివారిస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది.

6. ఆముదం:

– ఆముదం నూనెలో మినిరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉన్నాయి. స్కిన్ కేర్ కు ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదం నూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ముడుతలను మాయం చేయడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మార్గం.

7. మిల్క్ క్రీమ్ :

– మిల్క్ క్రీమ్ ను బాడీ మొత్తం అప్లై చేయాలి. మిల్క్ క్రీమ్ లోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. ముడుతలను కనబడనివ్వకుండా చేస్తుంది. తేమగా, మెరిసేట్లు చేస్తుంది.

8. తేనె:

– తేనె నేచురల్ పదార్థం. దీన్ని చర్మానికి అప్లై చేసినప్పుడు చార్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మం సాప్ట్ గా మరియు గ్లోయింగ్ తో కనబడుతుంది. స్నానం చేస్తే తేనె మాయమవుతుంది. ముడుతలను నివారించుకోవడం కోసం ఈ ఫర్ఫెక్ట్ హోం రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.