ఆస్థమా

0
1795

ఆస్థమా !
.

  • ఆస్థమా బారిన పడ్డవారు ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆస్థమా నుండి విముక్తులు కాగలరు
    .

1. ఈ పదార్ధాలను తీసుకోకండి
.
( ఫ్రిడ్జ్ నీరు , ఐస్ క్రీం , చల్లని జ్యూస్ లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పెరుగు, పుల్లని చట్నీలు, ఊరగాయలు )
.
2. మీ ఊపిరితిత్తులకు ప్రాణాయామం గొప్ప మేలు చేస్తుంది. మీరు ప్రాణాయామం నెమ్మదిగా చెయ్యండి. కపాల భాతి ప్రాణాయామం ఒకేసారి ఎక్కువ సేపు కాకుండా మూడేసి నిముషాలకు ఒక సారి ఆగి ఆగి చెయ్యండి.. ఎక్కువ సేపు చెయ్యండి . నెమ్మదిగా చెయ్యండి . అనులోమ విలోమ కూడా ఎక్కువ సేపు చెయ్యండి శీతాకాలం లో ఓపెన్ ఎయిర్ లో చెయ్యకండి. గదిలో కిటికీలు తెరచి చెయ్యండి.
.
3. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, కొంచెం శొంఠీ , తులసి ఆకులు వేసుకుని ఆ నీటిని త్రాగండి.
.

భోజనం చేసిన ఒక గంట తర్వాత కూడా త్రాగండి.
.
4. ఒట్టి పాలను ఎప్పుడూ త్రాగకండి. పసుపు, శొంఠీ వేసిన పాలను త్రాగండి. పెరుగు వాడకండి.
.
గృహ ఉపచారాలు :
.

1. ఉదయమూ, సాయంత్రమూ కొన్ని తులసి ఆకులు వేసిన గోమూత్రం త్రాగండి. శీతాకాలంలో వేడినీటిలో వేసిన గోమూత్రం లో తులసి ఆకులు వేసుకుని త్రాగండి.
.

.
2. 100 గ్రాముల బాదాములు , 20 గ్రాముల మిరియాలు, 50 గ్రాముల పటికబెల్లం … మూడిటినీ చూర్ణం చేసి ఒక గాజు సీసాలో వేసుకోండి.
.
రాత్రి పడుకునే ముందు పాలల్లో పసుపు, శొంఠీ పొడి , వేసిన పాలల్లో ఈ చూర్ణం కూడా ఒక చెంచాడు వేసుకుని త్రాగండి.
.

3. మీ గొంతు పాడయినా, దగ్గు వస్తున్నా ఈ క్రింది పదార్ధాలను కలిపి నోట్లో పెట్టుకుని ఆ రసం చప్పరించండి. చిన్న ములేటీ ( యష్టి మధుకము ) రెండు మిరియాలు , కొద్దిగా పటికబెల్లం , ఒకటో రెండో లవంగాలు
.

.
4. దగ్గూ, జ్వరమూ కూడా వస్తూ ఉంటె 10 తులసి ఆకులు, 5-7 లవంగాలు, కొంచెం శొంఠీ లేదా అల్లంలను కషాయం లా మరిగించి దాన్ని త్రాగండి
.
ఆయుర్వేద పరిష్కారాలు :
.
1. సంజీవని వటి, లక్ష్మి విలాస్ రస్ మాత్రలను పెద్దలు ఒక్కొక్కటి చొప్పున , పిల్లలు సగం చొప్పున ఉదయం సాయంత్రం గోరువెచ్చని పాలతో గానీ, గోరువెచ్చని నీటితో గానీ వేసుకోండి .

.
2. ముక్కు దిబ్బడ కూడా వుంటే , షట్ బిందు తేల్ రెండు రెండు చుక్కలు చొప్పున రెండు ముక్కులలోనూ వేసుకోండి. చక్కటి రిలీఫ్ వస్తుంది. కఫం బయటపడుతుంది ( ఎక్కువ వెయ్యకండి)
.
3. పంచ కూళ్ల కషాయం ఉదయం త్రాగండి. దగ్గు కూడా బాగా వస్తూ ఉంటె అందులో యష్టి మధుకము, vanfasa flowers కూడా కలపండి. ఈ కషాయం త్రాగిన అరగంట తర్వాత పాలు త్రాగవచ్చు.
.
( పీపల్ , పీపలా మూల్, చిత్రక్, చవ్య, శొంఠీ.. పంచకూళ్ళు అంటారు . వీటిని సమాన పాళ్ళల్లో తీసుకోండి . బరకగా మిక్సీలో గుండ చెయ్యండి. ముందు రోజు సాయంత్రం నీళ్ళల్లో నానబెట్టండి. మర్నాడు ఉదయం కషాయం గా కాచండి . నాలుగోవంతు అయ్యేవరకూ మరిగించాలి )
.

.
4. పతంజలి ఉత్పత్తి “దివ్యధారా” కొద్దిగా తీసుకుని ఛాతీకి రాసి మస్సాజ్ చెయ్యండి. దీనిని నీటిలో వేసి మరిగించి ఆవిరి పట్టండి.
.
5. శోంఠీ, మిరియాలు, పిప్పళ్ళు … వీటిని త్రికటు అంటారు . ఈ చూర్ణం ఒక గ్రాము వరకూ తేనెతో కలిపి ఉదయం సాయంత్రం చప్పరించండి
.

.
6. చ్యవనప్రాశ రోజూ తినండి ( వేసవిలో వద్దు )
.

7. పాలల్లో శిలాజిత్తు , పసుపు , శోంఠీ వేసుకుని త్రాగండి
.
ప్రాణాయామం చేసి ఆస్తమా సమస్యనుండి బయటపడిన వారు ఎందఱో ఉన్నారు . వారిలో మీరూ ఒకరుగా మారాలి అంటే యోగా చేస్తూ ఈ చిట్కాలు పాటించండి
.
మీ రాఘవానంద్ ముడుంబ . అధ్యక్షుడు , పతంజలి యోగ సమితి , తూర్పుగోదావరి జిల్లా కాకినాడ

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.