కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే… వంకాయ తినండి

0
699

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
*కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే… వంకాయ తినండి.*
*****************
కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది. అలాగే రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఒక్క టమాటాకే ఉంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి టమాటాలు ఎంతో మేలుచేస్తాయి.

టమాటాలతో బరువు తగ్గడంతోపాటు స్థూలకాయం కూడా బాగా తగ్గుతుంది. దోసకాయతో కూడిన ఆహారం ఒంటికి ఎంతో చలువ. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది.

వర్షాకాలంలో మాంసాహారం కంటే శాకాహారం ఎక్కువగా తీసుకుంటే పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. అధిక విటమిన్లతో కూడిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్స్ విటమిన్లు కార్బొహైడ్రైట్‌లు ఉన్న పోషకాహారం ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఏ విటమిన్ కోసం క్యారెట్ బి విటమిన్ కోసం సోయాబిన్, సీ విటమిన్‌కు టమాటా, డీ విటమిన్‌కు వెన్న ఈ విటమిన్ కోసం ఆకుకూరలు, కూరగాయలు కె విటమిన్ కోసం బంగాళాదుంపలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

*మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తప్పనిసరి…*
*?******************
సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్‌ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగితే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలు నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. గ్లాసుడు నీళ్ళలో సబ్జా గింజల గుజ్జు వేసి మూడు, నాలుగుసార్లు తాగితే మంచి ఫలితం.

వీటి గుజ్జును పైనాపిల్, యాపిల్ జ్యూస్‌లలో కలిపి పిల్లల చేత తాగిస్తే శరీరంలో వేడి తగ్గిపోతుంది. అదే ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది. మహిళలు బరువు తగ్గాలనుకుంటే సబ్జాను నానబెట్టిన నీటిని తాగాలి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది

*రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే…*
********************
హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

పైగా, రాత్రి వేళల్లో తొందరగా తినే వారిలో శక్తిస్థాయి పెరిగి.. పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తింటే లేని రోగాలనుకొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.

పగటి వేళ జీవక్రియ వేగంగా జరుగుతుంది. రాత్రివేళ జీవక్రియ రేటు తగ్గుతుంది. వైద్యనిపుణుల సూచన ప్రకారం రాత్రి ఆరు గంటలకే భోజనం చేస్తే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదనీ, లేట్‌ నైట్‌ పనిచేసేవారు, నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు 8 లోపే భోజనం చేయాలని చెపుతున్నారు.

అయితే, రాత్రిపూట తినే ఆహారం లైట్‌గా ఉండాలనీ, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌, నూడుల్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలను అంతా ఫాస్ట్‌గా తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేశాక పది నిమిషాల పాటు వాకింగ్ చేస్తే జీవక్రియ వేగం పెరుగుతుందని చెపుతున్నారు

*జామ ఆకులతో మేలు… జామ ఆకుల టీ తాగితే…*
**********************
రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా… వాటిల్లో ఉండే పోషకాల గురించి తెలుసా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే!

నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.

జామాకు టీని తాగితేూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.