పల్లెటూరి పుట్టగొడుగుల కూర

0
532

పల్లెటూరి పుట్టగొడుగుల కూర:
పుట్టగొడులకు కొంచెం మసాలా కారంగా పట్టించినట్లైతే ఆ స్పైసీ సువాసనతో నోరూల్సిందే. మష్రుమ్ చాలా సున్నితంగా స్పాంజ్ లాగా ఉంటాయి. వీటిని నీటిలో వేసి కడిగితే విరిగిపోతాయి. కాబట్టి ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకుండా నీటిలో వేసి తీసేయాలి. లేదా పొడి బట్టతో సున్నితంగా తుడిచేయవచ్చు. పుట్టగొడులల్లో ఫ్రైబర్(పీచు)ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో నీటిశాతం ఎక్కువ మరియు సోడియం కూడా ఉంటుంది. బరువు తగ్గించే ఉత్తమమైన ఆహారం కూడా. అధిక బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఇందులో ఉంటాయి.

కావలసిన పదార్థాలు:

మష్రుమ్: 1cup
ఆవాలు: 1/4tsp
జీలకర్ర: 1/4tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా కోసం
ఉల్లిపాయ(చిన్నగా కట్ చేసుకోవాలి): 1
టమోటో(చిన్నగా కట్ చేసుకోవాలి): 1
పుదీనా ఆకులు: 6
కొత్తిమీర తరుగు: 2tbsp
జీడిపప్పు: 5
పచ్చిమిర్చి: 5

తయారు చేయు విధానం:

1. ముందుగా మసాలాను తయారు చేసుకోవాలి. అందుకోసం రెడీ చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో శుభ్రం చేసుకొన్న మష్రుమ్ ను వేసి కొద్దిగా ఫ్రై చేసి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, అందులో మసాలా పేస్ట్ వేసి తక్కువ మంట మీద మసాలాను బాగా వేయించాలి.
4. మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే సమయంలో వేయించి పెట్టుకొన్న మష్రూమ్ ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును అందులో వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
5. తర్వాత మూత పెట్టి అతి తక్కువ మంట మీద మష్రుమ్ ను ఉడికించుకోవాలి. అంతే మష్రుమ్ మసాలా రెడీ. ఇది చపాతీ, రోటీలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.