Cardamon

0
659

🔱🌞
⚡️Cardamon ⚡️

*ఏలకులు*

ఒక మంచి సుగంధ ద్రవ్యము. పచ్చఏలకుల శాస్త్రీయ నామం ఎలెట్టరీయా (Elettaria) మరియు నల్ల ఏలకుల శాస్త్రీయ నామం అమెమం (Amomum). ఏలకులు పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడబడుతున్నవి. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరక సంహితం లోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడురాసిన అర్ధశాస్త్రం లోను వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాల రాణిగా పేర్కొంటారు. కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు.

యాలకులు అనాదిగా ఆయుర్వేద శాస్త్రీయ వైద్యవిధానంలో వాడకంలో ఉన్నట్టు కరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వీటినుండి తయారైన ఇలాదికర్న, ఇలాదివతి, ఇలాదిక్వత, ఇలాదిమొదక, ఇలాద్యారిష్ట, శీతోఫలాదికర్న, అరవిందసవ వంటి ఔషధాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శరీరానికి చలువచేసే గుణాలు ఎక్కువగా ఇందులో ఉండటం మూలంగా వీటిని అనేక పానీయాల్లో, వంటకాల్లో వినియోగించడం అనవాయితీగా వస్తోంది.

ఉపయోగాలు

దీనితో తయారుచేయబడిన అంతవర్ధ ప్రసమన, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పనిచేస్తుంది.

ఒళ్ళు నొపðలకి, సిరోవిరికన అనే ఔషధం, నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటి కెలో మటుమాయమవు తుంది.

అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది.

యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి.

వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్‌) కూడా తగ్గుముఖం పడ తాయి.

చాలా రకాల రుగ్మత లకి ఇలద్వయ (ఇలాచీ-యాలకులు) ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది.

దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

యాలకుల పొడి, సొంటిపొడి 0.5గ్రా్ప్పచొపðన సమపాళ్ళలో తయారుచేసుకుని అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే, కఫాన్ని నిర్మూలించి, దగ్గునుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఆస్త్మా రోగులు యాలకులు, జాతిఫల, కుంకుమ పువ్వు, వంశలోకన, నాగకేసర, శంఖజీరక సమ పాళ్ళలో నూరి తేనెతో కలిపి సేవిస్తూవుంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది.

ఇలా అన్ని రుగ్మతలకీ ఉపయోగపడే ఈ ఇలద్వయ సంజీవని వంటిదని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. దీనిని ఇంటి ఆవరణలో కూడా పెంచుకుంటే అందమైన పుష్పాలతో, సంవత్సరం పొడవునా ఉండే పచ్చని ఆకులతో ఇంటికి శోభనివ్వడమేకాకుండా మంచి ఔషధం కూడా మన పెరటిలో ఉన్నట్టే…

ఏలకుల గింజలలో టర్పనైన్, లిమొనెన్, టెర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి. వీటిని సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడతారు. చైనాలో జరిగిన పరిశోధనలలో వీటికి కెమోధెరపీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గించే శక్తి ఉందని రుజువు అయింది. వీటిని ఉదర సంబధమైన అజీర్తి, మలబద్దకం, అల్సర్ మొదలైన వ్యాధులలోను, శ్వాస సంబంధమైన ఆస్థమా, జలుబు, సైనస్ మొదలైన వ్యాధులలోను, కలరా, డీసెంట్రీ, తలనొప్పి, చెడుశ్వాస మొదలైన వాటికి చికిత్సగా వాడతారు.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.