అధిక రక్త పోటు ఆధునిక కాలపు వ్యాధి. స్వస్థత పొందేందుకు సూచనలు

0
315

అధిక రక్త పోటు ఆధునిక కాలపు వ్యాధి. స్వస్థత పొందేందుకు సూచనలు :

మానసిక ఒత్తిడి, ఆత్రుత, క్లిష్ట కాలపు మానసిక ప్రవ్రుత్తి, వంశ పారంపర్యంగా మనకు పెద్దలనుండి జన్యు పరంగా వచ్చిందనీ, ఉప్పు ఎక్కువ తినేస్తున్నామనీ – ఇవన్నీ అధిక రక్త పోటు కు కారకాలని మనకి చెబుతూ వచ్చారు ఇన్నాళ్లూ.

ఇవన్నీ కొంతమటుకూ తరుణ వ్యాధి గా ఇది వచ్చేందుకు సహకరించినా, డాక్టర్ ఖాదర్ చెప్పేదేమంటే, ఈ వ్యాధి ముఖ్య కారణం మన ఆహారంలోనే ఉందని.

ఈ కాలపు వరి బియ్యం, గోధుమలూ, మైదా పదార్థాలు, తెల్ల చక్కర, పాలు, మాంసం,ప్యాకెడ్ ఆహారాలు, రెడీ మేడ్ -పెద్ద కంపెనీ ల తినుబండారాలు, కలుషితమైన రిఫైన్డ్ నూనె లూ, కార్న్ నూనె, కనోలా నూనె, సన్ఫ్లవర్ నూనె ల రిఫైన్డ్ నూనెలూ అధిక రక్త పోటుకు, ఇతర రక్తనాళాల inflammation కు అసలు కారకాలు.

అధిక రక్త పోటు నుండి సత్వరంగా 2 -3 నెలల వ్యవధి లో బైట పడేదెలా?

సిరి ధాన్యాలూ, కషాయలూ ఎలా సాయ పడతాయి? స్వస్థత కూడా పొందే మార్గాలు ఏమిటి – మనకు డాక్టర్ ఖాదర్ పలు ప్రసంగాల లో అందించారు.

a ) సిరిధాన్యాల ను ఈ విధంగా వాడుకోవాలి :

సామెల బియ్యం : ఒక రోజు పాటు
కొర్ర బియ్యం : ఒక రోజు
అండు కొర్ర బియ్యం : ఒక రోజు
అరికెల బియ్యం : ఒక రోజు
ఊదల బియ్యం : ఒక రోజు

ఈ 5 రోజుల సిరి ధాన్యాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే తిరిగి పాటించాలి.
ఒక రోజు మొత్తం లో ఒక్క సిరి ధాన్యాన్నే బ్రేక్ ఫాస్టు, లంచ్, రాత్రి భోజనాలకు వాడండి. ( వీటి తో అన్నం, రొట్టెలూ, ఉప్మా, ఇడ్లీ, దోస, బిరియాని, పొంగలి….అన్నీ సాధ్యమే)

b ) కషాయాలు :
పునర్నవ
( Boerhaavia diffusa )
సర్పగంధ
(Rawolfia serpentina )
నాగ జెముడు
( Cactus Grandiforus )
ఒక్కొక్క వారం పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లలో, ఖాళీ కడుపు మీద వీటి కషాయాలు సేవించాలి.
వారానికి ఒకటి చొప్పున మార్చుకోవాలి.

( కషాయం : గ్లాసున్నర నీటి లో 6 -7 ఆకులను/1-2 ఆకులగుజ్జును చేసుకుని 4 నిమిషాలపాటు ఉడికించి, గోరువెచ్చగా, వడకట్టుకుని త్రాగాలి. అవసరమనుకుంటే, శుద్ధమైన తాటి బెల్లపు లేత పాకం చేసుకుని 2-3 చుక్కలు కషాయాలకు కలుపుకోవచ్చు )
ఈ కషాయాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే పాటించాలి.

c) కూర గాయల రసాలు :

దోస కాయ
బూడిద గుమ్మడి కాయ
సోర కాయ
పుదీనా
కొత్తిమీర
కరివేప

ఒక 150 గ్రాముల కాయ భాగాన్ని నీటి తో కలిపి రసం చేసుకుని, 250 మిల్లి లీటర్ లు రసాన్ని ఒక్కొక్క కాయనో వరం రోజులపాటు త్రాగాలి .

ఇంకా:
* పాలు, చక్కర, కాఫీ, టీ ల వాడకాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.
* రెడీ మేడ్ మైదా బేకరీ ఆహారాలు, మాంసాహారం కూడా పూర్తిగా దూరం పెట్టాలి.
* రోజూ 10 -15 నిమిషాలపాటు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ధ్యానం చేయాలి.
* రోజూ 75 నిమిషాల నడక ను మరువకండి, మెల్లగానైనా సరే.
* రకరకాల కూరగాయలు, ఆకు కూరలు తినండి.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు (5 మిల్లెట్ లు) !
ఆధునిక రోగాలను సిరి ధాన్యాల తో రూపు మాపుదాం !

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.