నేడు (30-08-2018) జమున (30-08-1937) గారి 82 వ పుట్టినరోజు శుభాకాంక్షలు

0
841

నేడు (30-08-2018) జమున (30-08-1937) గారి 82 వ పుట్టినరోజు శుభాకాంక్షలు.

జమున 1937 ఆగష్టు 30 న హంపీలో జన్మించేరు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు. 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 10 నవంబర్ 2014లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు.

బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు 1953 ఆమె తొలిచిత్రం. ఆ తరువాత ఇద్దరు పెళ్ళాలు, సంతోషం, చిరంజీవులు, భాగ్య రేఖ, వీర కంకణం, వినాయక చవితి, సతీ అనసూయ, భూ కైలాస్, వచ్చిన కోడలు నచ్చింది, గులేబకావళి కధ, రాముడు భీముడు, మంచి మనిషి, దొరికితే దొంగలు, మంగమ్మ శపధం, చింతామణి, తోడు నీడ, సి ఐ డి, శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ, సంగీత లక్ష్మి, శ్రీ కృష్ణ తులాభారం, అడుగుజాడలు, రాము 1968, ఏకవీర, శ్రీ కృష్ణ విజయం, డబ్బుకు లోకం దాసోహం, ధనమా దైవమా, దీక్ష 1975, సంసారం 1975, ఎవరు దేవుడు, మనుషులంతా ఒకటే, సతీ సావిత్రి, శ్రీ రామ పట్టాభిషేకం, నాదీ ఆడ జన్మే, అక్బర్ సలీం అనార్కలి, రాజ పుత్ర రహస్యం, నా దేశం, తెనాలి రామ కృష్ణ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కధ, పల్నాటి యుద్ధం, దొంగ రాముడు, పెళ్ళినాటి ప్రమాణాలు, మూగ మనసులు, ఇల్లరికం, ఇలవేల్పు, మూగనోము , పూల రంగడు, శ్రీమంతుడు, మనసు మాంగల్యం, పూజాఫలం, ఉండమ్మా బొట్టు పెడతా, పెళ్ళీ రోజు, పండంటి కాపురం, సంపూర్ణ రామాయణం, పాల మనసులు, లేతమనసులు, బంగారు పాప, బంగారు తల్లి, మట్టిలో మాణిక్యం, యశోదా కృష్ణ , కలెక్టర్ జానకి, జల్సా రాయుడు మొదలైన తెలుగు చిత్రాలతో పాటు, తమిళ, హిందీ సినిమాలతో సుమారు 200 చిత్రాలలో నటించారు.

ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగ పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించేరు. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలో జమున కనిపిస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసేరు. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్ర ఆమెకు పేరు తెచ్చింది.

జమున నటించిన సినిమాలలోని పాటలు యూ ట్యూబ్ లో లభిస్తున్నాయి. వాటిలో కొన్ని .

తొలి ప్రేమ – ఇద్దరు పెళ్ళాలు

నీవుండేదా కొండపై – భాగ్య రేఖ

తేలి తేలి నా మనసు – వీర కంకణం , జమున – జగ్గయ్య

తీయని తలపుల – భూ కైలాస్

నన్ను దోచుకుందువటే – గులేబకావళి కధ

తెలిసిందిలె – రాముడు భీముడు

అంతగా నను చూడకు – మంచి మనిషి

ఎవరికి తెలియదులే – దొరికితె దొంగలు

నీ రాజు పిలిచేను – మంగమ్మ శపధం

చింతామణి

మళ్ళున్నా మాణ్యాలున్నా – తోడు నీడ

నా సరి నీవని – సి ఐ డి

కుశలమా – శ్రీకాకులాంధ్ర మహా విష్ణు కధ

పాటకు పల్లవి ప్రాణం – సంగీత లక్ష్మి

ఓ చెలీ కోపమా – శ్రీ కృష్ణ తులాభారం

మల్లెలు కురిసిన – అడుగుజాడలు

మామిడి కొమ్మ – రాము 1968

తోటలో నా రాజు – ఏక వీర

జోహార్ శిఖి పించ మౌళి – శ్రీ కృష్ణ విజయం

నువ్వు నేను – డబ్బుకు లోకం దాసోహం

నీ మది చల్లగా – ధనమా దైవమా

మెరిసే మేఘ మాలిక – దీక్ష 1975

మా పాప పుట్టిన రోజు – సంసారం 1975

ఆలపించనా – శ్రీ రామ పట్టాభిషేకం

బాలనురా మదనా – మిస్సమ్మ

కోలు కోలోయన్న – గుండమ్మ కధ

చేయి చేయి కలుపరావె – అప్పు చేసి పప్పు కూడు 1958

అందాల ఓ చిలుకా అందుకో నా లేఖా, లేత మనసులు

నా మాట నమ్మితివేలా – నాదీ ఆడ జన్మే

బంగారు తల్లి

శ్రీ కృష్ణ విజయం

మీరజాలగలడా, శ్రీ కృష్ణ తులాభారం

కట్టండి వీర కంకణం

ముత్యాల చెమ్మ చెక్క – బొబ్బిలి యుద్ధం

వసంత గాలికి వలపులు రేగ – శ్రీకాకులాంధ్ర మహా విష్ణు కధ

(అనప్పిండి సూర్య లక్ష్మీ కామేశ్వర రావు. )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.