“MARRI OODALA TAILAM” for new hair to grow and to get bald head to thick hair

0
36

Health:
🔱🌞

మర్రి ఊడల తైలం :

మర్రి ఊడల లాంటి వెంట్రుకల కోసం అనుభవం తైలం.

“MARRI OODALA TAILAM” for new hair to grow and to get bald head to thick hair.

బట్టతల పొయి చిక్కని వెంట్రుకలు వచ్చేదానికొసం.

పచ్చి మర్రి ఊడల కసాయం 10 లీటర్లు,
పచ్చి సరస్వాతాకు రసం 10లీటర్లు
పచ్చి గుంటగలగరాకు రసం 10లీటర్లు
పచ్చి గోరింటాకు రసం 10లీటర్లు
మేక మూత్రం 10లీటర్లు
ఆవుమూత్రం 10లీటర్లు
బాదాం పప్పు 100గ్రా
కొబ్బరి కురిడి 100గ్రా
మామిడిజీడి 100గ్రా
నేపాలపు పప్పు 100గ్రా
గురి గింజలు 100గ్రా
నాభి 100గ్రా
చంగల్వకోస్టు 100గ్రా
కచ్చూరములు 100గ్రా
వట్టివేరు 100గ్రా
కురువేరు 100గ్రా
జటామాంసి 100గ్రా
మరువము అకుల రసం 100గ్రా
దవనము ఆకుల రసం 100గ్రా
నల్లకలువ పువ్వుల రసం 100గ్రా
మందార పువ్వుల రసం 100గ్రా
తామర కేశరములు 100గ్రా
చామంతి పూవుల రసం 100గ్రా
గులాబి పువ్వుల రసం 100గ్రా
గోమూత్రం శిలాజిత్ 100గ్రా
మేక కొమ్ము కాల్చినది 100గ్రా
మహిసాక్చి గుగ్గులు 100గ్రా
చెరువుల యందుండు నాచు రసం 100గ్రా
మెగలి పువ్వుల రసం 100గ్రా

నల్ల నువ్వుల నూనె 5 లీటర్లు

ఈ పై చెప్పిన అన్ని వస్తువులు మంచి నాన్యతకలవి, మెదట చెప్పిన పచ్చిఆకుల రసం కచ్చితంగా పచ్చివే తీసుకొని, మిగిలిన వస్తువులు ఎండినవి లేదా పచ్చివి ఇచ్చిన మెతాదు తీసుకొని, భాగా చిన్న చిన్న ముక్కలు గా చేసి, మిగిలిన వస్తువులు కొన్ని వస్తువుల రసాలు తీసుకొని అన్నీ కూడా పెద్ద ఇనుప పాత్రలో వేసి, పై అన్ని మూలికల రసాలు ఇగిరిపొయి కేవలం నూనె మాత్రమే వుండు వరకూ మెల్లగా మరిగించి, ఈ నూనెని తీసుకొని భద్రపరచి సుమారు పై ప్రకారం చేస్తే మీకు నూనె 3 లీటర్లు చేతికి రావొచ్చును. ఈ నూనె చాలా శక్తి వంతమైనది.

ఈ నూనె మీరు వెంట్రుకలు లేని చోట వెంట్రుకలు పలుచగా వున్న చొట, వెంట్రుకలు తెల్లగా అయినచోట పూస్తె, మీ అన్ని సమస్యలు పోయి మీకు కొత్త వెంట్రుకలు వస్తాయి, బట్టతల మీద కూడా వెంట్రుకలు మెలుస్తాయి, పలుచుగా వున్నచోట వెంట్రుకలు వస్తాయి, తెల్లని వెంట్రుకలు నల్లగ మారుతాయి, సన్నని పేలగా వున్న వెంట్రుకలు లావుగా బలంగా మారుతాయి, మీ వెంట్రుకలు ద్రుడంగా మారి మీ జుట్టు మర్రిఊడల్లాగా ఒత్తూగా మారుతుంది.
చిక్కగా వెంట్రుకలు వస్తాయి,

కొద్దిగా కస్టమైన అందరూ చేసుకొని వాడండి, మీ కేశ సంరక్చణకై, అలాగే కేశసొందార్యాని కోసం అమేఘంగా పనిచెయు మర్రిఊడల తైలం

పచ్చి మర్రి ఊడలు 5కేజీలు తీసుకొచ్చి కచ్చా పచ్చాగ దంచి, ఇందులో 40 లీటర్ల నీరు పొసి 10 లీటర్ల నీరు మిగిలేవరకూ మరిగించి ఈ కసాయాన్ని పై తైలంలో మెదట చెప్పిన మెతాదుగా వేసుకొవాలి.

మీరే చేసుకొని వాడండి శ్రమకుతగ్గ ఫలితం వుండును.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.