దోమలను తరిమికొట్టడానికి ఇక All Out కొనాల్సిన పనిలేదు…పాత All Out రీఫిల్ ఉంటే చాలు

0
430

*☘దోమలను తరిమికొట్టడానికి ఇక All Out కొనాల్సిన పనిలేదు…పాత All Out రీఫిల్ ఉంటే చాలు .!*

డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా…. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు . వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ ను కాల్చడమో ? ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు . అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి . కొంత మంది ప్రతీసారి అంత అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు . కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు . అయితే ఈ సారి మీరు All Out, Good Knight, Jet Coils లాంటివి కొనకుండా…. మీ ఇంటి మూలల్లో దాగిఉన్న దోమలను తరిమికొట్టొచ్చు. దీని కోసం All Out, Good Knight ల పాత రీఫిల్ ఉంటే చాలు .

*🔹సహజ దోమల నివారిణిని ఎలా తయారు చేయాలి:*

*Step-1:* పాత All Out, Good Knight ల రిఫీల్స్ ను తీసుకొని వాటి మూతను తీసేయాలి .

*Step-2:* ఖాళీగా ఉన్న రీఫిల్ లో…. 3-4 పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి, అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి( వేపనూనె అన్ని ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది)

*Step-3:* ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి .

*Step-4:* సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడుతామో…అలాగే వీటిని కూడా మెషిన్ లో ఫిక్స్ చేసి స్విచ్చ ఆన్ చేస్తే సరిపోతుంది .

*🌻మనం సొంతంగా తయారు చేసిన ఈ దోమల నివారిణి వల్ల కలిగే లాభాలు:*

🔹100% ఆరోగ్యహితమైనది, ఎటువంటి కెమికల్స్ కలపనటువంటిది .
🔸కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది .
🔹వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది .
🔸కృతిమ దోమ నివారిణుల వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది . 🔹మనం తయారు చేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు . పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు .
🔅🔅🔅🅰🔅🔅🔅

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.