హాయిగా నిద్ర పోవటం ఓ అందమైన కల

0
655

హాయిగా నిద్ర పోవటం ఓ అందమైన కల…

ఎక్కువగా నిద్ర పోవటం, తక్కువగా నిద్ర పోవటం ఆరోగ్య కరమైన లక్షణాలు కావు

నిద్ర అన్నది ప్రతి వ్యక్తి కీ ఎంతో అవసరం . నిద్ర లో మెదడు కాస్త రెస్ట్ తీసు కుంటుంది . పిల్లల కు ఎక్కువ గంటలు నిద్ర పోతారు . వయసు మీద పడే కొద్దీ నిద్ర పోయే సమయం తగ్గి పోతుంది
సామాన్యం గా యువతీ యువకులకు రోజుకి 8 గంటలు, వృద్ధాప్యం లో ఉన్న వారికి 6 గంటల సేపు నిద్ర సరి పోతుంది
నిద్ర లేమి కి అనేక కారణాలు
1. ఆందోళన , మానసిక సమస్యలు
2. డిప్రెషన్ వ్యాధి
3. హైపర్ టెన్షన్,
4. అతిగా భోజనం చెయ్యటం — దీనికి నివారణ . నిద్ర పోయే ముందు గంట దాకా ఏమీ తిన గూడదు . కడుపు లో కొంత ఖాళీ ఉంచాలి
5 బ్రెయిన్ లో జరిగే రసాయనక చర్యలు, ట్యూమర్ లు — దీనిని బ్రెయిన్ EEG , స్కానింగ్ తీయటం ద్వారా పసిగట్ట వచ్చు

పగలు శారీరక శ్రమ లేక పోవటం, పగలు నిద్ర పోవటం
టీ వీ , కంప్యూటర్ ల ముందు ఎక్కువ సమయం కూర్చొనే అలవాటు పెరగటం
కాఫీ, టీ లు, స్పైసి ఫుడ్ ను పడుకునే ముందు తీసు కోవటం

సెక్సువల్ లైఫ్ లో అసంతృప్తి,
నిద్ర పోయే ముందు భార్యా భర్తల మధ్య ,ఇతర కుటుంబ సభ్యుల తో కలహాలు

డిప్రెషన్, ఆందోళన కి తీసుకునే మందుల వలన, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించే మందుల వలన, లివర్ లో ప్రాబ్లం లు ఉన్నా కూడా నిద్ర పట్టదు..
ఈ మధ్య అమెరికా ఇతర దేశీయుల టైం కి అనుగుణంగా software ఇంజనీర్ లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పని చేయవలసి వస్తున్నది . దాని మూలంగా బయోలాజికల్ clock లో తేడా రావటం వలన సరి అయిన వేళ కి నిద్ర పట్టటం లేదు
మన చేతుల్లో ఉన్న పని — నిద్ర పట్ట టానికి
1. బెడ్ రూం శుభ్రంగా ఉండటం . గోడల మీద రంగులు ముదురుగా కాకుండా లేతవి ఉండటం
2. మరీ చీకట్లో కాకుండా డిం లైట్ వేసు కోవటం
3. పడుకునే ముందు మనసుకు హాయి నిచ్చే సంగీతాన్ని వినటం, హాస్య భరిత పుస్తకాలు చదవటం, కార్టూన్స్ చూడటం
4. వీలు అయితే , ఓ సారి గోరు వెచ్చని నీళ్ళ తో స్నానం చెయ్యటం
5. రేపటి గురించి చింతను వదిలి వేయటం

ఏవో కొన్ని రోజులు సరి అయిన నిద్ర పట్టక పొతే అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు . కానీ ప్రతి దినమూ నిద్ర లేమి తో బాధ పడుతుంటే , మంచి డాక్టర్ ను కలవాలి . తమ కి ఉన్న వ్యాధులు, వాడుతున్న మందులు అన్నీ డాక్టర్ గారికి చెప్పాలి . అయన బ్రెయిన్ లో ఏమైనా లోపం ఉందేమో అని అనుమానిస్తే, neuro సర్జన్ కి refer చేస్తారు . మానసిక సమస్యల వలన నిద్ర పట్టక పొతే సైకియాట్రిస్ట్ ను కలవాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.