పొట్ట కరిగించే మార్గాలు

0
613

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
* పొట్ట కరిగించే మార్గాలు*
**********************
సన్నగా ఉన్న వారిలో కూడా పొట్ట ఉంటుంది. ఆహార నియమాలు, జీవన విధానాలు బట్టీ ఉదరభాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుది. ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. పొట్ట మొత్తం బాడీషేప్‌ని పాడు చేస్తుంది. మన అవుట్ లుక్ ను అసహ్యంగా మార్చి వేస్తుంది. అయితే ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవొచ్చు. ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోవాలి. బరువు ఎంత అధికంగా ఉన్నామో కూడా పరీక్షించుకోవాలి. ఇక రెండు వారాల్లో రెండు ఇంచుల పొట్ట తగ్గించుకుంటానని మీరు నిర్ణయించుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వాటిని తప్పకుండా పాటించాలి.

పొట్ట తగ్గించుకోవడం కోసం మీరు కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటూనే మీరు మీ సమస్యను పరిష్కరించుకోవొచ్చు. హెల్తీ ఫుడ్స్ ను మీ డైట్ చేర్చుకుని కాస్త తేలికపాటి వ్యాయామాలు చేస్తే చాలు. ఇంకెందుకు ఆసల్యం. కింది ఇచ్చిన వాటిని మీ డైట్ చేర్చుకోండి. రెండు వారాల్లో మంచి ఫలితాలు పొందండి. స్టమక్ పై వార్ ప్రకటించండి. సమస్యను అధిగమించండి.

జనపనార గింజలు
**************
మీరు రోజు తీసుకునే డైట్ లో కచ్చితంగా జనపనార గింజలు ఉండేలా చూసుకోవాలి. ఇవి పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. దీనివల్ల రెండు వారాల్లో మీ పొట్ట సైజ్ రెండు ఇంచుల మేరకు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. అలాగే ఇవి మన శరీరానికి కావాల్సిన ఇరవై అమినో ఆమ్లాలను అందిస్తాయి. ఫైబర్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. అమోఘమైన మినరల్స్ ను కలిగి ఉంటాయి. జీవక్రియ సక్రమంగా కొనసాగేలా చేస్తాయి. ఒమేగా -3, ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. జనపనార విత్తనాలు విటమిన్ ఇ, భాస్వరం, సోడియం, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ లను కలిగి ఉంటాయి. ఇందులో ఉంటే ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని హానికర యాసిడ్స్ బయటకు వెళ్లేలా తోడ్పడుతాయి. దీంతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. మీ స్లిమ్ గా తయారవుతారు.

మొలకెత్తిన గింజలు
*****************?(
మొలకెత్తిన గింజల్లో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. శనగలు, పల్లీలు, పెసర్ల వంటి విత్తనాలకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి. చిక్కుళ్లు, సోయా వంటి లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయల విత్తనాలను కూడా మొలకెత్తించినపుపడు మంచి పోషకాహారంగా పనిచేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణప్రక్రియ ద్వారా చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలుగా విడిపోతాయి. ఇవి ఇలా విడిపోవడానికి సహకరించే కొన్ని రకాల ఎంజైమ్‌లు మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఎంజైమ్‌ల కన్నా మరింత శక్తిమంతంగా పనిచేస్తాయి. శరీరంలోని ఎంజైమ్‌ల చర్యాశీలతను పెంచుతాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్‌లపై పనిచేసే అమైలేజ్ ఎంజైమ్ చురుకుదనం మరింత పెరుగుతుంది. కాబట్టి మొలకెత్తిన గింజలను భోజనంలో భాగం చేసుకుంటే జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. రెండు వారాల్లో మీరు స్లిమ్ గా తయారువతారు. మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ బి 30 శాతం, విటమిన్ సి 60 శాతం ఉంటాయి.ఇవి అధిక బరువును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి. మాంసాహారం నుంచి లభించే కొవ్వును శరీరంలో కలవకుండా చేస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. అందువల్ల ఇవి బరువు తగ్గించుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలకు పచ్చి క్యారెట్లను కలిపి తీసుకుంటే దాని వల్ల బీటా కెరోటిన్ సమృద్ధిగా అందుతుంది.

వ్యాయామం
***********
పొట్ట తగ్గాలంటే మీరు వ్యాయామం కూడా బాగా చేయాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60నిమిషాల దాకా తీసుకెళ్ళాలి. సాధారణ వాకింగ్ 2 వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌వాకింగ్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్ క్రంచెస్ ప్రారంభించాలి. వీటిలో విభిన్న రకాలున్నాయి. వీటిలో నుంచి అనువైనవి ఎంచుకుని సాధన చేయాలి. వీటితో పాటుగా సైడ్ బెండ్స్, యోగాసనాలు, లైట్ వెయిట్స్‌తో స్ట్రెంగ్త్ ట్రయినింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి కూడా వీలునిబట్టి అపుడపుడు జత చేస్తుండాలి. రోజుకి 30నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా రెంBడు వారాలు చేశాక పొట్ట ప్రాంతంలో వచ్చిన మార్పుని, బరువు పరంగా వచ్చిన ఫలితాల్ని బట్టి పెంచుకుంటుండాలి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.