Baking Soda , cooking soda

0
449

🔱🌞

బేకింగ్ సోడా లేక వంట సోడా , Baking Soda , cooking soda

బేకింగ్ సోడా లేక వంట సోడాను మనం కేకులు, బజ్జీలు వంటివాటిలో అవి మృదువుగా రావడానికి ఉపయోగిస్తాము. కానీ బేకింగ్ సోడా వల్ల అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి.ఇతతర పేర్లు — బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్పౌడర్, సోడా, తినే సోడా. బేకింగ్ సోడాను … బైకార్బనేట్ ఆఫ్ సోడా(Bicarbonate of soda) లేదా సోడియం బైకార్బనేట్ (sodium bicarbonate) అంటారు . దీని కెమికల్ ఫార్ములా = NaHCO3.. ఇది తెల్లని చిన్న గింజలు లా ఉండే గుండ(powder). దీనిని లేబొరిటరీ లో తయారుచేయగలినా ప్రకృతిపరముగా దొరికె బేకింగ్ సోడాను ” నాకొలైట్ (nahcolite) అంటాము . ఇది క్షారగుణము కలిగి ఉంటుంది . ప్రొటీన్స్ ను ముక్కలు చేస్తుంది . బేకింగ్ సోడా , బేకింగ్ పౌడరూ ఒకటి కావు . బేకింగ్ సోడా.. ప్యూర్ సోడియం బైకార్బొనేట్ , బేకింగ్ పౌడర్ … సోడియం బైకార్బొనేట్ +పొటాసియం బైకార్బొనేట్ (cream of tartar) కలిపి ఉన్న మిశ్రమము . పొటాసియం బైకార్బొనేట్ ద్రాక్ష నుండి వైన్‌ తయారీ సమయములో తయారవుతుంది . బేకింగ్ పౌడర్ కూడా వంటకాలలో వాడుతారు . ఉపయోగాలు : * ఫరuచర్ మీద పెన్సిల్ గీతలు, క్రేయాన్ లేక ఇంకు మరకలు ఉన్నాయా? అయితే తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఆ మరకల మీద రుద్దండి. * ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి. * కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి. * మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయార్. * తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది. * చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం. * టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి. * పొట్టలో మంట లేక అనిజీగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి. తరుచుగా వాడకూడదు. * కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది. * కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది . సోడాను వాడవద్దు : కొంతమంది బీన్స్ మెత్తగా ఉడికేందుకు బేకింగ్ సోడా వాడుతుంటారు. అయితే ఇది సరైంది కాదు. సోడా బీన్స్‌లోని తేమని పీల్చివేస్తుంది, అంతేగాకుండా వాటిలోని పోషక విలువలను నశింపజేస్తుంది. కాబట్టి… సోడాను వాడకపోవటం మంచిది.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.