శరీర సౌష్టవం*** బాడీ ఫిట్నెస్

0
997

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
శరీర సౌష్టవం*** బాడీ ఫిట్నెస్
**********************
ఒకప్పుడు సన్నగా కనపడితే ఏం సరిగా తినటంలేదా అని ప్రశ్నిచేవారు.కాని ఇప్పుడు అందుకు భిన్నంగా ఏంటీ తిండి తగ్గించవచ్చుగా కరెంటు తీగలా ఉంటావ్ అంటున్నారు.ఇప్పుడు కాలం మారింది.సన్నగా నాజూకుగా జీరొ సైజ్ ను చేసేవారికి బాగా గిరాకీ పెరిగింది.సన్నగా నడుము తేలి ఉంటే అమ్మో బాపుగారి బొమ్మో!అని చూపు తిప్పుకోలేరు.అయితే ఇప్ప్డున్నా ఆహార అలవాట్లు మాత్రం లావు పెంచేవే కానీ తగ్గించేవి మాత్రం కావు.మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది యువత పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. వీరి ప్రయత్నాలన్నీ శూన్యంగా మారుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.

1.కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది.ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు.కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.

2 ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి..ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి.

3.మొదట తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

4.గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి.

5.దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.

6.తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి.

7.రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి.

8. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.

ఏది చేస్తే శరీరానికి మంచిది:

తెల్లవారుజామున నడిస్తే శరీరానికి చాలా మంచిది.కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు.

మీ ఆహారపు అలవాట్లను మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించంది. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదముంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.