మదుమేహం – నివారణా మార్గం

0
141

మదుమేహం – నివారణా మార్గం .
నేడు మదుమేహం ఒక వ్యక్తిగత సమస్య కాదు సామాజిక సమస్య. దీని సమగ్రమైన రూపాన్ని ఆకళింపు చేసుకోవడం కొసం, వ్యాధి ని తిరిగి పుట్టకుండా చేయడం కోసం ఎంతో మంది వైద్య శాస్త్రజ్ఞులు ప్రపంచ వ్యాప్తం గా నిర్విరామం గా కృషి చేస్తున్నారు.
మధుమేహానికి సంభందించిన అవగాహన మన ప్రాచీన భారతీయ వైద్య వేత్తలకి మూడువేల సంవత్సరాల క్రితం నుంచే ఉండేది . బహుముత్ర రోగులు లలొ మూత్రం గనక తేనే (మధు ) లాంటి లక్షణాలు ప్రదర్శిస్తుంటే ఆ స్థితిని మదుమేహం గా వర్ణించారు. ఈ వ్యాధి లొ దోషిగా చెప్పబడే ఫాన్క్రియాస్ గ్రంధి మార్పిడి చేయడం లాంటి పరిశొధనలు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నాయి.
మదుమేహం ఎవరికి వస్తుంది. –
కారణాలను బట్టి మధుమేహాన్ని రెండుగా విభజించారు మన మహర్షులు .
1 – సహజం.
2 – అపత్య నిమిత్తజం.
సహజ మదుమేహం అంటే తల్లి తండ్రుల “బీజ దోషాన్ని” ఆధారం చేసుకొని వచ్చేది.తల్లి తండ్రుల నుంచి వారి సంతానానికి ఏ విదంగా నైతే కొన్ని లక్షణాలు ప్రాప్తిస్తాయో అదే విదంగా కొన్ని రకాల వ్యాదులు కుడా సంక్రమిస్తాయి.వాటిలో మదుమేహం ఒకటి.
ఇక రెండొవది ఆహారపదార్ధాల వలన, శరీరం లొ జరిగే మార్పుల వలన సంక్రమిస్తుంది.
ఏ ఆహర పదార్ధాల వలన వస్తుంది. –
* పెరుగును అధిక ప్రమాణం లొ తీసుకొవడం.
* కఫాన్ని పెంచే నైజం ఉన్న పాలు, బెల్లం వంటి పదార్ధాలని ఎక్కువ తీసుకొవడం.
* సుఖమైన, దిగబడి పోయేంత మెత్తని దిండు లను, పరుపులను ఉపయోగించడం .
* సోమరితనాన్ని వదలలేకపోవడం.
* అవసరానికి మించి నిదుర పొవడం.
* కొవ్వుని పెంచే నైజం ఉన్న ఆహార పదర్ధాలని ఎక్కువుగా తీసుకొవడం.
* పగలు నిద్రించడం
* వ్యాయామం జోలికి పోకపోవడం.
* చల్లారిన అన్నపానాలను , జిగురు కలిగిన ఆహర పదార్ధాలను ఎక్కువు గా తీసుకొవడం.
మధుమేహాన్ని గుర్తించడం –
* వంశపారం పర్యంగా, మీ పెద్దవాళ్ళకు షుగర్ వ్యాధి ఉన్నాకాని,
* చిన్నపాటి పనికే నీరసం వస్తున్నా .
* అతిగా దాహం గా అనిపిస్తున్నా
* గాయాలు , పుళ్లు తేలిక గా మానకున్నా
* అదికం గా చెమట పట్టడం.
* శరీరం దుర్గంధం గా ఉండటం.
* ఒళ్ళు నొప్పులు, బడలిక ఏర్పడటం.
* ఎప్పుడు నిద్రపోవాలి అని, విశ్రమించాలి అనిపించడం.
* శరీరం లావు ఎక్కడం.
* కళ్ళు పుసులు కట్టడం.నాలుక మీద పాచి చేరడం,చెవులో గుబిలి తయారు అవ్వడం.
* గోళ్లు , వెంట్రుకలు అతిగా పెరిగిపోవడం.
* తలపైన ఉండే జుట్టు జడలు కట్టడం.
* అరికాళ్ళు, అరిచేతులు లలొ మంటలు పుట్టడం, తిమ్మిరులుగా అనిపించడం.
* నోరంతా తియ్యగా ఉండటం.
* మూత్రం తియ్యని వాసనని కలిగి కలకబారినట్టు ఉండటం.
* మూత్రం ఎక్కువ సార్లు , ఎక్కువ ప్రమాణం లొ పొవడం.
పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉంటే మదుమేహం గా అనుమానించాలి.
మధుమేహ రోగులు తినకూ డని పదార్దాలు –
చెక్కెర, బెల్లం ,జామ్, ఐస్ క్రీం, క్రీం కలిగిన కేకులు , తియ్యని పండ్లు,ఖర్జూరం,చిలగడ దుంపలు, చెక్కెర కలిపిన ఫలరసాలు, స్వీట్స్, గేద నెయ్యి,వెన్న,డాల్డా,కొవ్వు కలిగిన మంసాహారం, కొడి గుడ్డులోని పచ్చసోన తినకుడదు.
తీసుకొవలసిన పదార్దాలు –
కురగాయల్లొ బూడిద గుమ్మడి, క్యాబేజీ, బీన్స్, చిక్కుడు, వంకాయలు, బెండకాయలు, ములగకాడలు , పొట్లకాయ, ఉల్లి , కాకర, దోస, టమాటో , కుక్కగొడుగులు, బెంగళూరు మిరప,ఆకు కూరలు, ముల్లంగి మొదలయినవి . పండ్లలో సీతాఫలాలు, బొప్పాయి, మేడి పండ్లను తీసుకోవచ్చు.
పప్పుల్లో పెసరపప్పు,మినుములుని, కందిపప్పుని, శెనగ పప్పుని తీసుకొవచ్చు.
ధాన్యం విషయానికి వస్తే ఉడకబెట్టిన అన్నాన్ని,గోదుమలని తీసుకొవచ్చు. బియ్యం , అటుకులు, వేరుసెనగ, కొబ్బరి, దుంపలు, పచ్చి అరటిపళ్ళు, క్యారెట్ , మత్తు పానీయాలు బాగా తగ్గించి తీసుకోవాలి .
నివారణ –
మొదుగ పూలను రాత్రిపూట ఒక మట్టిపాత్రలో మొదటిరోజు ఒక పువ్వు వేసి గ్లాస్ నీరుపొసి ఉంచాలి.పొద్ధూన్నె పరగడుపున ఆ నీటిని తాగాలి.
2 వ రోజు 2 పూలు , 3 వ రోజు 3 పూలు 4 వ రోజు 4 పూలు 5 వ రోజు 5 పూలు వేసి నానబెట్టిన నీరు తాగుతూ ఉండాలి. తరువాత మళ్ళి ఒక పువ్వు నుంచి ప్రారంబించి 5 పువ్వుల వరకు పెంచుతూ వాడాలి . ఈ విదంగా 41 దినాలు చేస్తె మదుమేహ వ్యాధి సమూలంగా హరించి పోతుందని ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.