కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ఉలవచారు..?

0
268

*కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ఉలవచారు..?*

ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమేమిటంటే..? ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. క్యాల్షియం, ఫాస్పేట్స్, ఆక్సిలేట్స్, రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.

కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే.. ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవాలంటే..
తులసి రసం: ముందుగా తులసీ ఆకులతో రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆరు నెలలు ఇలాగే చేస్చే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

కొండపిండి కషాయం:
కొండపిండినే పాషాణభేది అంటారు. ఈ మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటిలో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30. మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడు పూటలా తీసుకోవాలి. లేదా కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకుని తినటం అలవాటు చేసుకోవాలి. మూడు నెలల్లో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

ఉలవచారు: కావలసినవి… ఉలవలు-ముల్లంగి ఆకులు, నీరు. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారును రోజు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు –

* చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .

* దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో “samniferin ” అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

* ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును

* జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును.

* పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును .

* విరేచనం సాఫీగా అయ్యేలా చేయును .

* విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.

* రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి

* వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును .

* శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును .

* శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును .

* వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి.

* థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .

* మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు .

* తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .

* గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .

* స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.

* చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును .

* క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు .

* ఇది మంచి రసాయనిక ఔషదం ప్రతి ఒక్కరు తప్పకుండా వాడుకోవలసిన ఔషదం ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ ఔషదాన్ని వాడటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి , నరాలకు సత్తువ పెరుగును .

గమినిక –

సరి అయిన పద్దతుల్లో శుద్ది చేసినటు వంటి అశ్వగంధ చూర్ణంని మాత్రమే వాడవలెను . ఈ అశ్వగంధని నాటుఆవుపాలతో శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే సరైన ఫలితాలు ఇస్తుంది. మొత్తం 11 సార్లు నాటు ఆవుపాలతో శుద్ది చేయవలెను . ఇది తెల్లగా , క్రీము రంగులో ఉంటుంది. మార్కెట్ లో ప్రస్తుతం దొరికేటువంటి అశ్వగంధ చూర్ణం బ్రౌన్ రంగులో ఉంటుంది. అంత మంచి ఫలితాలు ఇవ్వదు. మంచి అనుభవ వైద్యుల సహాయంతో అశ్వగంధ చూర్ణాన్ని తయారుచేయించుకొని వాడుకోగలరు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.