ఇంద్రియ పుష్టి

1
672

●●●●●●●●●●●●●●●●●
ఇంద్రియ పుష్టి
★★★★★★★
1. ఎండు ఖర్జూర, బాదాం, పిస్తా, అక్రోట్, ఏలక్కాయ మెత్తగాదంచి
ఆవుపాలతో సేవించిన ఇంద్రియం చిక్క బడి ధాతుపుష్టి కలుగును.
2 నల్ల నువ్వులు, కొబ్బరి, బెల్లం దంచి ఆకలిని బట్టి 4 లేదా5 లడ్డూలు తిని పాలు త్రాగి న స్ర్రీ పురుషులకు విశేషమైన బలము కలుగును
3. తేనె, నెయ్యి, నువ్వులు 1స్పూను నెయ్యి 2 రెండు స్పూనుల
నూనె 3 స్పూనుల తేనె కలిపి ఉదయం సేవించుచుండిన ధాతు పుష్టి శరీర ధారుఢ్యము కలుగును.
4. పచ్చి కొబ్బరి బెల్లం తినాలి
5 సాలన్ మిశ్రీ, సఫేద్ మిశ్రి, యష్టిమధుకము, కలకండ 1 స్పూ
ఆవు పాలతో సేవించిన వీర్య వృద్ధి కలుగును.
6. ఒక గ్లాస్ పాలు ఒక అరటిపండు చక్కెర కొద్దిగా వేసుకొని, మిల్క్ షేక్ లాగా చేసుకుని రోజు తాగలి

****************************
వాము పొడి రెండు గ్రాములు తేనె ఒక చెంచా కలిపి రెండుపూటలా వింటుంటే తల్లి పాలు పెరుగుతాయి

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻మెులకెత్తిన గింజలు తింటుంటాం కదా… వాటిలో ఏముంటాయో తెలుసా?*

మెులకలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అన్ని వయసుల వారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆహారం ఇవి. పెసలు, బఠాణీలు, సెనగ మెులకల్లో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం.

పెసల మెులకల్లో విటమిన్ సి, కె అధికంగా లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణాలున్నాయి. దీని పొట్టులో ఫొలేట్ అధికంగా ఉంటుంది. గర్భిణులకు, గర్భస్థ శిశువుకు ఇదెంతో సహాయపడుతుంది. దీనిని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవాలి. అలాగని అతిగా తినకూడదు జాగ్రత్త. మొలకలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది.

బఠాణీలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. ఈ మెులకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వును తొలగించుటలో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్లు వీటిని తీసుకుంటే మంచిది. వీటిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

సెనగలలో విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. వీటిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. అలర్జీలతో బాధపడేవారికి సెనగలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మధుమేం ఉన్నవారు వీటిని తీసుకుంటే షుగర్ శాతం అదుపులో ఉంటుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.