Dignity of labour

0
689

పండుగ రోజున క్రొ్త చెప్పులు వేసుకునే సెంటిమెంట్ నాకు, అందుకే క్రొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణం కు వెళ్ళాను,
షాపులోని సేల్స్ మేన్ నాకు రక, రకాల క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు, కానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదు, నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు, అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు,
అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, అందులోనుండి ఓ వ్యక్తి హూందాగా షాపులోకి వచ్చాడు, ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేసారు, ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి తన పనిలో నిమగ్నం అయ్యారు,
మీ యజమానా? అని సేల్స్ మేన్ ను అడిగాను,
అవును సార్, ఆయన మా యజమాని ,ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయి, చాలా మంచి మనిషి అండి అని ఓ క్రొత్త రకం చెప్పుల జత చూయించాడు, ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది, కానీ సైజే కాస్త అటు, ఇటు గా ఉన్నట్టుంది, చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు ,ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని తెగ ఆరాట పడుతున్నాడు, కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, అబ్బే అదేం లేదు సార్, మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు, ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచి వచ్చి నాముందు క్రింద కూర్చుని సార్ ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి అని నా పాదం ను తన చేతిలో తీసుకుని చెప్పును తొడిగాడు,, నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్ద, హోదాలో కూడా) నా పాదం ముట్టుకుని చెప్పు తొడుగుతుంటే ఇబ్బంది గా అనిపించింది, పరవాలేదులెండి సర్ నేను తొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా అతను వినకుండా రెండు కాళ్ళకు తన చేతులతో నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి ఓసారి నడిచి చూడండి సర్, మీకు కంఫర్ట్ గా ఉన్నాయో లేదో, లేకుంటే మరో జత చూద్దాం అన్నారు, కానీ ఆ జత సరిగ్గా సరిపోయాయి, నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను, సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను,
ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్! ఇది నా వృత్తి, నాకు దైవం తో సమానం,
“షాపు బయట మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా నేను మీ పాదాలు ముట్టుకోను, అదే షాపు లోపల మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీ పాదాలు వదలను ”
అన్నారు..
నాకు ఆశ్చర్యమేసింది,
ఎంత గొప్ప వ్యక్తిత్వం!
Dignity of labour
******************
తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన గురువు లా కనిపించారు,
మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య, న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు.
ఎప్పుడూ మనం చేసే పనిని కానీ, ఉద్యోగం ను కానీ తిట్టరాదు, అదికూడ లేక రోడ్ల మీద వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని కోరుతూ.
🙏🤝✊👍

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.