కొత్తిమీర చట్నీ

0
1290

కొత్తిమీర చట్నీ .

కొత్తిమీర — ఒక కప్పు.
తురిమిన పచ్చి కొబ్బరి — ఒక కప్పు.
పచ్చిమిర్చి — ఎనిమిది .
చింతపండు — ఉసిరి కాయంత.
ఇంగువ — కొద్దిగా .
ఉప్పు — తగినంత .

తయారీ విధానము .

ముందుగా రోటిలో పైన కొత్తిమీర , పచ్చి కొబ్బరి , పచ్చి మిర్చి , చింతపండు , ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసుకుని పచ్చడి బండతో నూరు కోవాలి .

నూరిన పచ్చడి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే మూడు ఎండుమిరపకాయలు , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకుని పచ్చడిలో వేసుకుని స్పూనుతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి ఇడ్లీ , దోశెలు , వేడి వేడి పూరీలు మరియు భోజనము లోకి సిద్ధం .

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.