Home remedies for pus cells in urine

0
239

మూత్రంలో చీము కణాల నివారణకు గృహ చిట్కాలు – Home remedies for pus cells in urine

మూత్రంలో చీము కణాల ఉనికి దిగువ లేదా ఎగువ మూత్ర మార్గాలలో ఇన్ఫెక్షన్‍ని సూచిస్తాయి. చీము తెలుపు లేదా పసుపు పచ్చని రంగులో ఉండే మందపాటి జిగురు పదార్ధంలా ఉంటుంది. చీము కణాలు చనిపోయిన తెల్ల రక్త కణాలు మరియు ఇతర కణసంబంధమైన పదార్థాలతో తయారవుతాయి. పురుషులలో ఈ పరిస్తితి చాలా తీవ్రంగా ఉంటుంది.

మూత్రంలో చీము కణాలకు కారణాలు

మూత్రంలో చీము కణాల ఉనికికి అత్యంత సాధారణమైన రెండు కారణాలు

మూత్రనాళ ఇన్ఫెక్షన్ లేదా UTI – UTI అనేది మహిళలలో అతి సాధారణమైనది ఎందుకనగా వారి మూత్ర వ్యవస్థ పురుషుల మూత్ర వ్యవస్థ కంటే చిన్నది. షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా మూత్రనాళ ఇంఫెక్షన్లకు మరింత అవకాశం కల్పిస్తాయి. మూత్ర వ్యవస్థ అనేది మూత్రపిండాలు, మూత్రాశయం, ముత్రనాళాలతో కూడుకుని ఉంటుంది.  లైంగిక సంక్రమణ వ్యాధులు – లైంగిక సంక్రమణ వ్యాధులకు గురైన పురుషులు లేదా మహిళల మూత్రంలో చీము కణాలు ప్రేరేపించబడతాయి.

ఇతర కారణాలు

మూత్రంలో చీము కణాలకు కొన్ని ఇతర కారణాలు

ఫంగల్ ఇన్ఫెక్షన్రసాయన విషచర్యవాయు రహిత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్మూత్రపిండాలలో రాళ్లుప్రోస్టేట్ గ్రంధి ఇన్ఫెక్షన్మూత్ర వ్యవస్థలో క్షయ వ్యాధిమూత్రాశయ అవయవ లేదా జన్యుపరమైన అవయవ కేన్సర్లు

మూత్రంలో చీము కణాల నివారణకు గృహ చిట్కాలు

వెల్లుల్లిని ఉపయోగించటం

వెల్లుల్లి వంటకాలలోకి మాత్రమే కాదు మీ శరీరాన్ని శుభ్రపరచటానికి కూడా ఉపయోగపడుతుంది. తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి వెల్లుల్లి మనల్ని కాపాడుతుంది. ఇందుకు పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ వెల్లుల్లి వాసనను కొంతమంది తట్టుకోలేరు. అయినప్పటికీ కూడా వెల్లుల్లి వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

మూత్రంలో చీము మరియు ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి వెల్లుల్లిని క్రింది విధంగా ఉపయోగించి చూడండి.

ఉదయాన్నే బ్రష్ చేయకముందు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నమలండి.ఒక గిన్నెలో రెండు చిదిమిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. దానికి వేడి నీటిని జోడించి 15 నిముషాలు అలా వదిలేసి ఆ నీటిని వడకట్టండి. రోజుకి మూడు సార్లు ఈ టీ ని తాగండి తద్వారా మీ సమస్యలను అరికట్టండి.రెండు నుండి మూడు వెల్లులి రెబ్బలను తీసుకుని చిదిమి వాటికి ఐదు చుక్కల ఆలివ్ నూనెని జోడించి తీసుకోవడం మరొక పధ్ధతి.   

ముల్లంగి రసం ప్రభావం

ముల్లంగి రసంలో విటమిన్ సి, ఫోలిక్ ఆసిడ్, జింక్, ఆన్తోసైనిన్స్, ఫాస్ఫరస్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ లు అధికంగా ఉంటాయి. కనుక మూత్రంలో చీము కణాలతో సహా మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను కూడా ముల్లంగి రసం నివారిస్తుంది. ముల్లంగి ఆకులని కూడా పడేయకుండా ముల్లంగి రసంలో కలిపి తయారు చేసి రోజూ తాగాలి. ఇది మూత్రపిండాల సమస్యలకు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది.

ఉవా ఉర్సి

ఉవా ఉర్సి అనేది భారతీయ నామం, దీనినే బేర్‍బెర్రీ పండు అని కూడా పిలుస్తారు. మూత్రపిండవస్తిక వాపు, మూత్రనాళపు వాపు, మూత్రకోశపు వాపు మొదలైన సమస్యలను నివారించుటకు ఉవా ఉర్సి సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే మీ మూత్రంలో ఇన్ఫెక్షన్ ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ఒక కప్పు నీటిని మరిగించి దానికి ఒక చెంచాడు ఎండిన ఉవా ఉర్సి ఆకులను జోడించండి. 15 నిముషాల పాటూ దానిని నాననిచ్చి త్రాగండి. రోజూ ఇలా ఈ నీటిని త్రాగడం వల్ల మూత్రంలో చీము కణాలు తగ్గుముఖం పడతాయి.

వాటర్ క్రెస్

వాటర్ క్రెస్ అనేది నీటిలో పెరిగే ఒక మొక్క. చీము కణాల ఇన్ఫెక్షన్ నుండి బయటపడే సమర్థవంతమైన మార్గాలలో ఇది ఒకటి. ఇందులో విటమిన్ డి, ఎ, సి లతో సహా ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు కాల్షియమ్ వంటివి ఉండటం వలన ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇందుకోసం, ఒక కప్పుడు నీటిని మరిగించి అందులో రెండు ఆకుల వాటర్ క్రెస్ ని వేయండి. ఇప్పుడు నీటిని మరిగించడం ఆపేసి దాని మీద ఒక మూత పెట్టి ఉంచండి. దానిని అలా 10 నిముషాల పాటూ నాననిచ్చి వడకట్టి అప్పుడు త్రాగండి.

కీరదోసకాయ రసం

ఇది పొటాషియం, సిలికా, మెగ్నీషియం, సోడియం మరియు వివిధ రకాల విటమిన్లు ఉన్న ఒక సహజ సిద్ధమైన కూరగాయ. ఇది మీ మూత్రంలో ఆమ్ల తటస్థీకరణకు సహాయపడుతుంది. కీరదోసకాయను జ్యూస్ లాగా చేసి దానికి అరచెంచా తేనె మరియు అరచెంచా నిమ్మరసాన్ని జోడించండి. మూత్రంలో ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండటానికి రోజుకి 3 సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.  కృత్రిమ రసాయనాల ద్వారా తయారుచేసే ఔషధాల కన్నా ఇది చాలా మెరుగైనది.

నీరు మరియు ఇతర ధ్రవాలు

మూత్రం ఎక్కువగా విసర్జించడం ద్వారా మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్‍కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించవచ్చు. అందుకు ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి. ఇక్కడ ఇతర ధ్రవాలు అంటే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, కూరగాయల రసాలు, పుచ్చకాయ మరియు దోసకాయ వంటి అధిక నీటిని కలిగి ఉండే పండ్లు మరియు కూరగాయలు. ధ్రవంలోని విటమిన్లు మరియు ఖనిజాలు రక్షణ వ్యవస్థను బలపర్చడానికి సహాయం చేస్తాయి.

బేకింగ్ సోడా

ఒక గ్లాసు నీటిలో అరచెంచా బేకింగ్ సోడాని కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ల బారి నుండి మొదటి దశలో ఉన్నపుడే బయటపడొచ్చు.

ధనియాలు

ధనియాలలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన బ్రహ్మాండమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. మూత్రపిండాలు మరియు మూత్రాశయ సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేద మరియు చైనీయుల సాంప్రదాయక ఔషదాలలో వీటిని ఉపయోగిస్తారు.

ఉసిరికాయ

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు శరీరాన్ని ఎటువంటి ఇన్ఫెక్షన్ల నుండి అయినా రక్షించటానికి సహాయపడుతుంది. శరీరం నుండి విష మలినాలను బయటకి పంపించడంలో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మూత్రంలోని చీము కణాలను తగ్గించడంలో మరియు ఇతర మూత్ర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉల్లిపాయ

మూత్రంలో ఉండే చీము కణాలు తొలగించడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. ఉల్లిపాయలు శోధనిరోధక, క్రిమినాశక, యాంటీ ఫంగల్, ప్రతిస్కందక, బాధానివారక మరియు అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీరం నుండి విష మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

పెరుగు

పెరుగు మంచి బాక్టీరియాను కలిగి ఉంటుంది, అది చెడు బాక్టీరియాతో పోరాడి ఇన్ఫెక్షన్లు మరియు మూత్రంలో చీము కణాలు వంటి ఇన్ఫెక్షన్ల వాటి నుండి కాపాడుతుంది. పెరుగు తేలికపాటి మూత్ర విసర్జన ప్రభావాలను కలిగి ఉంటుంది అందువలన ఇది విష మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి

ఇది దీర్ఘకాలం నుండి సహజ యాంటీబయాటిక్‍గా పరిగణించబడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.