drink water in the morning

0
59

*మీరు ఉదయం లేవగానే నీరు తాగుతున్నారా లేదా ?*drink water in the morning*
మీరు లేవగానే మంచి నీరు బాగా తాగుతున్నారా అయితే మీరు మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారనుమాట. నీరు బాగా తాగండి అని అందరు చెప్పుతుంటారు,కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎవరు ఏం చెప్పకముందే మీరు రోజు ఉదయాన్నే బాగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుండి అయినాసరే లేవగానే నీరు తాగడం మొదలు పెట్టండి.

శరీరంలో ఉండే చాలా సమస్యలు ఉదయాన్నే నీరు తాగటం వలన పోతాయంటా. ఉదయాన్నే లీటరున్నర నీరు తాగితే మీలో పెద్ద ప్రేగు శుభ్రముగా అయి జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందుంది. ఇలా నీరు తగిన తరువాత గంట వరకు ఎలాంటి ఆహారం కూడా తీసుకోవద్దు అంటా.

అంతే కాకుండా శరీరంలో కండరాల కణాలను ఉతేజం కలిగేలా చేస్తాయంటా మరియు కొత్త రక్త కణాలు తయారవడంలో ఉపయోగపడుతుందంటా. ఇలా పొద్దున్నే నీరు తాగితే ఒంట్లో ఉండే మలినాలు అన్ని తొలగి పోతాయంటా.

శరీరంలో ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చేస్తుంది. ఒంట్లో ద్రవ పదార్థాలు కోల్పోకుండా సహాయపడుతుంది. ఇలా చాలా రకాలుగా పొద్దున్నే లేవగానే నీరు తాగడం వలన మన శరీరానికి చాలా లాభాలే ఉన్నాయని వైద్యులు చెప్పుతున్నారు.

*ఇంతకీ ఆ అవేంటంటే…*

* ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కొవ్వును కరిగించడంలోనూ దీని పాత్ర ముఖ్యమైందే. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగడం మంచిది.

* కడుపు నొప్పీ, తలనొప్పులతో బాధపడుతున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.

* జలుబూ, గొంతునొప్పి ఉన్నప్పుడు మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడమూ కష్టమే. అలాంటప్పుడు గోరువెచ్చని నీరు తాగి చూడండి. ఫలితం కనిపిస్తుంది.

* మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే గోరువెచ్చని నీరు తాగడమే సరైన పరిష్కారం.

* ఈ గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసాన్ని కలిపి తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* నెలసరి సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పిని నివారించడంలోనూ గోరువెచ్చని నీళ్లు బాగా పనిచేస్తాయి.

* కాస్త వేడిగా ఉన్న నీళ్లు తాగడం వల్ల ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా ఎక్కువ క్రిములు బయటికి పోయే అవకాశం ఉంటుంది.

* క్రమం తప్పకుండా గోరువెచ్చని నీళ్లే తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలా వృద్ధాప్యఛాయలూ త్వరగా మొదలుకావు.

*మీరు మంచినీళ్లు సరిపడా తాగట్లేదని అర్ధం..!!*
శరీరానికి నీరు చాలా అవసరం,
ఎవరినైనా రోజు ఎన్ని నీళ్ళు తాగుతున్నారు అని అడిగితే చాలా తాగుతున్నాం అని సమాధానమిస్తారు..
కాని సాధారణంగా ఒకటి లేదా రెండు లీటర్లకు మించి తాగరు.
మానవ శరీరం మూడో వంతు నీటితోనే నిర్మితమై నీటిమీదే అధారపడి ఉంటుంది.
కాని చాలా మంది శరీరానికి అవసరమైన మరియు అందరికి అందుబాటులో ఉండే నీటిని తాగడానికి శ్రద్ధ చూపరు.

శరీరానికి అవసరమైన నీరు సరైన నిష్పత్తిలో అందకపోతే శరీరం కొన్ని సంకేతాలు మనకు పంపుతుంది
వాటిని ఆదిలోనే గ్రహించి తగు చర్యలు తీసుకోకుంటే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదం ఉంది.

*మరి శరీరం మనకు పంపే ఆ సంకేతాలు ఏమిటో.. తెలుసుకోండి..💐*

1. మలబద్దకం.💐
మలబద్దకం బాధిస్తుందంటే అది డీహైడ్రేషన్ కి సంకేతం లా భావించాలి,
శరీరంలో తగు నీరు లేకపోవడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక మలబద్దకానికి కారణం అవుతుంది.

2. మూత్రం రంగు మారడం.💐
శరీరానికి తగు మోతాదులో నీరు అందకుంటే మూత్రం సాధారణం కంటే ముదురు రంగులో చిక్కగా వస్తుంది. నీరు త్రాగక పోతే ఆ ప్రభావం మూత్ర పిండాలపై కూడా పడి ఆ ప్రాంతంలో నొప్పి వస్తుంది.

3. చర్మం స్థితిస్థాపకత.💐
శరీరానికి నీరు తక్కువైనప్పుడు దాని ప్రభావం చర్మంపై పడుతుంది.
దీనివలన చర్మం సాగినట్లుగా, వాడిపోయినట్లుగా మారుతుంది.

4. కండరాలు తిమ్మిరి పట్టడం.💐
శరీరం లోని కండరాలు మరియు ఇతర భాగాలు తిమ్మెర్లు బాగ పడుతున్నాయంటే అది కూడా శరీరంలోని గల తక్కువ నీటి వలననే.
శరీరంలో నీరు త్రగ్గడం వలన రక్త ప్రసరణ సరిగ్గా జరగక తిమ్మెర్లు మొదలవుతాయి.

5. తలనొప్పి.💐
తరచు తలనొప్పి బాధిస్తుంటే దానికి ఒక కారణం కూడా శరీరం లోని నీరు కావొచ్చు.
డీహైడ్రేషన్ కారణంగా తల బాగా పట్టేసినట్లు ఉండి తలనొప్పి కలుగుతుంది.

6. కీళ్ళనొప్పులు.💐
మనిషి ఆరోగ్యంగా ఉన్నా కూడా కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దానికి కారణం శరీరానికి సరిపడ నీరు అందకపోవడమే.
రోజు సరైన మోతాదులో నీరు తీసుకోనట్లైతే కండరాలకు రక్త ప్రసరణ తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి.

7. లోబిపి.💐
లోబిపి కి కూడా డీహైడ్రేషన్ ఒక కారణం.
శరీరనికి సరైన మోతాదులో నీరు అందకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరిగి గుండె వేగం ప్రభావితమవుతుంది.

శరీరం…పైన చెప్పినవి కాక ఇంకా చాల విధాలుగా తనకు మనం తాగే నీరు సరిపోవడంలేదని సంకేతాలు పంపిస్తుంది.
మీరు పైన చెప్పిన వాటిల్లో దేనితో ఇబ్బంది పడుతున్నా దానికి ఒక కారణం మీ శరీరానికి అవసరమైన నీరు మీరు త్రాగకపోవడమే..
ఇకనైనా మెల్కోని చాలా నీరు తాగండి.

*వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే..💐*
మన పెద్దవారు ఉదయాన్నే లేవగానే పరగడుపున వేడినీళ్లు తాగమని చెప్తుంటారు.
ఇలా వేడినీరు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది.
కొందరిలో చెమటలు పడతాయి.
ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది.

*ఇంకా వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.💐*
ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని వేడి నీళ్లు తాగితే వర్షా కాలంలో వచ్చే వ్యాధులను చాలామటుకు నిరోధించవచ్చు.
గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది.
వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపసమనం కలుగుతుంది.

బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి.
ఎంత ఉపసమనం కలిగిస్తుందో మీరే గమనించండి.

నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి.
నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి.
అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయి. మీ నవీన్ నడిమింటి

మీ ఆరోగ్యమే..మీకు భాగ్యం..!!9703706660💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.