Jwalamukhi Temple

0
1519

అక్బర్ , షాజహాన్ , ఔరంగజేబ్ ఎంత ప్రయత్నించినా ఆరని జ్వాల …

అక్బర్ ఈ జ్వాలాముఖి గుడిని నాశనం చేసే ఉద్దేశ్యంతోనే వచ్చాడు. అఖండ జ్యోతిని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. రెండడుగుల మందంగల ఇనుప దిమ్మలను పెట్టించాడు ఆ జ్యోతిపైన ఈ సృష్ఠి మొదలైనప్పటినుండి ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే వుంది. తన తరం కాలేదు. అలాంటి నాలుగైదు దిమ్మలు పెట్టిచాడు. ఆ ఇనుప దిమ్మల మధ్యనుండి జ్యోతి పైకి వచ్చింది. ఈరోజునకూడా ఆ ఆనవాళ్లు కనబడతాయి. అక్బర్ తన తప్పును తెలుస్కుని అమ్మవారి క్షమను అర్ధించి బంగారు ఛత్రం చేయించి సమర్పించుకున్నాడు .నేటికి ఆ ఛత్రాన్ని ఆలయంలో మనం దర్శించవచ్చు. ఆ తర్వాతనే హిందూ మతాన్నికూడా గౌరవించడం మొదలుపెట్టాడు. రాజ్యంలో బీర్ బల్ అనే పండితుడికి స్థానం కల్పించాడు. హిందూ రాజకుమారిని వివాహం చేసుకున్నాడు.

షాజహాన్ ఈ జ్వాలలను తానూ ఆర్పుతానని కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు తెప్పించి ధారాపాతంగా పోయించాడు .ఎన్ని రోజులు ఇలా నెలలు పోస్తున్నా జ్వాలలు ఆరలేదు సరికదా నీటి సమస్య వచ్చింది,రాజ్యంలో ఎక్కడ ఒక్క నీటి చుక్క లేకుండా చెరువులు బావులు ఇంకిపోయాయి .అప్పుడు అమ్మవారి శక్తిని అంగీకరించి క్షమాపణ కోరి వెనుదిరిగాడు.

ఔరంగజేబు , అక్బర్ షాజహాన్ చేయలేని పనిని తను పూర్తి చేస్తానని బయల్దేరాడు సైన్యంతో సహా. కాని పఠాన్ కోట్ తర్వాత ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా మాత గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి తేనెటీగలు వాడి సైన్యాన్ని చుట్టుముట్టి చంపేశాయి. బతుకు జీవుడా అనుకుంటూ ఆగ్రా పారిపోయాడు. ఈ రోజుకీ కాగడా మాత, జ్వాలాజీ మాత గుళ్లలో ఆ ఆనవాళ్లు కనబడతాయి. తొమ్మిది రంగులలో గోడమీద జ్వాల వెలుగుతూంటుంది ఈ రోజుకికూడా. మినుకు మనుకు మంటూ ఆరడానికి సిధ్ధంగా వున్న జ్యోతి ఎప్పటినుండి అలా వెలుగుతోందో ఆర్కియాలజిస్టుల దగ్గర వున్న పరికరాలు కూడా చెప్పలేకపోతున్నాయి.

హిందూ మతాన్ని విమర్సించే జన అఙ్ఞాన వేదిక వాళ్లకు ఈ గుడి చూపించండి చాలు. ఎందుకంటే NASA scientists కూడా చాలా ప్రయోగాలు చేశారు. కింద భూమిలో పెట్రోలుందని తవ్వి చూసి అలాంటిదేమీ లేదని జుట్టుపీక్కుంటూ వెళ్లిపోయారు. ఆ గుడిలోనే గోరఖ్ నాథుడి ఉపాలయం వుంది. ఎలాంటి వెంటిలేషన్ లేనిచోట ఒక గొయ్యి ప్రక్కనే ఒకటిన్నర అడుగు ఎత్తు వరకూ అఖండ జ్యోతి వెలుగుతూంటుంది. మామూలుగానైతే ఆ గోతిలోని నీరు వేడెక్కిపోవాలి. కానీ ఆ నీరు చల్లగా ఫ్రిజ్ వాటర్ మాదిరి చల్లగా వుంటాయి. ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి మాడి మసైపోవాలి కాని అలా జరగదు. ఈ ఔరంగజేబు ఉదంతం తర్వాతే ఆ గుడికి ప్రాముఖ్యత లేక దాదాపు జీర్ణవ్యవస్థకు చేరుకుంది. ఈ మధ్య దానినికూడా బాగు చేశారు.

ఈ ఆలయంలో 9 జ్వాలలు ఉంటాయి … ఆ జ్వాలలు నవ దుర్గా స్వరూపిణిలుగా ఆరాధించబడుతున్నారు … ఈ తొమ్మిది జ్వాలలను ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఖంగ్ర లో ఉన్నది.

How to reach Jwalamukhi Temple

BUSES : Direct buses that ply from New Delhi to Kangra makes the travel convenient. It takes around 13 hours and the fare is approximately 900 INR. You can reach Jwalamukhi bus stand to reach the temple.

TRAINS : There are no direct trains for Kangra. Amritsar Stabdi Express run from New Delhi to Jalandhar. You can take a cab from Jalandhar and reach the valley.

FLIGHTS : Gaggal Airport is the nearest airport at a distance of approximately 14 km from the Kangra valley. You can take a flight from Delhi to Dharamshala and then book a cab further.

ఓం శ్రీ మాత్రే నమః

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.