అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు

0
2156

అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు –

* చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .

* దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో “samniferin ” అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

* ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును

* జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును.

* పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును .

* విరేచనం సాఫీగా అయ్యేలా చేయును .

* విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.

* రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి

* వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును .

* శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును .

* శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును .

* వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి.

* థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .

* మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు .

* తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .

* గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .

* స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.

* చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును .

* క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు .

* ఇది మంచి రసాయనిక ఔషదం ప్రతి ఒక్కరు తప్పకుండా వాడుకోవలసిన ఔషదం ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ ఔషదాన్ని వాడటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి , నరాలకు సత్తువ పెరుగును .

గమినిక –

సరి అయిన పద్దతుల్లో శుద్ది చేసినటు వంటి అశ్వగంధ చూర్ణంని మాత్రమే వాడవలెను . ఈ అశ్వగంధని నాటుఆవుపాలతో శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే సరైన ఫలితాలు ఇస్తుంది. మొత్తం 11 సార్లు నాటు ఆవుపాలతో శుద్ది చేయవలెను . ఇది తెల్లగా , క్రీము రంగులో ఉంటుంది. మార్కెట్ లో ప్రస్తుతం దొరికేటువంటి అశ్వగంధ చూర్ణం బ్రౌన్ రంగులో ఉంటుంది. అంత మంచి ఫలితాలు ఇవ్వదు. మంచి అనుభవ వైద్యుల సహాయంతో అశ్వగంధ చూర్ణాన్ని తయారుచేయించుకొని వాడుకోగలరు.

కాళహస్తి వెంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేదం

9885030034

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.