ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే నువ్వులు

0
1022

ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే నువ్వులు..

శరీరానికి ఎముకలు ఆధారం. అలాంటి ఎముకలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే.. జింక్, క్యాల్షియం, ఫాస్పరస్ అధికంగా వుండే నువ్వుల్ని తీసుకోవాలి. ఇవి ఎముక మజ్జ ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎముకలకు పుష్ఠినిస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటూ, గుండె జబ్బుల్ని అదుపులో పెట్టుకునే వీలుంటుంది. అలాగే అవిసె గింజలు కూడా ఎముకలకు మేలు చేస్తాయి.

వీటిలోని ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను ఆరోగ్యంగా వుంచుతాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తాయి. నెలసరి సమస్యలను అదుపులో వుంచుతాయి. బరువు కూడా సులువుగా తగ్గవచ్చు. అవిసె నుంచి అందే మాంసకృత్తులు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అలాగే గుమ్మడి గింజల్లో శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలన్నీ వుంటాయ. వీటిని తీసుకుంటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా హృద్రోగాలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.