Approaching 30s, Here’s What You Should Know About Skin Care

0
471

🔱🌞
*30+ లకు చేరుకుంటున్నారా, మీరు చర్మ సంరక్షణ గురించి తప్పక తెలుసుకోవల్సిన అంశాలు (Approaching 30s, Here’s What You Should Know About Skin Care)*

మీ చర్మాన్ని వయస్సు పెరిగే కొద్ది సంరక్షించడం కష్టంగా ఉండవచ్చు. గతంలో, మీరు క్లీన్సర్ సీసా, సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే సరిపోయేది. నేడు, పర్యావరణం చాలా గణనీయంగా మారిపోయింది. మీ శరీరంపై చర్మంతో పోల్చినప్పుడు మీ ముఖ చర్మం చాలా పలచగా మరియు సున్నితంగా ఉంటుంది. కనుక మృదువైన సంరక్షణ అత్యవసరం:

*1. రోమాలు తొలగింపు:*

రోమాలు శరీరం మొత్తం మొలుస్తాయి. రోమాలను తొలగించడానికి, మీరు ఒక పరిష్కారం మాత్రమే లేదు. పలు పద్ధతులు ఉన్నాయి. రోమాలను తొలగించాల్సిన శరీర భాగం ఆధారంగా, మీరు ట్వీజర్‌లు, షేవర్‌లు మరియు వ్యాక్సింగ్ ఉపయోగించవచ్చు. లేజర్‌లు, ఎలక్ట్రోలేసిస్ మొదలైన కొన్ని శాశ్వత పరిష్కరాలు కూడా ఉన్నాయి, కాని ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి.

*2. స్నానం*:

తక్కువ సమయం పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. కఠినమైన సబ్బులను ఉపయోగించరాదు. బదులుగా, మాయిశ్చరైజింగ్ బాడీ వాష్‌లను ఉపయోగించండి. సున్నితమైన శరీర భాగాల్లో మృదువుగా శుభ్రం చేసుకోండి. మృదువైన పొడి తువాలుతో శరీరాన్ని నెమ్మదిగా తుడుచుకోవాలి.

*3. ఫేస్ మాస్క్‌లు*:

మీరు స్టోర్‌లో కొనుగోలు చేసిన లేదా ఇంటిలో తయారు చేసిన ఉత్పత్తిని ఉపయోగించండి. ఫేస్‌మాస్క్‌లు వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా, ఇది మీ చర్మ సంరక్షణకు అత్యంత చౌకైన మార్గం.

*4. మొటిమలను చిదమరాదు* :
యుక్తవయస్సులోని అమ్మాయిల పీడకల అయిన మొటిమల నివారణకు పలు వైద్య పరిష్కారాలు మరియు సహజ పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. మొటిమలు ఎందుకు ఏర్పడతాయో ముఖ్యంగా తెలుసుకోవాలి. శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవడం వంటి మంచి చర్మ సంరక్షణ చర్యలు ద్వారా మొటిమలను నివారించవచ్చు.

*5. షాంపూ: జుట్టును శుభ్రం చేసుకోవడానికి షాంపూను* ఉపయోగిస్తాము, కాని వాటిలో మీ జుట్టు మరియు నెత్తి మీద చర్మానికి హాని కలిగించే కఠినమైన రసాయనాలు ఉంటాయని గుర్తుంచుకోండి. కనుక, సరైన షాంపూను ఎంచుకుని, ఉపయోగించాలి.

*6. కండీషనర్*:

మీ జుట్టును శుభ్రం చేసుకునే తర్వాత తక్షణమే కండీషనర్‌ను ఉపయోగిస్తారు మరియు దీనిని షాంపూ వలన పోయిన తేమను తిరిగి పొందడానికి ఉపయోగిస్తారు.

*7. శుభ్రం* చేసుకోవడం: ఏదైనా మేకప్ వేసుకోవడానికి ముందు మీ చర్మాన్ని సరైన రీతిలో ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. మీరు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ముందు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి.

*8. కళ్లు ఉబ్బడం* :

మీ ఉబ్బిన కళ్లు నుండి ఉపశమనం పొందడానికి దోసకాయ ముక్కలు లేదా టీ బ్యాగ్‌లు లేదా చల్లని తువాలు ఉపయోగించండి.

*9. సెరమ్: చర్మ*
సంరక్షణ సామగ్రిలోకి కొత్తగా చేరిన అంశం అయిన ఇది మీరు తరగని మెరిసే చర్మాన్ని కలిగి ఉండటానికి అత్యంత ముఖ్యమైనది. సెరమ్ చర్మం లోపలికి చొచ్చుకుని పోతుంది. ఇవి ముడుతలు మొదలైన నిర్దిష్ట చర్మ సంరక్షణ సమస్యల నివారణకు ఉపయోగిస్తారు.

*10. ఫేస్ క్రీమ్:*

అన్ని సమయాల్లోనూ ముఖాన్ని తేమగా ఉంచుకోవడానికి చాలా కష్టం. సెరమ్ పూసుకున్న తర్వాత, ఫేస్ క్రీమ్ ఉపయోగించి మీ చర్మానికి తేమ అందించాలి. చర్మ మాయిశ్చరైజర్ చర్మం యొక్క బాహ్య పొరలో తేమను పట్టి ఉంచుతుంది. ప్రతిరోజూ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి మరియు దీని వలన మీ చర్మం దీర్ఘకాలంపాటు సంరక్షించబడుతుంది.

*11. ఐ క్రీమ్* :

మీ కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి మరియు దాని చుట్టూ చర్మం కూడా సున్నితంగా ఉంటుంది. కళ్లు చుట్టూ ఉండే చర్మం చాలా వేగంగా వయస్సు పెరుగుతున్నట్లు సూచిస్తుంది. మంచి ఐ క్రీమ్ ఉపయోగించడం వలన ముడుతలు, ముదురు రంగు వలయాలు, పొడిబారితనం నివారించబడతాయి మరియు మృదువుగా ఉంటుంది.

*12. సన్‌స్క్రీన్*:

మీ చర్మ రకాన్ని మరియు సరైన ఎస్‌పిఎఫ్ తెలుసుకోవడానికి సహాయంగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పిఎఫ్) ఉపయోగించండి. అత్యధిక సంస్థలు సన్‌స్క్రీన్ గల ఫేస్ మరియు బాడీ మాయిశ్చరైజర్‌లను అందిస్తున్నాయి.

*13. చేతులు & కాళ్లు* :

మీ చేతులు మరియు కాళ్లను విస్మరించరాదు. వాటిని కొంచెం గట్టిగా శుభ్రం చేసుకోవాలి, మాయిశ్చరైజర్ క్రీమ్‌లు పూసుకోవాలి మరియు మరీ ముఖ్యంగా ఏదైనా ఇన్ఫక్షన్‌లు లేదా ఇతర సమస్యలకు చికిత్స చేయించుకోవాలి.

*14. లోదుస్తులు* :
సరైన లోదుస్తులు ధరించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సౌకర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక, లోదుస్తులు సరైన ఆకృతి లేనట్లయితే లేదా మీ చర్మానికి ఫ్యాబ్రిక్ పడకపోతే, దానిని ఉపయోగించవద్దు. తగిన బ్రాను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.

15. *వ్యాయామం:*
మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు, మీ గుండె సమర్థవంతంగా ఆక్సిజన్ గల రక్తంతో మీ చర్మానికి కాంతి అందిస్తుంది. దీని వలన మీ చర్మం మరియు జుట్టుకు పోషణ లభిస్తుంది. అలాగే ఏరోబిక్స్, యోగా మరియు పరుగు వంటి ఇతర కార్యచరణలు చేయాలి.

16. *ధ్యానం*: ఒత్తిడి వలన మొటిమలు, ముడుతలు, పొడి చర్మం వంటి సమస్యలు పెరుగుతాయి మరియు జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. ధ్యానం చేయడం వలన ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి కారణంగా విడుదలైన రసాయనాలు మరియు హార్మోన్లకు వ్యతిరేకంగా దీని వలన రసాయనాలు విడుదలవుతాయి.🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.