AKSHARABHYASAM

0
367

AKSHARABHYASAM

అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో మూలా నక్షత్రం లేదు.

అక్షరాభ్యాసం శిశువుకు ఐదవ సంవత్సరంలో ఐదవ నెల ఐదవ రోజున అక్షరాభ్యాసము చేయాలి.

పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య రోజులలో అక్షరాభ్యాసం చేయరాదు. ఇది బాగా తెలుసుకోండి.

అలాగే దసరాలలో మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేయరాదు. మీకు ధర్మశాస్త్రం మరియు పురాణాలలో ఈ విషయం రాసి ఉన్నది.

నేడు సంఘంలో ఆచారం అయినది మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ ఆవాహన చేసి నాటి నుండి విజయదశమి రోజు వరకు వ్రాయుట, చదువుట, పాఠం చెప్పుట నిషేధం అని శాస్త్రం.

భవిష్యోత్తర పురాణంలో సరస్వతీ పూజ విషయమై

‘వేన్మూలాద్య పాదోవై క్షణాదాయాం కురూత్తమ తదా సరస్వతీ పూజా ప్రభాతే స్యాత్ పరేహని.. నాధ్యాపయేన్నచ లిఖేన్నాధీ రుూత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో ద్విజోత్తమః’

అని వున్నది.

ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా సమర్థించాయి.

విజయ దశమి విశేషమే. అలాగే మరొక కొత్త ఆచారం ‘బాసరలో చేసినా’ ‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తంతో అవసరం లేదు అని.

తారాబలం, గ్రహబలం లేని రోజులలో ముహూర్తం చేయవద్దు. మూఢమి అనధ్యయనం, ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసములలో చేయవద్దు.

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషం.

మంగళవారం నిషేధం. ఆది శనివారాలలో మాధ్యమం.

అలాగే

‘ప్రదగ్గతే భాస్వతి పంచమేబే ప్రాప్తేక్షర స్వీకరణం శిశూనాం’

అన్నారు కావున ఉత్తరాయణం విశేషం. అయిదవ సంవత్సరం అక్షరాభ్యాసమునకు విశేషం.

హస్త, పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రములు విశేషం.

లగ్నాత్ అష్టమ స్థానము నందు వున్న శుభ పాపగ్రహం ఏదైనా చెడు ఫలితాలే ఇస్తుంది. అందువలన అష్టమ శుద్ధి కావాలి. కేవలం పూర్వాహ్ణంలోనే 12.00 వరకే కార్యక్రమం విశేషం. 3,6,10,11 స్థానములు లగ్నాత్ పాప గ్రహములతో కూడిన యెడల విశేషం. 1,2,4,5, 7,9,12,10 లలో 11లోను శుభ గ్రహములు వుండాలి. చంద్రుడు, గురువు మనసు విద్యలకు కారకులు కావున వారు బలంగా వున్న ముహూర్తం విశేషంగా చూడాలి. ‘

ఉత్తరాయణే సూర్యే కుంభ మాసం వివర్జయేత్’ ఉత్తరాయణంలో కుంభ మాసం విసర్జించాలి.

ఇంత శాస్త్రంతో పని లేకుండా శ్రీపంచమి, దసరాలలో మూలా నక్షత్రం విశేషం అంటే ఎలాగ. ముహూర్త దర్పణం, ముహూర్త రత్నావళి చదవండి.

అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో ‘మూల’ లేదు.

పంచాంగాలలో అక్షరాభ్యాస నక్షత్ర లిస్ట్ చదవండి.

మూలా నక్షత్రం లేదు. *

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.