గసగసాల ఉపయోగాలు

0
816

గసగసాల ఉపయోగాలు
*****************************
వీర్యస్తంభనకు పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి, అర కప్పు పాలల్లో కలిపి అందులో 20 gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంభన కలుగుతుంది.

దేహమునకు చలువ చేయుటకు 10gm గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటూ వుంటే ఉష్ణ శరీరం కలవారు అధిక వేడి తగ్గి దేహం చలువ చేస్తుంది .

చుండ్రుకు-వెండ్రుకలు పెరుగుటకు గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మేతగా రుబ్బి తలకు పెట్టుకుని ఆరిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ వుంటే తలలో కురుపులు చుండ్రు తగ్గి పోయి వెండ్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి .

శిరోవాతమునకు గసగసాలు 10gm, యాలకులు 10gm, సోంపు గింజలు 10gm .ఈ పదార్ధాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అందులో 60gm ఆవు నెయ్యి కలిపి నీరు ఇరిగే నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి దించి వడపోసి నిలువ ఉంచుకుని దీనిని రోజు తలకు రాసుకుంటూ వుంటే తల దిమ్ము, తల నొప్పి, పార్శ్వపు నొప్పి హరించి పోయి మనసు ప్రసన్నంగా ప్రశాంతంగా వుంటుంది.

గర్బిణీల రక్త జిగట విరేచనాలు గసగసాలు 10gm లు, పటిక బెల్లం 20gm కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని, పూటకు 5gm పొడిని 20 gm వేన్నలో కలుపుకుని రోజు 2 లేదా 3 పూటలు తింటూ వుంటే గర్బిణీలకు కలిగే రక్త జిగట విరేచనాలు తగ్గిపోవును.

జిగట విరేచనాలు గసగసాలు కొంచెం దోరగా వేయించి దంచి చూర్ణం చేసి 2 పూటలా పూటకు 5 gm నుండి 10 GM మోతాదుగా అన్నంలో కలిపి తింటూ వుంటే 2 లేక 3 రోజుల్లో జిగట విరేచనాలు తగ్గిపోతాయి.

నిద్ర రాకపోతే వేడి చేసిన గసగసాలు మూట గట్టి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే నిద్ర వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.