సారంగధర (01-11-1957)

0
114

అలనాటి చిత్రాలు -122

సారంగధర (01-11-1957)

అసలే చారిత్రాత్మక సినిమా. ఆ పైన ఇందులోని పాత్రలు పాత్రధారులు కూడా ప్రముఖులే. రాజ రాజ నరేంద్రుడిగా ఎస్ వి ఆర్, ఆతని మొదటి భార్య కుమారుడు సారంగధరుడిగా ఎన్ టి ఆర్, రాజ రాజ నరేంద్రుని రెండవ భార్య చిత్రాంగి గా భానుమతి నటించేరు. సారంగధరుని ప్రియురాలిగా రాజ సులోచన , రాజరాజ నరేంద్రుని మొదటి భార్య గా శాంతకుమారి నటించేరు.

కధ కూడా ఒక రకం గా controvertial. సారంగధరుని సవతి తల్లి చిత్రాంగి అతడిని మోహించి, భంగపడి, రాజుకు అతని పై నింద మోపితే, రాజు (తండ్రి) కుమారుడి చేతులు, కాళ్ళు నరికిస్తాడు.

సినిమాలో భానుమతి కి యువరాజు తో పెళ్ళి అని చెప్పి, కత్తి కి బాసికం కట్టించేరు కనుక తాను రాజు భార్య కానని వాదన. చివర్లో సిద్ధుడొచ్చి సారంగధరుని మళ్లీ మామూలు మనిషిని చెయ్యడం ఒక అద్భుత(అభూత)మే అయినా, తన తప్పేమీ లేకున్నా శిక్ష ననుభవింప వలసి వచ్చిన వాడు తిరిగి కోలుకోవడం ప్రక్షకులకు సంతోషమే కలిగించింది. భానుమతి, శాంతకుమారి, గిరిజ, నాగయ్య, రంగారావు, రామారావు, రేలంగి, తదితరుల నటన ఒకెత్తు, నేపథ్యసంగీతము, పాటలు, పద్యాలు ఇంకో ఎత్తు.

ఈ ‘సారంగధర’ సినిమాకు ఒక మూలం అంటూ లేదు. బోలెడు ఆధారాలు. కొంచెం ఆశు చరిత్ర, కొంచెం పంజాబీ , కొంచెం తెలుగు నాటక సంప్రదాయం, కొంచెం సినీ మసాలా. సినిమా గా తీయదగ్గ కధ కాదని నా అభిప్రాయం. కధ గా చదువుకోవచ్చు. 3 గొప్ప పాటలున్నాయి. అన్న గారు చాలా అందం గా, హుందా గా ఉంటారీ సినిమాలో.In Tamil version Sivaji Ganeshan played NTR’s role.

సారంగధర చిత్రం కథలో చిత్రాంగి (భానుమతి) సారంగధరుని (ఎన్.టి.ఆర్) ప్రేమిస్తుంది. కాని సారంగధరుడు వేరొకరిని ప్రేమించడం వలన చిత్రాంగిని చేసుకోవడానికి తిరస్కరిస్తాడు. అయితే రాజకీయ కారణాల వలన దేశ ప్రజల రక్షణకోసం చిత్రాంగిని సారంగధరుని తండ్రి (ఎస్.వి.ఆర్) మోసంతో వివాహమాడతాడు. సారంగధరుడు చిత్రాంగిని తల్లిగానే భావిస్తాడు. కాని మోహం తగ్గని చిత్రాంగి సారంగధరుని బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఒకసారి ఆమె సారంగధరుని ఏకాంతంగా కలసి అతనిని కవ్వించడానికి ప్రయత్నిస్తుంది.

మేనకా విశ్వామిత్రుల చిత్ర పటాన్ని సారంగధరునికి చూపించి

భానుమతి: అల్లన గాధిరాజ సుతుడర్మిలి మేనక ముద్దొనర్ప జా
గిల్లి కవుంగలింప దమకించుట గంటివే రాకుమారా! ఆ..

(అల్లన = మెల్లగా; గాధిరాజ సుతుడు = విశ్వామిత్రుడు; అర్మిలి = ప్రేమమున; జాగిల్లు = మోహించు; తమకించు = మోహించు)
(“గాధి రాజసుతుడైన విశ్వామిత్రుడు ప్రేమతో మేనకను ముద్దుచేయడానికి మోహము తో కౌగలించడం చూశావా రాకుమారా” )

అయితే సారంగధరుడు ఒక మాతాశిశువుల చిత్రాన్ని చూపించి అదే పద్యాన్ని భిన్నంగా పలుకుతాడు. “అల్ల నగాధిరాజు” అని ప్రారంభించి అదే పద్యాన్ని పూర్తి చేస్తాడు.

ఎన్ టి ఆర్ : ఔ! అల్ల నగాధిరాజ సుతుడర్మిలి మేనక ముద్దొనర్ప రా
గిల్లి కవుంగలింప దమకించుట బాల్యము కాదె మాతరో..ఓ..

అల్ల (అదిగో) , నగాధిరాజ సుతుడు = పర్వత రాజు హిమవంతుని కుమారుడు మైనాకుడు , అర్మిలి = అపేక్ష; మేనక (హిమవంతుడి భార్య పేరు మైనాదేవి, అవిడనే మేనకాదేవి అని కూడా అంటారు). రాగిల్లి = రంజిల్లు/ ప్రేమించు,.

ఆ విధంగా చిత్రాంగి, సారంగధరుడు వేర్వేరు అభిప్రాయాలను ఒకే పద్యం ద్వారా స్వల్ప సంధి భేదం ద్వారా ప్రకటిస్తారు.

అయితే సారంగధరుని బుట్టలో వేయడానికి చిత్రాంగి మరొక చిత్ర పటాన్ని చూపించి

భానుమతి: అక్కజమీ పటమ్ము గనుమా మురళీధరుడోలలాడు

అమ్మక్కల కట్టు పుట్టముల మాయగ జేకొని కొమ్మ

నెక్కి రండు ఇక్కడనున్న వందుకొనుడీ యను రీతి ఆ..ఆ..

(అక్కజము = ఆశ్చర్యము; కట్టు పుట్టములు = కట్టు బట్టలు; ఓలలాడు = స్నానము చేయు; అమ్మక్కలు = ఆడవాళ్ళు; )

(“ఆశ్చర్యం చూడు, శ్రీ కృష్ణుడు గోపికల కట్టు బట్టలు మాయజేసి కొమ్మ మీద ఎక్కి, ఇక్కడున్నాయి మీ బట్టలు వచ్చి తీసుకోండి అంటున్నాడు” )

ఎన్ టి ఆర్ : నిజమ్ము కంటికిన్ జిక్కని కృష్ణలీలల విశేషమదే కనవమ్మ సూటిగా..ఆ..

(అందుకు కూడ సారంగధరుడు తన నిగ్రహాన్ని ప్రదర్శిస్తూ అవును నిజమే కృష్ణలీలల విశేషమదే చూడు తల్లీ అని మాట మారుస్తాడు)

ఈ పద్యాలు రచించినది సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల, గానం ఘంటసాల, భానుమతి

అతను : అన్నానా? భామిని
ఆమె : ఏమని?
అతను : ఎపుడైనా అన్నానా భామిని
ఆమె : ఏమని?

అతను : అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
మాటవరసకెపుడైనా అన్నానా భామిని! ఎపుడైనా

ఆమె : అన్నానా? మోహనా

అతను : ఏమని

ఆమె : ఎపుడైనా..ఆ..అన్నానా మోహనా

అతను : ఏమనీ

ఆమె : తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని

అతను : ఆహా

ఆమె : తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా.. అన్నానా? మోహనా! ఎపుడైనా

అతను : లోకానికి రాజునైనా.. నీ ప్రేమకు దాసుడనని

ఆమె : హ్మ్..హ్మ్

అతను : లోకానికి రాజునైనా.. నీ ప్రేమకు దాసుడనని
మాటవరసకెపుడైనా.. అన్నానా? భామిని! ఎపుడైనా

ఆమె : నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
అతను : ఆహా
ఆమె : నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
ఆదమరచి ఎపుడైనా.. అన్నానా? మోహనా.. ఎపుడైనా
అన్నానా మోహనా.. ఎపుడైనా
ఆ..ఆ..ఆ..ఆ

ఓ నా రాజ, భానుమతి

అడుగడుగో, భానుమతి

మంగళము

వన్నె చిన్నె పూవా

గగన సీమ

సాగేను బాల,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.