అద్బుతమైన తెలివి తేటలు కల కుక్క

0
168

ఒక కిరాణా షాపు వాడు షాపు కట్టేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, నోట్లు ఉన్నాయి. షాపువాడు ఆశ్చర్యపోతూనే సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికందించాడు. అది అక్కడినుంచి కదిలింది. షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్ లో నిలబడింది. వస్తున్న బస్ ల నెంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్ రాగానే ఎక్కింది.

కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటిమెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండటం తో అందలేదు. కాళ్ళతో తలుపుని కొట్టింది. ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంట. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. కుక్క ఇంటి పక్కవైపు వెళ్ళి బెడ్ రూం కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాదసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తరువాత క్రిందికి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది. షాపు వాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంబ్రమం తో చూస్తున్నాడు.

అప్పుడే నిద్ర లోంచి లేచి బయటకొచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్న సాగాడు. ఆ కిరాణా వాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి ” ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు బుద్దుందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్క అద్బుతమైన తెలివి తేటలు కల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలిలాంటి తెలివైన కుక్క ని ఈ ప్రపంచం లోనే చూడలేం” అన్నాడు చాలా ఉద్వేగం గా. ఆ యజమాని దానికి సమాదానం ఇస్తూ..

” ఇది తెలివైందా? బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్ళకుండా వెళ్ళి తిరిగొచ్చి డిస్టర్బ్ చేయటం ఈ వారం లో ఇది రెండో సారి” అన్నాడు.

“నీతి: నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి నచ్చకపోతే అవి వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త గానీ, భార్య గానీ కుటుంబ సభ్యులు గానీ వాటిని గుర్తించకపోతే వృదా”…అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ..కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని వుండక నీ అవసరం వున్న చోట నీ తెలివి తేటలు నీ శక్తి సామర్థ్యములు చూపించి..కీర్తిని గడించి..జీవితంలో ఎదగడం నేర్చుకోండి మిత్రులారా…ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన..ముఖ్య విషయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.