బెస్ట్ మెడిసిన్

1
982

🔱🌞👁‍🗨🕸
*బెస్ట్ మెడిసిన్..*

⏳ఈ రోజుల్లోనే కాదు ఇప్పటికీ ఇదే వాస్తవం. అందుకే ప్రతి రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేస్తే కలిగే ప్రయోజనాల్లో ముఖ్యమైన పదింటిని ఇప్పుడు తెలుసుకుందామా..!

⏳వాకింగ్‌ రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదల వుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయస్సు మీద పడడం కారణంగా వచ్చే దెమెంతియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

⏳ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో వాకింగ్‌ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందట. నిత్యం వాకింగ్‌ చేస్తే కళ్లపై అధిక ఒత్తిడి తగ్గడంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట.

⏳రన్నింగ్‌ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్‌ వాకింగ్‌ చేయడం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చెబుతోంది. నిత్యం వాకింగ్‌ చేస్తే గుండె సమస్యలు, హార్ట్‌ ఎటాక్‌లు రావట. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్‌ తగ్గుతాయట. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట.

⏳వాకింగ్‌ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్‌ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి.

⏳డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం రన్నింగ్‌ కన్నా వాకింగ్‌ చేస్తేనే ఎంతో ప్రయోజనం కలుగుతుందట. 6 నెలల పాటు వాకింగ్‌, రన్నింగ్‌ చేసిన కొందరు డయాబెటిస్‌ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. వాకింగ్‌ చేసిన వారిలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల రోజూ వాకింగ్‌ చేస్తే డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెబుతున్నారు.

⏳రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం పోతుంది. విరేచనం రోజూ సాఫీగా అవుతుంది.

⏳ప్రతిరోజూ 10వేల అడుగులు (100 నిమిషాలు) పాటు వాకింగ్‌ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

దీంతోపాటు కండరాలు దఢంగా మారుతాయట.
వాకింగ్‌ చేయడం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా అరిగిపోవు. అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకు రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్‌ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.

బ్యాక్‌ పెయిన్‌తో సతమతమయ్యేవారికి వాకింగ్‌ చక్కని ఔషధం అనే చెప్పవచ్చు. లో ఇంపాక్ట్‌ వ్యాయామం కిందకు వాకింగ్‌ వస్తుంది. కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది. కనుక వెన్ను నొప్పి ఉన్నవారు నిత్యం వాకింగ్‌ చేయడం మంచిది.
ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వస్తారట. వారు హ్యాపీగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక నిత్యం వాకింగ్‌ చేయడం మంచిది.
సో.. నడక వల్ల కలిగే ప్రయోజనాలు హిపోక్రాట్స్‌ చెప్పిన.. మరొకరు చెప్పినా.. అవి నిత్యసత్యాలు. పది అడుగులు నడిస్తే.. పోయేదేమి లేదు.. అనారోగ్య సమస్యలు తప్ప.. మరెందుకు ఆలస్యం స్టార్ట్‌ వాకింగ్‌..🔚

Read this also

1 COMMENT

  1. […] post బెస్ట్ మెడిసిన్ appeared first on Fun […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.