చుండ్రు నివారణ

0
734

*చుండ్రు నివారణ*
**********************
వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును .

*మొదటి మీ జుట్టు షోడా నీళ్లతో కడగడం.*

1.గోరు వెచ్చని నువ్వుల నూనెను తలకు + శరీరమంతటికి మర్దన ( మాలీష్ ) చేయవలెను. 1 గంట తర్వాత పెసర పిండీ ( Green Gram Powder ) తో స్నానం చేయ వలెను .

2 . 3 spoon ల మెంతులను1 గ్లాసు నీళ్ళలో రాత్రి నాన బెట్ట వలెను .
ఉదయం మెంతులలో + పెరుగు కలుపుతూ పేస్ట్ తయారు చేసుకొన వలెను .
నువ్వుల నూనె ను తలకు ( scalp ) కి పట్టిస్తూ 10 నిమిషాల పాటు మర్ధన చేయాలి .
ఆ తర్వాత పేష్ట్ ని తలకు బాగా పట్టించాలి . 20 – 30 నిమిషాల తర్వాత *పెసర పిండి ( green gram powder )* తో స్నానం చెయ్యాలి ..
గమనిక : —
1. చుండ్రు కొద్దిగా వున్న వారు , మొదటి పద్ధతి ప్రకారము వారానికి 2 లేక 3 సార్లు చేయడం వలన శరీరంలో వున్న వాతము తగ్గి , పగిలిన పెదవులు , మడమలూ మరియు చుండ్రు తగ్గి పోవును .

2. చుండ్రు ఎక్కువగా వున్న వారు 2 వ పద్దతి ప్రకారము చేయ వలెను. 1 వారము ప్రతి రోజు చేయ వలెను . చుండ్రు తగ్గని యెడల మరల ఇంకొక వారము ప్రతి రోజు చేయ వలెను . అప్పటికి చుండ్రు పూర్తిగా తగ్గి పోవును . వరుసగా 2 వారాలు చేయ లేని వారు . 1 వారము చేసిన తర్వత 1 వారము Gap ఇచ్చి మరల 1 వారము ప్రతి రోజు చెయ్యండి . పూర్తిగా తగ్గే వరకు చెయ్యండి.
3 . చుండ్రు పూర్తిగా తగ్గిన తర్వాత మొదటి పద్ధతి ప్రకారము వారములో ఒక సారి ఖచ్చితంగా చెయ్యండి .

పై పద్దతులు ఆచరించన యెడల , మీ వెంట్రుకలు SILKY గా తయారవును . క్రొత్త వెంట్రుకలు వచ్చును .

కృష్ణ తులసి ఆకుల రసంని తల ( Scalp ) కు పట్టించి , 1 గంట తర్వాత తలస్నానం చేయవలెను .
త్వరలోనే DANDRUFF తగ్గిపోవును .

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.