How to reduce bad cholesterol naturally

0
248

*నాచురల్ కొలెస్ట్రాల్ – సహజ సిద్దంగా కొవ్వును కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆరు మార్గాలు*
*****************************

*ఈ ఆధునిక ప్రపంచంలో 80 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు అందుకు ముఖ్య కారణం అధిక కొవ్వు. ఎప్పుడైతే మీరు అధిక కొలెస్ట్రాల్ గురికాకుండా ఉంటారో అప్పుడు సాధారణంగా ఉంటారు. low density lipoprotein లేదా LDL bad కొలెస్ట్రాల్ నిదానంగా క్రమంగా వ్యాప్తి చెందుతుంది. How to reduce bad cholesterol naturally.*

కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గించుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామం చేయడం, ఇతర కష్టతర పనులు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ వుంటుంది. అది వల్ల షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. అలాగే టైప్2 డయాబెటిస్‌ను ఉల్లిపాయ నివారిస్తుంది. పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే.. అధిక కొలెస్ట్రాల్‌ను అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగివుంది. ఇందులో విటమిన్ సి, బి1, బి6, విటమిన్ కె, బయోటిన్, క్రోమియం, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజూ డైటింగ్ లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఉల్లిపాయ సాధారణ జలుబు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బుల్ని నివారిస్తుంది. ఇంకా పొట్ట సమస్యలు, వికారం, డయేరియాను నివారించడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ పవర్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. బ్యూటీపరంగానూ ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే.. చర్మసమస్యల్ని నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్ చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు..
🛑*ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. లివ‌ర్ అనారోగ్యానికి గురైన‌ట్టే*🛑

🔳 *లివ‌ర్ మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అతి పెద్ద అవ‌య‌వం. ఇది చాలా కీల‌క‌మైన పనుల‌ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా శ‌క్తిని నిల్వ చేయ‌డం, అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడ‌డం, హార్మోన్ల‌ను కంట్రోల్ చేయ‌డం, మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది.*

🔳 *అయితే లివ‌ర్ శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను కూడా బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో కొన్ని సార్లు లివ‌ర్ అనారోగ్యానికి గురై ప‌లు ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. వాటిని తెలుసుకుంటే లివ‌ర్ అనారోగ్యం బారిన ప‌డింద‌ని ఇట్టే చెప్ప‌వ‌చ్చు*.

🔳 *మ‌రి లివ‌ర్ ఆరోగ్యం బాగా లేద‌ని చెప్ప‌డానికి మ‌న శ‌రీరంలో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!*

👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾

🛑 *అల‌స‌ట*

లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారంటే ఎల్ల‌ప్పుడూ తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. ఏ మాత్రం ప‌ని చేయ‌లేరు. నిస్స‌త్తువ‌గా ఉంటారు. చాలా వీక్‌గా ఉంటారు. ఏ ప‌నిచేయ‌క‌పోయినా అల‌సిపోయిన‌ట్టు ఉంటారు. వికారం ఉంటుంది. ఆక‌లి వేయ‌దు. డ‌యేరియా స‌మ‌స్య వ‌స్తుంది. దీన్ని బట్టి లివ‌ర్ చెడిపోయింద‌ని అనుకోవ‌చ్చు. అప్పుడు వైద్యున్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.*

🛑 *జాండిస్*:-
లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారంటే జాండిస్ అటాక్ అవుతుంది. చ‌ర్మం ప‌చ్చ‌గా మారుతుంది. క‌ళ్లు కూడా ప‌చ్చ‌గా త‌యార‌వుతాయి. వికారం, క‌డుపులో నొప్పి, వాంతులు అవుతాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్రదించి త‌గిన చికిత్స తీసుకోవాలి.*

🛑 *కొలెస్ట్రాల్*:-
శ‌రీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నా లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డార‌ని తెలుసుకోవాలి. లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు, డ‌యాబెటిస్ వ‌స్తాయి.*

🛑 *ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం*:-
లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. ర‌క్త నాళాల వాపు క‌నిపిస్తుంది. దీంతో లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని అర్థం చేసుకోవాలి.*

🛑 *ఆక‌లి లేక‌పోవ‌డం*:-
లివ‌ర్ ప‌నిచేయ‌క‌పోతే ఆక‌లి స‌రిగ్గా అవ‌దు. ఎందుకంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శ‌క్తినందించేది లివ‌రే. మ‌ర‌లాంట‌ప్పుడు లివ‌ర్‌ ప‌నిచేయ‌క‌పోతే ఆక‌లి ఎలా అవుతుంది, అవ‌దు క‌దా. క‌నుక ఆక‌లి స‌రిగ్గా లేక‌పోతే లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని తెలుసుకుని చికిత్స తీసుకోవాలి.*

🛑 *వాపులు*:-
లివ‌ర్ ఆరోగ్యం బాగా లేక‌పోతే పొట్ట‌, కాళ్లు వాపున‌కు గుర‌వుతాయి. కానీ కొంద‌రు దీన్ని కొవ్వు అనుకుని భ్ర‌మ ప‌డ‌తారు. అయితే అది కొవ్వు కాదు. నీరు. నీరు చేర‌డం వ‌ల్లే ఆయా భాగాల్లో వాపులు క‌నిపిస్తాయి. ఇలా క‌నిపించినా లివ‌ర్ బాగా లేద‌ని తెలుసుకోవాలి.*

🛑 *చ‌ర్మ స‌మ‌స్య‌లు*:-

లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా చ‌ర్మంపై దుర‌ద‌లు, ద‌ద్దుర్లు వ‌స్తాయి. చ‌ర్మ స్పెష‌లిస్టుకు చూపించి మందులు వాడినా త‌గ్గ‌క‌పోతే అప్పుడు దాన్ని లివ‌ర్ స‌మ‌స్య‌గా గుర్తించి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది*.
☀☀☀☀☀☀☀☀☀☀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.