రాశి బరువు అలా తగ్గలేదట

0
148

తారలు తమ ఒంట్లో అధిక బరువును కొవ్వును కరిగించుకోవడం కోసం రకరకాల మార్గాలు వెతికే సంగతి తెలిసిందే. దీనికి ఎవరు మినహాయింపు కాదు. సీనియర్ హీరోలు మొదలుకొని రెండు మూడేళ్ళ క్రితం వచ్చిన హీరో హీరొయిన్ల దాకా ఇవి ట్రై చేస్తూనే ఉంటారు. తాజాగా టచ్ చేసి చూడు – తొలిప్రేమ ట్రైలర్స్ లో హీరొయిన్ రాశి ఖన్నాను చూసిన ప్రేక్షకులు షాక్ తిన్నారు. కారణం తన బాడీలో కనిపించిన మేకొవర్. చాలా మటుకు  బరువును తగ్గించుకుని గతంలో కంటే చాలా స్లిమ్ గా ఫిట్ గా కనిపించింది. ఇలా కావడం కోసం లైపో ఆపరేషన్ చేయించుకుందేమో అన్న కథనాలు కూడా కొన్ని మీడియా వర్గాల్లో వచ్చింది. ఇదే ప్రశ్న తనకు ఎదురైనప్పుడు రాశి ఖన్నా స్పష్టంగా సమాధానంగా ఇచ్చింది.

ఏడాది క్రితం వరకు తాను నటించిన సినిమాల్లో తనను తాను చూసుకునప్పుడు ఉండాల్సినదాని కన్నా అధిక బరువు ఉన్నట్టు తనకే అనిపించిందని రివ్యూలలో కూడా అది ప్రస్తావిస్తూ రాయడం చూసి ఇక తగ్గాల్సిందే అని గట్టిగా నిర్ణయం తీసుకుని డైట్ కంట్రోల్ తో మొదలు పెట్టిందట రాశి ఖన్నా. ఆ తర్వాత రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ కఠినమైన ఎక్సర్ సైజులు చేయటం క్రమం తప్పకుండా తన ట్రైనర్ చెప్పిన పద్ధతులు పాటించడం కష్టంగా అనిపించినా ఇష్టపడి చేయటంతో ప్రస్తుతం ఉన్న షేప్ కి వచ్చిందట.

ఏదైతేనేం స్లిమ్ గా ఉన్న రాశి ఖన్నాను చూసి అభిమానులు సంతోష పడుతుండగా మరీ అతి నాజూకుగా మారి మొహంలో కళ పోగొట్టుకోకని సలహా కూడా ఇస్తున్నారు. ఒక పక్క టచ్ చేసి చూడు లాంటి యాక్షన్ మాస్ సినిమా మరోపక్క తొలిప్రేమ లాంటి క్లాస్ లవ్ స్టొరీతో రెండు డిఫరెంట్ జానర్స్ తో వస్తున్న రాశి ఖన్నా ఇది లక్కీ ఫిబ్రవరి అంటోంది. ఇంకో పది రోజుల్లో ఇది తేలిపోతుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.