చెమట అధికంగా పట్టేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడచ్చు

0
741

చెమట అధికంగా పట్టేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడచ్చు..

వేడి పెరుగుతున్న కొద్దీ చెమట, దానితో పాటు చర్మ సంబంధిత ఇబ్బందులు పెరిగిపోతుంటాయి. వేడితాపానికి చర్మం కమలిపోవడం, చర్మం పగుళ్ళు, వడదెబ్బ, చెమటకాయలు, స్కిన్‌ అలర్జీ ఇలా రకరకాల ఇబ్బందులు మొదలైపోతాయి. బాగా ఆడినపుడు… ఎక్కువగా పని చేసినపుడు చెమట అధికంగా పడుతుంది. దీనికి చర్మంలో ఉండే స్వేదగ్రంథులు ఉండటమే. చెమట దుర్వాసనతో నలుగురిలో తిరగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

మనిషి శరీరంలో వేడి, ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు చెమట ఎక్కువగా ఉత్పత్తి కావడం సహజం. అది ఆవిరి అయ్యే ప్రక్రియలో భాగంగా శరీరాన్ని చల్ల బరుస్తుంది అంటే, వేడిగావున్న శరీరాన్ని చల్ల బరిచేందుకు చెమట పట్టడం సహజం. చెమట అధికంగా పట్టేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.

చెమట ఎక్కువగా పట్టేవారు రోజూ రెండుసార్లు స్నానం చేస్తే మంచిది. శరీర శుభ్రతపై ప్రత్యేక శ్రద్ద కనబరచండి. అలాగే, తేమ కలిగిన సబ్బులకు బదులు సాధారణ సబ్బులు వినియోగించడం మంచిది. వేపతో తయారు చేసిన సబ్బులను వినియోగిస్తే శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసన మటుమాయమౌతుంది.

పరిశుభ్రమైన దుస్తులు, కాటన్‌ దుస్తులు ధరించడం వల్ల కొంత మేరకు చెమటను నివారించవచ్చు. ఉతకని దుస్తులను అల్మారాలో ఉంచితే మరింత దుర్గంధం వ్యాపిస్తుంది. దీంతో బ్యాక్టీరియా మరింతగా రెచ్చిపోయి విపరీతమైన దుర్గంధాన్ని పుట్టిస్తుంది. ముఖ్యంగా మీరు ధరించే దుస్తుల్లో సింథటిక్‌ వస్త్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారం విషయంలో నూనె పదార్ధాలు, వేపుళ్లు, కారం మసాలలు వీలైనంతగా తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నాన్‌ వెజ్‌ తినకపోవడమే ఆర్యోగకరం. పీచుపదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మసాలా దినుసులతో కూడిన ఆహారం లేకుండా చూసుకోవాలి..

వేసవితాపాన్ని తగ్గించడంలోనూ, దప్పికను తీర్చడంలోనూ మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు గ్లాసెడు మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వేసవి వాతావరణానికి తగ్గ పండ్లను తినాలి. ఇటువంటి జాగ్రత్తలతో వేసవితాపం నుండి బయట పడవచ్చు.

అధిక చెమటకు కారణం అయ్యే కొన్నిముఖ్యమైన ఆహారాలు (కాఫీ, కోలా డ్రింక్‌‌స, బ్లాక్‌ టీ, చాక్లెట్స్, గార్లిక్‌, ఉల్లిపాయలు, అధికంగా కారం ఉప్పు కలిగిన కూరలు) వంటి వాటికి దూరంగా ఉండాలి.

నీళ్ళను ఎక్కువగా త్రాగడం వల్ల, శరీరం హైడ్రేట్‌ లో ఉంటుంది. శరీరం ఎప్పుడైతే హైడ్రేషన్‌ క్రమంగా జరుగుతుంటుందో అప్పుడు తప్పనిసరిగా శరీరం వేడెక్కదు..దాంతో శరీరంలో చెమట పట్టడానికి అవకాశం లేదు.

తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి, ఎప్పుడైతే ఎక్కువగా కష్టపడుతుందో, అది అధిక చెమటకు దారితీస్తుంది. ఆలివ్‌ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇది అతి సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి మీ వంటకాల్లో ఆలివ్‌ ఆయిల్‌ ను చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.