09-08-1961 న విడుదలైన జగదేకవీరుని కధ చిత్రాన్ని సంగీత ప్రియులెవరూ మరచిపోలేరు

0
348

09-08-1961 న విడుదలైన జగదేకవీరుని కధ చిత్రాన్ని సంగీత ప్రియులెవరూ మరచిపోలేరు.

ఆ పాటలకు సంబంధించిన వివరాలివి:-

శివశంకరీ , జగదేక వీరుని కథ , పింగళి, పెండ్యాల , ఘంటసాల, ఎన్ టి ఆర్, కె వి రెడ్డి, Marcus Bartle,

శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ

చంద్రకళాధరి ఈశ్వరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము చేయవే శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ
శివశంకరీ శివానందలహరీ శివశంకరీ
చంద్రకళాధరి ఈశ్వరీ

రిరి సని దనిసా
మపదనిసా దనిసా దనిసా దనిసా
చంద్రకళాధరి ఈశ్వరీ
దనిస మపదనిస సరిమగరిమపని దనిస
మప నిరి సరి నిస దనిస
మపనిసరీసని సరిగా రిస రిరి రిరి సని
సనిపనిపమ పమ గమరిసనిస
సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ..
శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ
తోం తోం తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరి యానా దరితోం
దిరిదిరి తోందిరిదిరి తోం
దిరిదిరి తోం తారియానా
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరి దిరి తానా దిరితోం
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం
నినినిని నినినిని దనిని దనినిని దప
పసస నిససనిద నిదిరి సరిరి సని
నిసస నిసస నిద దనిని దనిని దప
నినిదద ససనిని రిరిసస గగరిరి
గగ సస రిరి నిని సని రిరి సస సస
రీరి రీరిరి నినిని రీరిరిరి నినిని గా గగగ
నినిని రీరి గరిమా..
రిమరి సరిసనిసని పనిప మపమరిగా
సరిసస మపమమ సరిసస సససస
సరిసస పనిపప సరిసస సససస
మపమమ పనిదద మపమ పనిద
మపమ పనిద పదపప సరిసస
పదప సరిస పదప సరిస మమమ పపప
దదద నినిని ససస రిరిరి గరిస సరిపా

శివశంకరీ

శివశంకరీ పాట స్వర పరచడానికి ముందే జగదేక వీరుని కధ చిత్రంలోని మిగతా పాటల రికార్డింగూ, పిక్చరైజేషనూ కూడా అయిపోయింది. కథకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. కథానాయకుడు తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్సేన్, ఓంకారనాథ్ ఠాగూర్ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు హనుమంతుడు పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్ మన పాటకు తీసుకురావాలి. “జగదల ప్రతాప్” సినిమా మన కథకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి’ అన్నారు. పెండ్యాల చిన్నగా నవ్వి ‘ట్యూన్ మనం సొంతంగానే చేద్దాం’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. పెండ్యాల ముల్తానీ, ఘూర్జరీ, తోడీ, కాళింగడా, దర్బారీ, అసావేరీ రాగాలలో ఆ పల్లవిని పాడి వినిపించారు. కె వి రెడ్డిగారికీ, పింగళి నాగేంద్రరావుగార్లకు దర్బారీ రాగంలో చేసిన ట్యూన్ నచ్చింది. మిగతా చరణం తర్వాత రాసిస్తానని మర్నాటికే తెచ్చారు పింగళి. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో పెండ్యాల ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి ఘంటసాల వెంకటేశ్వరరావుకు వినిపించారు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని రిహార్సల్స్ అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్ కూడా పూర్తయింది.

రికార్డింగు అయ్యాకా పాటను విన్న ఎన్ టి ఆర్ “హిందూస్తానీ విధ్వాంసులు పాడుతున్నప్పుడు , వాయిస్తున్నప్పుడు కొన్ని విన్యాసాలు చేస్తారు. మాస్టారితోపాటు కూచుని అవన్నీ ప్రాక్టీసు చేస్తాను” అన్నారు. అలాగే 4 రోజులు రిహార్సల్స్ చేయడమే కాకుండా, “మాస్టారూ షూటింగ్ సమయంలో పూర్తిగా మీరు సెట్ మీదే ఉండాలి ” అన్నారు పెండ్యాలగారితో. అలాగే ఉన్నారు పెండ్యాల. పాట మొత్తంలో ఎక్కడా తొట్రుపాటు లేకుండా, తడబడకుండా ఎ టు జెడ్ బై హార్ట్ చేసి లిప్ మూవ్మెంటు ఇస్తూ రకరకాల విన్యాసాలతో ఎన్ టి ఆర్ నటించిన విధానానికి షూటింగ్ టైములో ఉన్నవారు, విజిటర్స్ గా వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. వెండితెరపై ఆ పాటకు, ఎన్ టి ఆర్ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. శివశంకరీ పాట చూస్తుంటే నిజంగానే దేవకన్యలు ఉన్నట్టు, ఎన్నికష్టాలు పడైనా వారిని కలవాలని ప్రేక్షకులు అనుభూతి చెందేవారు.

జలకాలాటలలో, జగదేక వీరుని కధ, పింగళి, పెండ్యాల, కె వి రెడ్డి, లీల – సుశీల బృందం

తెరపై: బి సరోజా దేవి, ఎల్ విజయ లక్ష్మి, జయంతి (కమల కుమారి), బాల, ఎన్ టి ఆర్

రాగం: పల్లవి కీరవాణి, చరణాలు: నట భైరవి

ఆనాటినుండి ఈనాటివరకూ స్నానం చేస్తూ పాడుకునే పాటలలో ఇదే ప్రధమ స్థానంలో ఉంటుంది. చాలామంది హలా హలోనుండి తీసుకున్నారని పొరబడుతారు. అమరం చూస్తే చెలికత్తెకు “హలా” అనే ప్రయోగం కనిపిస్తుంది. ప్రాచీన సంస్కృత నాటకాలలో ఈ ప్రయోగం జరిగింది కూడా.

ఏది ఏమైనా విరళంగా (అరుదుగా) లభ్యమయ్యే పదాల్ని తరళంగా (ప్రకాశించేటట్లు) , సరళంగానూ వాడిన పింగళి కి సినీ సంగీత సాహిత్యాభిమానులు వీర తాళ్ళు వేయక తప్పదు.

జలకాలాటలలో
కలకల పాటలలో ఏమి హాయ్ లే హలా
ఆహా ఏమి హాయ్ లే హలా “జలక”
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసినే “ఉన్నది”
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో
సన్న వలపు విరిసే “2” “జలకా”
తీయని రాగమేదో మది హాయిగ పాడెనే “తీయని”
తరుణ కాలమేదో అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే “జలకా”

ఓ సఖి.. ఒహో చెలి , జగదేక వీరుని కధ, పింగళి, పెండ్యాల, కె వి రెడ్డి, ఘంటసాల

తెరపై: బి సరోజా దేవి, ఎల్ విజయ లక్ష్మి, జయంతి (కమల కుమారి), బాల, ఎన్ టి ఆర్

రాగం: దేశ్

అహో, ఒహో పదాలను పింగళి ఎంత చక్కగా వాడుకున్నారో కదా

ఓ… దివ్య రమణులారా…
నేటికి కనికరించినారా…
కలకాదు కదా సఖులారా…

ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని
ఓసఖి…
కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ…ఓ…ఓ..
కనుల విందు చేసారే….ఏ..ఏ..ఏ…
కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ..- ఓ సఖి… ఒహో చెలి …

నయగారములొలికించి… ప్రియరాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే… ఏ..ఏ..ఏ…
హాయినొసుగు ప్రియలే మరి మాయని సిగ్గులు ఏలనే.- ఓ సఖి.. ఒహో చెలి..

కను చూపులు ఒక వైపు…మనసేమొ నా వైపు
ఆటలహొ తెలిసెనులే…ఏ…ఏ…
ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె.- ఓ సఖి… ఒహో చెలి …ఒహో మదీయ మోహిని.. వరించి వచ్చిన మానవ వీరుడు ,

వరించి వచ్చిన మానవ , జగదేక వీరుని కధ, పింగళి, పెండ్యాల, కె వి రెడ్డి, లీల – సుశీల బృందం

తెరపై: బి సరోజా దేవి, ఎల్ విజయ లక్ష్మి, జయంతి (కమల కుమారి), బాల,

రాగం : మధ్యమావతి

ఈ పాటను కొందరు ఔనె చెలి అని పాడతారు. అది సరి కాదు. ఔన చెలి ఔన సఖి సరి ఐనది. చరణాలలోని వాక్యాలకు తరవాత వచ్చే వాక్యాలతో లింకు ఉండటం ఒక ప్రత్యేకత.

ఈ పాట మొదలవడానికి ముందు వచ్చే వాద్యాన్ని క్లేవయోలిన్ అంటారు. ఎలక్ట్రికల్ గా ఆపరేట్ చేసే వాయిద్యమది.

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట

నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే
అహ నవ మన్మధుడే ఆయెనే
మన్మధుడై నిన్నావేశించి మైమరిపించేనే హలా
నిను మైమరిపించేనే హలా – వరించి

అలగిన చెలిని లాలన శాయా మలయానిలుడే ఆయెనే
ఓహో మలయానిలుడై చల్లగ చెలిపై వలపులు విసిరినే హలా
అహ వలపులు విసిరేనే హలా

చెలి అడుగులలో పూలు చల్లగా లలిత వసంతుడె ఆయెనే
అహ లలిత వసంతుడె ఆయెనే
వసంతుడై నిను కోయిల పాటల చెంతకు పిలిచేనే హలా
తన చెంతకు పిలిచేనే హలా – వరించి

ఐనదేమో ఐనది, జగదేక వీరుని కధ, ఘంటసాల, సుశీల, పింగళి, పెండ్యాల, కె వి రెడ్డి, ఎన్ టి ఆర్, బి సరొజాదేవి

రాగం: కల్యాణి.

పాటకు ముందు ఆలాపన కూడా పాట అంత ఖ్యాతిని పొందడం ఒక విశేషం. ఐ కారంతో మొదలైన తెలుగు పాటలు అతి తక్కువ. పింగళి జల్లిన మచ్చు ఈ పాట. మార్కస్ బార్ట్లే కెమెరా, ఎన్ టి ఆర్, సరోజాదేవిల అందం చూడవలసిందే.

ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ
ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది

ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ.. ఆ .. ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ
మనసు నీవశమైనది

కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ.. ఆ .. ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ
చాల కలవరమైనది

రారా కనరారా , జగదేక వీరుని కధ, ఘంటసాల, పింగళి, పెండ్యాల, కె వి రెడ్డి, ఎన్ టి ఆర్, బి సరొజాదేవి, జయంతి, ఎల్ విజయ లక్ష్మి, బాల

రాగం: భాగేశ్వరి.

ఈ పాట ముందు భాగేశ్వరి రాగంలో కూర్చేరు. ఆ తరువాత దేవ కన్యలను ఉద్దేశించి పాడిన పాట కదా అని, పెండ్యాల అరబిక్ , ఈజిప్షియన్ బాణీలతో మరొక బాణీ సమకూర్చారు. ఈ రెండిటిలో ఏది తీసుకోవాలో పింగళి, పెండ్యాల, కె వి రెడ్డి లకు తేలక సమస్యను ఎన్ టి ఆర్ ముందుంచారు. ఆయన రెండు బాణీలు విని భాగేశ్వరి కి ఆమొదం తెలిపారు. దానికి ఎన్ టి ఆర్ చెప్పిన కారణం ” అరబిక్ మెలోడీలో కొత్తదనం ఉన్న మాట నిజమే కానీ, సాహిత్యాన్ని కొంచెం వెనక్కినెట్టి ముందుకు దూకుతోంది. అంటే ముందు సంగీతమే చెవులను తాకుతోంది. భాగేశ్వరి రాగం లో సంగీత సాహిత్యాలు రెండూ జోడుగా ఒకేసారి మనసును తాకుతున్నాయి” . ఆయన పరిశీలన అందరికీ ఆమోదయోగ్యమయింది. అలా ఈ పాట భాగేశ్వరీ రాగంలో కూర్చబడింది.

రారా……….కనరారా……….
కరుణమానినారా ప్రియతమలారా
రారా…

నాలో నాలుగు ప్రాణములనగా..
నాలో నాలుగు దీపములనగా…
కలిసి మెలసి అలరించిన చెలులే
నను విడనాడెదరా….ఆ…ఆ..
రారా……….కనరారా……….
కరుణమానినారా ప్రియతమలారా
రారా…

మీ ప్రేమలతో.. మీ స్నేహముతో..
అమరజీవిగా..నను జేసితిరే…
మీరు లేని నా బ్రతుకేలా….
మరణమె శరణముగా.. ..ఆ..ఆ –
రారా……….కనరారా……….
కరుణమానినారా ప్రియతమలారా
రారా…

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.