శ్రావణ/రాఖీ పౌర్ణమి

0
2417

*_రేపు శ్రావణ పౌర్ణమి_*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*_(హాయగ్రీవ జయంతి,నూలు పున్నమి,రాఖీపౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి)_*

☘☘☘☘☘☘☘☘☘

శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టమైనది
దీనినే రాఖీ పౌర్ణమి అని నూలు పున్నమి అని జంధ్యాల పూర్ణమ అని పిలుస్తుంటారు
ఇదే రోజున హయగ్రీవ స్వామి అవతరించారు..!!
మరి శ్రావణ పౌర్ణమి యొక్క పూర్తి విశిష్టతను తెలుసుకుందాం..!!
నూలు పున్నమి:
పద్మశాలీయులందరికి ప్రత్యేకమైనది
ఈ నూలు పున్నమి.
ఈ రోజు పద్మాశాలి మూలపురుషుల్లో ఒకరైన
భృగు మహర్షి తనయుడు మృఖండ మహర్షి తండ్రి అయిన విధాత మహర్షి జయంతి కూడా
అంతే కాదు శ్రావణ పౌర్ణమి నాడు
మన ఇంటి ఆడపడుచు సాక్షాత్తూ నారాయణుని హృదయ పట్టపురాని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించినది
కనుక ఈ దినమున ప్రతీ పద్మశాలీయులు తమ కులదైవమైన లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తారు.
అంతేకాదు ఈ రోజునే భావనాఋషి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన సహస్రదల పద్మము నుండి తంతువులు గ్రహించి
వస్త్ర సృష్టి నారంభించెనని నుడివి.

_*హయగ్రీవ జయంతి :*_

జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||
శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి.
ఈ అవతారములలోకేల్ల ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే “హయగ్రీవావతరము”.
ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని(శ్రీమన్నారాయణుని) ఉఛ్వాసావతారమే అని ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.
విష్ణుమూర్తి చెవుల నుండి మధుకైఠభులు అనే రాక్షసులు అవతరించి తమజన్మకారకులెవరో తెలియక మూల ప్రకృతియైన ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరిరి.
జగన్మాత అట్లు జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి వలన వరం పొందిరి.
వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైఠభులు బ్రహ్మ వద్ద నుండి వేదములనపహరించి బ్రహ్మాండమంతా జలమయం గావించి పాతాళమున దాగియుండిరి.
మధ్య మధ్య బ్రహ్మను యుద్దమునకు రమ్మని బాధించు చుండిరి.
బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టె బాధలు సహించలేక పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవిష్ణువుకి మొరపెట్టుకొనెను.
నారాయణుడు బ్రహ్మ ప్రార్థనను విని తనదివ్యదృష్టితో సర్వం తెలుసుకొని
“ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి వేదములను తెచ్చి నీకు అప్పగించెదను.
వేదములందిన తరవాత సృష్టిని ప్రారంభించుము. అంతవరకూ నన్ను ఆరాధించుము” అని విష్ణువు బ్రహ్మను ఓదార్చి పంపెను.
వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్ఛ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన అశ్వముఖధారి అయినటువంటి “హయగ్రీవ స్వామి” అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదములను, వేదవిద్యలను ఉద్ధరించి, బ్రహ్మకప్పగించెను.
వేదాధిపత్యమును బ్రహ్మకును, సకలవిద్యాధిపత్యమును సరస్వతికిని అప్పగించెను.
అప్పటినుండి బ్రహ్మ వేదప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యెను. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.
ఈ హయగ్రీవ జయంతి నాడు విద్యార్థులు ఈ స్వామిని పూజించినచో మంచి విద్యావంతులు కాగలరు.

_*జంధ్యాల పౌర్ణమి :*_

శ్రావణ పౌర్ణమి నాడు యజ్ణోపవీతధారులైన ద్విజులందరూ నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఎందుకంటే సంవత్సరం అంతా ఏమైనా గాయత్రీ జపలోపం జరిగినా అనుష్టాన లోపాలేమైనా ఉన్నా వాటికి ప్రాయశ్చిత్తంగా ఉపాకర్మ చేసి నూతన యజ్ఞోపవీతధారణ జరుపుతారు.

_*రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం) :*_

_*రక్షబంధ శ్లోకం:-*_

_*“యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః*_
_*తేనత్వాం అభి బధ్నామి రక్షే మాచల మాచల”*_
ఈ రోజు రాఖీ పండుగను సోదరసోదరీమణుల అన్యోన్యతకు గుర్తుగా జరుపుకుంటారు. అక్కచెల్లెళ్ళు తమ సోదరుల నుండి రక్ష కోరుతూ, సోదరులకు రక్ష కడతారు.
పదికాలాలు తమను చల్లగా కాపాడమని కోరుకుంటారు.
ఇంతే కాక ఈ రక్షవలన సోదరునికి అపమృత్యుదోషాలు పూర్తిగా తొలగింపబడుతాయని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సుఖ సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ కూడా ఈ రక్ష కడతారు.
తమ క్షేమాన్ని ఎల్లపుడూ కోరుకునే సోదరీమణులకు సోదరులు తమ శక్తి కొలది బహుతములు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
దీనికి రక్తసంబంధంతో పనిలేదు, ఎవరైనా సరే, తన సోదరుడిగా భావించుకునే సోదరి కేవలం రక్షాబంధనంతో ఆ బంధాన్ని శాశ్వితం చేసుకుంటుంది.

రాఖీని క‌ట్టేట‌ప్ప‌డు *_`యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||`*_అన్న స్తోత్రాన్ని కూడా చ‌దువుతారు. `ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బ‌లిచక్ర‌వ‌ర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇత‌ణ్ని అన్ని కాలాల‌లోనూ విడ‌వ‌కుండా ఉండు` అని దీని అర్థం.

 

https://wishesdisney.com/rakhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.