నరముల బలముకు

0
526

. ●●●●●●●●●●●●●●●●●●
నరముల బలముకు
*****************************

1. అంజూరపండు పరగడుపున తినిన నరములకు సత్తువనిచ్చును.
2.గవ్వపలుకు సాంబ్రాణి చూర్ణము 3 0 గ్రాములు,
నువ్వులనూనె 150 గ్రాములు,| కలిపి కాచి, చల్లార్చి శరీరానికి మర్ధనచేసిన నరాలు ధృడముగానుండును.
3.దువ్వెనకాయ (పాపిడికాయ, ముద్రబెండ) గింజల చూర్ణము పంచదారతోకలిపి తీసుకొనిన శక్తి పెరుగును. వేరు పాలలో మరిగించి త్రాగిన నరాలకు బలము.

4. అశ్వగంద, ముక్కలుగకోసి, నేతిలో వేయించి అన్నములో కలిపి తినినబలము చేకూరును.
5. పల్లేరుకాయల చూర్ణము తీసుకొనిన నరాలకు శక్తి పెరుగును.
6. రోజూ ఆహారంతో పాటు తేనె సేవించిన మంచిది. లేదా రెండు పూటలుతేనెను పాలలోగాని, నీటిలోగాని కలుపుకొని సేవించిన పక్షవాతమురాదు.బ్లడ్ ప్రెషరు, నరాల బలహీనత హరించి బలం చేకూరును.
7. గోరోజనము ఆవునేతిలోగాని, ఆవువెన్నలోగాని కలిపినూనె దానితోమర్దనచేసిన పట్టుదప్పిన కాళ్ళనరములకు సత్తువజేసి నడవ శక్తి కలుగును.
8. తుంగముస్తలు తలలోనిల నరములకు సత్తువచేయును.
9. అంబరు నరముల బలహీనత పోగొట్టును. (కస్తూరివలె చిన్న మోతాదులుగవాడవలెను)
10. అక్కల కర్ర చూర్ణము లేక కషాయము నరములకు సత్తువ చేయును.
11. ఆవనూనె నరములకు సత్తువచేయును. వాతత్త్వము గలవారికి సత్తువ.బలము.
12. కసివింద చెట్టు ఆకురసం వెన్నతో గలిపి మర్దన చేసిన గలవారికి మంచిది.
13..కానుగ చెట్టు మానుచెక్క ఆముదములో వేసి కాచి మర్దన చేసిన పడిపోయినకాళ్ళు-చేతలు బాగగును.
14చెలవమిరియాల చూర్ణము నీటితో తీసుకొనిన నరములకు సత్తువ.
15. పారిజాతం చెట్టు నాలుగైదు ఆకులు గ్లాస్ నీళ్లలో వేసుకుని సగం అయ్యేవరకు మరిగించి వాడిన నరములకు సత్వ కలుగును
16. జటామాంసి సగం చెంచా మోతాదుగా రెండుపూటలా వాడిన నరములకు సత్తువ కలుగును

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.