సర్దార్ పాపారాయుడు (30-10-1980) was released 38 years back on this day

0
92

అపురూప చిత్రాలు -121

సర్దార్ పాపారాయుడు (30-10-1980) was released 38 years back on this day.

భారత స్వాతంత్య్ర పోరాటంలో తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒక సమర యోధుడు , స్వాతంత్య్రం వచ్చిన 30 సంవత్సరాల తర్వాత సమాజంలోకి వచ్చి ఆ స్వాతంత్య్ర ఫలాలు దుర్వినియోగం అవుతుంటే ఎలా స్పందించాడనే ఉత్తేజపూరితమైన ఊహకు దృశ్య రూపమే సర్దార్ పాపారాయుడు.

శ్రీ అన్నపూర్ణా ఇంటర్నేషనల్ పతాకంపై దాసరి నారాయణ రావు దర్శకత్వంలో క్రాంతికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

1980 జూలై 1 న ప్రారంభమైన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరంలో సర్వం త్యాగం చేసిన వృద్ధమూర్తిగా, బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ గా ఎన్ టి ఆర్ నటించారు. తండ్రీ కొడుకులుగా ఇద్దరు నటులు నటించారా అన్నత వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తూ ఎన్ టి ఆర్ అభినయించారు. ముఖ్యంగా పాపారాయుడు పాత్రలో వీర, రౌద్ర, అద్భుత రసాలను అనితరసాధ్యంగా ప్రదర్శించారు. సంబాషణోచ్చారణలో కొత్త ఒరవడితో ఉర్రూతలూగించడంతో ఈ చిత్రం డైలాగ్స్ ఆడియో కూడా విరివిగా ప్రాచుర్యం పొందింది.

మోహన్ బాబు తెల్ల దొర పాత్రలో రక్తి కట్టించారు. బాబా పాత్రకు గుమ్మడి ప్రాణం పోసారు. శారద, శ్రీదేవి, సత్యనారాయణ,రావుగోపాలరావు, పండరీబాయి, అల్లు రామలింగయ్య, , అత్తిలి లక్ష్మి, త్యాగరాజు, కేవీ చలం, పీజే.శర్మ, చలపతిరావు, చిడతల అప్పారావు, అశోక్ కుమార్, ప్రభాకరరెడ్డి, ఎస్.వరలక్ష్మి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

దర్శకునిగా, రచయితగా దాసరి నారాయణ రావు ఈ చిత్రానికి ప్రాణం పోసారు.

చక్రవర్తి సంగీతం, ఎస్ వెంకట రత్నం ఫొటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీ శ్రీ రచించగా బెనర్జీ ఆలపించిన బుర్ర కధ ఈ చిత్రానికి హైలెట్. ఇదే బుర్ర కధలో ఎన్ టి ఆర్ అల్లూరి సీతా రామ రాజు పాత్ర ధరించి ఆ తర్వాత కాలంలో ఆ గెటప్ కే మోడల్ గా నిలిచారు.

మొదట ఈ కధ చెప్పడానికి వెళ్ళినపుడు దర్శక నిర్మాతలను వారి శ్రేయోభిలాషులు “ఈ సమయంలో ముసలి పాత్ర వేయడానికి ఎన్ టి ఆర్ అంగీకరించరు. చేస్తే హీరోగా ఆయన ఇమేజ్ దెబ్బ తింటుంది” అని బెదిరించారు. కానీ కధ విన్న ఎన్ టి ఆర్ తాను ముసలి పాత్రనే వేస్తానని కుర్ర పాత్రకు ఎవరినైనా చూడండని చెప్పి ఆశ్చర్యపరిచారు. కానీ దర్శక నిర్మాతలు మీకున్న stardom దృష్ట్యా పాటలు పెట్టడంకోసం కొడుకు పాత్రను కూడా మీరే వేయాలని ఒప్పించారు. ఆ తరువాత ఈ ఫార్ములా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారి ఆ తరంలోని హీరోలందరితోపాటు ఆ తర్వాతి తరం లోని హీరొలందరూ కూడా వయసు తేడా ఉన్న డ్యూయల్ రోల్స్ వేసారు. తమ కేరీర్ ల్యాండ్ మార్కు చిత్రాలుగా చెప్పుకునేంతగా మూడు దశాబ్దాలుగా ఇది సక్సెస్ఫుల్ ఫార్ములాగా చలామణి అయింది. అలాగే వయసుమళ్ళిన వృద్ధ పాత్రలకు హీరో హోదా కల్పించిన చిత్రంకూడా ఇదే.

ఈ చిత్రంలో అల్లూరి సీతా రామ రాజు గెటప్ ధరించినప్పుడు “ఆ రోజు ప్రజలకోసం ఆయన పోరాటం చేయబట్టి కదా ఈ రోజు మనం ఈ గెటప్ ధరిస్తున్నాం. రేపు మన గురించి కూడా గుర్తుంచుకోవాలంటే ఇంతకాలం ఆదరించిన ప్రేక్షకులకోసం ఏదైనా చేసి తీరాలి” అనే ఆలోచన ఎన్ టి ఆర్ మదిలో మెదిలి అదే ఆయన రాజకీయ ప్రవేశానికి బీజమై చరిత్ర సృష్టించడం ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం.

30-0-1980 న విడుదలైన సర్దార్ పాపారాయుడు అద్భుత విజయం సాధించి 300 రోజులకు పైగా ప్రదర్శించబ్డింది. ఈ ప్రభంజనం లో నాటి యువ హీరోలు సైతం తండ్రీ కొడుకులుగా నటించక తప్పనంతగా సర్దార్ పాపా రాయుడు చిత్రం పరిశ్రమను ప్రభావితం చేసింది.

పాతికేళ్ళ శిక్షకు బలి పశువై ప్రపంచానికి తన నిజాయితీని తెలియ చేయడానికి తిరిగి లేచిన మహోదృత విప్లవ కెరటం “సర్దార్ పాపారాయుడు”.

దాసరి నారాయణ రావు ఒకే కుటుంబం చిత్రానికి (1970 లో) పని చేస్తున్న రోజులవి. అప్పుడాయన కో డైరెక్టర్. ఓ సన్నివేశాన్ని ఆయనను తీయమన్నారు. ఆ సీను మరెవరితో కాదు. సాక్షాత్తూ ఎన్ టి ఆర్ ది. ఆ సన్నివేశాన్ని నిర్దేశించిన తీరు చూసి ఎన్ టి ఆర్ ముచ్చటపడ్డారు. భవిష్యత్తులో ఈయన గొప్ప దర్శకుడవుతాడని అందరి ముందూ చెప్పి దాసరిని ఆశీర్వదించారాయన.

నన్ను గురించి తొలిసారిగా అలా చెప్పిన మహోన్నతుడు ఆయనే అని దాసరి నారాయణ రావు చెప్పడం జరిగింది. అలా 10 సంవత్సరాలు గడిచాయి. ఎన్ టి ఆర్ ఆ మాటలను నిజం చేసి గొప్ప దర్శకుడిగా దాసరి ఎదిగారు.

ఎన్ టి ఆర్ దాసరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా మనుషులంతా ఒకటే. ఆ సినిమా విజయవంతమయ్యింది. ఆ తరువాత రెండవ సినిమా సర్కస్ రాముడు కూడా విజయం సాధించింది. మూడవ ప్రయత్నం సర్దార్ పాపారాయుడు.

వాస్తవంలో పాత్రద్వారా సందర్భం సృష్టించబడుతుంది. దృశ్యమాధ్యమంలో సందర్భం పాత్రను సృష్టిస్తుంది. అసాధారణ నటుడిగా ఎన్ టి ఆర్ నటన మనో నేత్రంపై నిలిచిపోవడం ప్రేక్షకులకు అనుభవమే. కాగితం పై లిఖించబడిన ఓ పాత్రను తన అభినయ సామర్ధ్యంతో గొప్ప స్థాయికి తీసుకుపోయి చరిత్రగా మార్చడంలోనే ఎన్ టి ఆర్ కళా కౌశలం వ్యక్తమౌతుంది.

ఎన్ టి ఆర్ ఎదురుగా ఉండబట్టే పాపారాయుడు పాత్ర సృష్తించబడింది. ఓ నటుడికి, ఓ దర్శకుడికి, పరిశ్రమకు గర్వ కారణం సర్దార్ పాపారాయుడు చిత్రం అని దాసరి అభివర్ణించారు. ఎన్ టి ఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడ చేత నా ఊహల్లో రూపు దాల్చిన “రాముడు లేని రాజ్యంలో రావణాసురుడు” తీయలేకపోయాను. ఆ పాత్ర వేరొకరు చేయలేంది. అందుకే ఆ కధను అలాగే వదిలేసాను అని ఆయన చెప్పారు. ఎన్ టి ఆర్ లేని పరిశ్రమ ఎంత నిస్సారంగా అనిపించిందో దాసరి ఈ మాటలనుబట్టి అర్ధం చేసుకోవచ్చు.

స్వాతంత్య్రం కోసం పోరాడిన విప్లవ వీర యోధుడు సర్దార్ పాపారాయుడిగానూ, పాతికేళ్ళ శిక్ష అనుభవించి వార్ధక్యంలో సైతం దుర్మార్గుల భరతంపట్టి నిజాలను ప్రపంచానికి తెలియచెప్పిన నిర్దోషి పాపారాయుడిగానూ ఎన్ టి ఆర్ నటన ప్రేక్షకులకు శత వసంతాలకు సరిపడిన సంతృప్తిని కలిగించింది. పదాలకందని అపురూపమైన అభినయం ఆ అద్వితీయ కళాకారుడినుండి జాలువారింది. పాత్రోచిత ప్రదర్శనతో పోలీస్ ఇనస్పెక్టర్ పాత్ర సైతం ప్రేక్షకులను రంజింపచేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో పాపారాయుడును వెదికే సన్నివేశంలో తన తల్లితో జరిపిన సంభాషణ అద్భుతం. ఆ సమయంలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ అపూర్వం. ఇటువంటి అపురూపమైన చిత్రాలను తెరపై మాత్రమే చూడాలి.

ఈ సినిమా 22 కేంద్రాలలో శత దినోత్సవం, 5 కేంద్రాలలో రజతోత్సవం, విశాఖలో 200 రోజులు, హైదరాబాద్ – విజయవాడ కేంద్రాలఓ 300 రోజులు నడిచింది. కాకినాడ దేవిలో 63 రోజుల తర్వాత మెజస్టిక్ లో 92 రోజులతో మొత్తం 155 రోజులు నడిచింది. విజయవాడలో మెయిన్ థియేటర్ దొరకక బందరు రోడ్ వెంకటేశ్వరర్ లో రిలీజ్ చేస్తే రెండు వారాలకంటే ఎక్కువ ప్రదర్శింపబడని ఆ థియేటర్ లో 100 రోజులు ప్రదర్శింపబడడం విజయవాడలో సంచలనమయింది.

1980 లో ఎన్ టి ఆర్ నటించిన చాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, ఆటగాడు, సూపర్మేన్, సర్దార్ పాపారాయుడు చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

వినరా సోదర , బుర్రకధ

తెల్ల చీర

1980 వరకూ

జ్యోతి లక్ష్మి చీర కట్టింది

ఉయ్యాలకు వయసొచ్చింది

హెల్లో టెంపర్

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.