సినిమా పేరు : “కళ్ళు”

1
818

సినిమా పేరు : “కళ్ళు”…..
సరిగ్గా 30 ఏళ్ల క్రితం రిలీజ్..
9 నంది అవార్డులు..
2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు..
40 ఇతర సంస్థల అవార్డులు..

అయినా ఇప్పుడున్న వాళ్లలో 70% మంది చూడని సినిమా ‘కళ్ళు’.. కారణం..
ఇప్పటివరకు ఏ టీవీ చానల్ ఈ సినిమా ని కొనలేదు,
ఇప్పటివరకు ఎక్కడా రాలేదు,
ఏ యూట్యూబ్ లోనూ లేదు.. ఎందుకంటే ఇందులో బిజినెస్ వచ్చే హీరోలు,హీరోయిన్స్, ఘాటైన ముద్దులు, మితిమీరిన సెక్స్, ‘బొక్కలే’ అనే డబల్ మీనింగ్ డైలాగ్స్, విలనింట్లో హీరో జిమ్మిక్కులు, ప్రాసలతో మాటలు, పిచ్చి కామెడీలు లాంటివి అస్సలు లేవు.. కాబట్టి ఎవరూ టీవీల్లో వెయ్యలేదు, ఎవరూ చూడలేదు..

ఈ “కళ్ళు” అనే సినిమా, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న అర్థంపర్ధంలేని ‘కల్ట్’ సినిమా కాదు, నిజమైన కల్ట్ మరియు సహజంగా ఉండే అద్భుతమైన సినిమా..
నిజానికి ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి నాటిక..
దాన్ని అత్యంత అద్భుతమైన రీతిలో తెరకెక్కించి సినిమా గా మలిచిన వారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎం. వి.రఘు.. శ్రీ వంశీ, శ్రీ కె. విశ్వనాధ్ లాంటి ఎందరో దిగ్దర్శకుల సినిమాలకు ఫోటోగ్రఫీ అందించిన టెక్నీషియన్ ఆయన..
ఈ సినిమా కు సంగీత దర్శకుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.. ఇందులో “తెల్లారింది లెగండోయ్” అనే శ్రీ సిరివెన్నెల పాట చాలామందిని మత్తు నిద్ర నుండి మేల్కొలిపింది..

నాకింకా గుర్తున్న, ఆశ్చర్యకరమైన జ్ఞాపకం, అప్పట్లో పేపర్లో చదివిన విషయం ఏంటంటే….ఈ సినిమా కోసం చేసిన హోమ్ వర్క్.. ఇందులో ప్రధాన పాత్రలు గుడ్డి భిక్షగాళ్ళు.. ఈ పాత్రలు వేసిన నటుల్ని డైరెక్టర్ శ్రీ M.V. రఘు నిజంగానే వైజాగ్ రోడ్స్ మీద కొన్ని రోజులు అడుక్కోమని వదిలేసి,నిజమైన స్థితిగతులు తెలుసుకుంటూ షూటింగ్ చేసారట..
ఎన్నో ప్రయోగాలు.. ఎన్నో ప్రయాసలు..
ఎన్నో పురిటినొప్పులు.. మరెన్నో తిప్పలు..
అన్నిటినీ అధిగమించి సినిమా విడుదలైన తర్వాత అవార్డులు, విమర్శకుల ప్రశంసలు తప్ప ఆర్ధికంగా లాభపడినట్టు గుర్తులేదు నాకు..

మళ్ళీ ఇన్నాళ్ళకి, విడుదలైన 30 ఏళ్ల తర్వాత ‘ఈ టీవీ’ పుణ్యమా అని మనందరం చూసే భాగ్యం కలుగుతుంది.. అంటే 12-8-2018 ఆదివారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రసారం కాబోతోంది..
దయచేసి చూడండి ఈ రోజు చెప్పను.. మీ అదృష్టం బాగుంటే చూడగలరు అంతే..

నోట్ : తెలుగులో కూడా గొప్ప సినిమాలున్నాయి, వాటిని మేం కూడా చూసాం అని మనం రొమ్మువిరుచుకునే సినిమాల్లో “కళ్ళు” కూడా ఒకటి..
కాబట్టి మిగతాది మీ ఇష్టం..

Read this also

1 COMMENT

  1. […] post సినిమా పేరు : “కళ్ళు” appeared first on Fun […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.