తిన్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే..? ఇదే జరుగుతుంది

0
66

*తిన్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే..? ఇదే జరుగుతుంది…*

చాలామందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది.V ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లేదా 20 నిమిషాలకు తర్వాత నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా గుండెకు ఎంతో మంచిది. గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. చైనీయులు, జపనీస్ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నీటిని తీసుకుంటున్నారు.

గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆహారం తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు ఆరోగ్యానికి కీడు చేసే కొలెస్ట్రాల్‌ను నిరోధించగలుగుతుంది. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని సూప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్రిజ్ వాటర్ మాత్రం తీసుకోకూడదు.

చల్లని నీరు తాగితే ఆరోగ్యానికి కీడు చేసే వ్యాధులు ఏర్పడుతాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలు ఫ్రిజ్ వాటర్ తీసుకోవడంతో ఏర్పడతాయని పలుసార్లు తేలింది. అజీర్ణం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివి జరుగుతాయి. ఫ్రిజ్ వాటర్‌ను వాడుతూ ఉంటే గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీరే ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు
రోజూ ఉదయం లేస్తూనే అర లీటరు తక్కువ కాకుండా నీరు తాగాలి. మంచి నీరు మంచి ఔషదం

మంచినీరంటే స్వచ్ఛమైన నీరు. దీనికి రంగు, రుచి, వాసన వుండదు. నీళ్లను బాగా మరిగించి, చల్లార్చి, వడబోసి తాగడం మంచిది. వీలుంటే జీరో బ్యాక్టీరియా వంటి ఫిల్టరులోవేసి తాగితే ఇంకా మంచిది. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగితే మంచిది. ఎండాకాలంలో 4 నుండి 5 లీటర్లు తాగాలి. శీతాకాలంలో స్వేదగ్రంథుల ద్వారా నీరు ఎక్కువగా బయటికి విసర్జితమవదు. ఎండాకాలంలో స్వేదగ్రంథుల ద్వార ఎక్కువ నీరు విసర్జించబడుతుంది. అందుకే ఎండాకాలంలో నీరు ఎక్కువగా తాగాలి. రోజూ ఉదయం లేస్తూనే అర లీటరు తక్కువ కాకుండా నీరు తాగాలి. ప్రతీ జీవకణం బాగా తనపని నిర్వర్తించాలంటే నీరు ముఖ్యం. దీంతో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అంటే దానిలో ముఖ్య పోషక పదార్థాలు అన్ని అవయవాలకు చేరాలంటే, ఆక్సిజన్ అన్నిటికీ సరఫరాకావాలంటే, రక్తం పల్చగా, సరిగా ప్రవహించాలంటే నీరు ముఖ్యం. మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి చర్మంలోని స్వేదగ్రంథులు సరిగ్గా పనిచేసేందుకు చర్మం నిగనిగలాడాలంటే, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా అరికట్టడానికి నీరు ముఖ్యం.
• ఉదయం లేవగానే తప్పకుండా నీరు త్రాగడం ద్వారా జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలను ఎక్కువ మొత్తంలో కిడ్నీలు శుద్ధిచేస్తాయి.
• అంతేకాదు లావుగా ఉన్నామని బాధపడేవారు ఎక్కువగా నీటిని తీసుకుంటే నీరు క్రొవ్వును కరిగిస్తుంది.
• చల్లని నీరు తీసుకుంటే ఇంకా మంచిది.
• చల్లని నీరు క్రొవ్వును ఎక్కువ మొత్తంలో కరిగి స్తుంది.
• నీరు సరిగా త్రాగని వారు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారప దార్థాలను త్వరగా జీర్ణించుకోలేరు.
• మామూలుగా కన్నా ఎక్కువ బరువున్నవారు ప్రతి పది కిలోలకు ఒక గ్లాసు ఎక్కువ నీరు త్రాగాలి.
• మన కండరాలను పటిష్టం చేయడంలో, చర్మం నిగారింపులో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది.
• ప్రతి మనిషి రోజుకు సగటున 8-10 గ్లాసుల మంచినీరు త్రాగాలి.
• ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా కనీసం రోజుకు 2- 3 లీటర్లు నీటిని త్రాగించాలి.
• అందుకే మీరు డాక్టర్ సలహా ప్రకారం రోజూ ఎక్కువ నీటిని త్రాగడం అలవాటు చేసుకోండి.ఎక్కడైనా బయటికేళ్లేటప్పుడు ఒక బాటిల్‌లో నీరు తీసుకెళ్లడం మాత్రం మరువకండి.బయట లభించే నీటిని సాధ్యమైనంత వరకూ తీసుకోవడం తగ్గించండి. నీరు బాగా త్రాగితే మీ ఆరోగ్యం మరింత బాగుంటుందని గుర్తుంచుకొండి.
• శరీరానికి అవసరం లేని ఉప్పును కరిగించి దాన్ని కిడ్నీల ద్వారా నీటి రూపంలో బయటికి పంపాలన్నా ఎక్కువ నీరు త్రాగడమే ఉత్తమం. అవసరం కూడా.
• మన కిడ్నీలు వాటి పని అవి సక్రమంగా పని చేయాలన్నా నీరు ఎక్కువగా త్రాగడం అవసరం. కిడ్నీలు వాటి శక్త్యానుసారంగా పనిచేయకపోయినట్లైతే మన శరీరంలో వ్యర్థ పదార్థాల నిల్వలు పెరిగి అవి క్రమంగా లివర్పై పేరుకుపోతాయి. దాంతో మన శరీరంలో క్రొవ్వు పేరుకుపోవడం,లావవడం జరుగాతాయి.
• కొంతమంది కాళ్లు, చేతులకు, పాదాలకు నీరు వచ్చి ఉబ్బడం జరుగుతుంది. ఈ సమస్య కూడా ముఖ్యంగా నీటిని తక్కువ త్రాగడం వల్ల, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల జరుగుతుంది.దీన్ని అదిగమించడానికి కూడా ఎక్కువ మొత్తంలో నీరు త్రాగడం ఒక మార్గం.
• డైటింగ్ చేసి సన్నజాజితీగల్లా కావాలని కలలు కనే అమ్మాయిలూ…. ఇది మీకో హెచ్చరిక! డైటింగ్ చేస్తే సన్నగా, నాజూగ్గా, అందంగా తయారవుతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే డైటింగ్ మీ నోటి దుర్వాసనకు కారణం అయ్యేందుకు ఆస్కారం ఉంది సూమా! ముంబా యికి చెందిన డాక్టర్ న్యూటన్ ఠక్కన్ ఏమంటారంటే… జీర్ణప్రక్రియలో కీలక పాత్ర పోషించే సలైవా అదే నండీ….. లాలాజలం…. దాన్ని ఉత్పత్తి చేసేదేంటో తెలుసా? మనం తీసుకునే ఆహారమే! లాలాజం సహజసిద్ధమైన మౌత్వాష్గా పనిచేస్తుంది. మరి మనం కావలసినంత ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటే లాలాజలం ఉత్పత్తి ఆగిపోతుంది.అది నోటి దుర్వాసనకు దారితీస్తుంది. ఒక వేళ డైటింగ్ తప్పనిసరి అయితే కనీసం సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగమని డాక్టర్ ఠక్కర్ సూచన.
• నీరు ఎక్కువగా త్రాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడం, తద్వారా ఆయుష్షు పెరగడం తథ్యం.
• ఆయుష్షును పెంచేది కనుకే నీటిని అమృతం అన్నారేమో.మీ నవీన్ నడిమింటి
9703706660

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.