సైనసైటిస్‌ సమస్యే కాదు

0
497

*సైనసైటిస్‌ సమస్యే కాదు!*
***************************

‘సైనసైటిస్‌’ ఎలర్జీ, తుమ్ములు, బారిన పడిన వాళ్ల బాధలు ఇన్నీ అన్నీ కావు. తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి ద్రవాలు కారడం, వాసన తెలియకపోవడం, తల బరువు, చిగుళ్ల నొప్పి లాంటి లక్షణాలు పెద్ద చిరాకు పెడతాయి. ముక్కుకు ఇరువైపులా, కళ్ల పైనా ఉండే గాలి గదుల్లో వైరస్‌, బ్యాక్టీరియా చేరిపోవడమే ఈ సమస్యకు అసలు మూలం. మౌలికంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. అయితే సమస్య మొదలైన వెంటనే, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తే, సమస్య అంతటితో సమసిపోతుంది. హోమియోలోని ఇచ్‌నేసియా అనే ద్రావణం (మదర్‌ టించర్‌) వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది.

*హోమియో వైద్యంలో..*

ఠి ఒక దశలో సైన్‌సలోని ద్రవాలు బాగా చిక్కబడి, దారంలా బయటికి వస్తూ గొంతులోకి కూడా జారుతుంటాయి. ఈ స్థితిలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారికి కాలిబైక్రోమియం- 200 (పొటెన్సీ) మందు బాగా పనిచేస్తుంది. పిల్లలకైతే 30 పొటెన్సీ సరిపోతుంది. హోమియోలోని ఏ మందైనా పిల్లలకు 30 పొటెన్సీలో ఇస్తే చాలు.

ఠి కొందరికి ఈ సమయంలో కడుపు ఉబ్బరంగానూ, మంటగానూ ఉండడంతో పాటు లాలాజలం ఎక్కువగా వస్తూ ఉంటుంది. నోరు, ముక్కు నుంచి దుర్వాసన కూడా వేస్తుంది. ముక్కు నుంచి వచ్చే ద్రవాలు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఇలాంటి వారికి మెర్క్‌సాల్‌ – 200 మందు సమర్థంగా పనిచేస్తుంది.

ఠి కొంత మందికి ద్రవాలు కారడంతో పాటు, విపరీతంగా తుమ్ములు, తలంతా బరువుగా అనిపిస్తుంది. అలాంటి వారికి టూక్రియం – 200 మందు బాగా పనిచేస్తుంది.

ఠి సమస్య తీవ్రతను బట్టి కొంతమందికి ఈ సమస్య 3 లేదా 6 నెలల్లో పూర్తిగా త గ్గిపోతుంది. ఒక వేళ ఏడెనిమిదేళ్లుగా ఉన్న సమస్య అయితే ఇంకా ఎక్కువ సమయమే పట్టవచ్చు. కాకపోతే, వైద్య చికిత్సలతో పాటు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
*సైనసైటిస్‌కు సమూల వైద్యం!*

నాలుగు చినుకులు పడితే చాలు…కాసేపు చల్లగాలి వీస్తే చాలువరుస పరంపరగా ఒకటే తుమ్ములు.ఆ తర్వాత దగ్గు. ఏమీ తోచదు.ఏ పనీ చేయాలనిపించదు.సైనసైటిస్‌తో వచ్చే బాధలే ఇవి.ఎందుకిలా అంటే…!

వ్యాధినిరోధక శక్తి తగ్గడమో, శరీరంలోకి హానికారక బాహ్య పదార్థాలు ప్రవేశించడ మో ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల దేహంలోని వివిధ భాగాల్లోని టిష్యూలు ఒక్కోసారి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ స్థితిలో అవి తమ సహజ ప్రక్రియలను సక్రమంగా నిర్వరించలేకపోతాయి.

పైగా ఆ క్షణం నుంచి అవి అతిగా స్పందించడం మొదలెడతాయి. ఈ పరిణామాన్నే ఎలర్జీగా పేర్కొంటాం. ఈ ఎలర్జీ కారక పదార్థాలను యాంటిజెన్స్‌ అని, ఎలర్జిన్స్‌ అనీ పిలుస్తారు. ప్రత్యేకించి, ఎలర్జీ కార క పదార్థాలు ముక్కులోని వాయువాహికలను తాకినప్పుడు కళ్ల దిగువన, కళ్ల పై భాగాన ఉండే సైనస్‌లలోని మృదుభాగాలు ఉబ్బి కొన్ని రకాల ద్రవాలను స్రవిస్తాయి. ఈ ద్రవంలోకి సూక్ష్మ క్రిములు వచ్చిచేరతాయి. రక్తంలోని తెల్ల కణాలకూ ఈ క్రిములకూ జరిగే ఘర్షణ ఫలితంగా ఏర్పడే చీము రక్తంతో, చెక్కిళ్లు, కళ్లు, కళ్ల కింది భాగం, కళ్ల పై భాగం, కణతలు విపరీతంగా నొప్పి పెడతాయి. ఈ స్థితిలో శరీర భాగాలు వాయడం, కందడం, దురదపెట్టడం, తరుచూ తమ్ములు రావడంతో పాటు ముక్కలు బిగవేయడం, నొప్పులు రావడం, ఉచ్చ్వాస- నిశ్వాసలు కష్టతరం కావడం, ఇతర కారణాల వల్ల వచ్చిన వ్యాధులు ప్రకోపించడం, వంటి ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి..

*తాత్కాలికాలే!*

వాస్తవం ఏమిటంటే, ఎలర్జీ కార క దుమ్ము, ధూలి, ఘాటు వాసనల వంటివి ముక్కులోని మ్యూకస్‌ మెంబ్రేన్‌నుగానీ, కనుపాపలను గానీ, ముఖం చ ర్మాన్ని గానీ తాకినప్పుడు వాటి తాకిడికి ముక్కులోని మ్యూకస్‌ మెంట్రేన్స్‌ కాకుండా, సైనస్‌ల చుట్టూ ఉండే మ్యూకస్‌ మెంబ్రేన్స్‌ ప్రేరేపితమవుతాయి. ఫలితంగా సైనస్‌ల ఖాళీల్లో పరిస్థితిని నిలువరించే కొన్ని ద్రవాలు వచ్చి చేరతాయి. అందువల్ల సైనసనైటిస్‌ ప్రథమ దశలో ఉన్నప్పుడు ముక్కునుంచి నీళ్లు కారకపోవచ్చు. తుమ్ములు రాకపోవచ్చు. కళ్లు ఎర్రబడకపోవచ్చు. ఈ కారణంగానే చాలా మంది సైనసైటిస్‌ ప్రధమ దశలో ఉన్నప్పుడు దాన్ని జలుబులా అనిపించే రైనైటిస్‌ అని అపోహపడతారు. అందుకే వ్యాధి తీవ్రమైతే గానీ డాక్టర్‌ను సంప్రదించరు. కాకపోతే వ్యాధి బాగా తీవ్రమయ్యాక సాధారణ యాంటీబయాటిక్స్‌ పనిచేయకపోవచ్చు. ఎక్కువ శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ కూడా ఒక్కోసారి బాక్టీరియాను పూర్తిగా అణచలేకపోవచ్చు. సైనస్‌లల్లో గూడుకట్టిన చెడు రక్తాన్ని, చీమును రక్తప్రసరణ వ్యవస్థ శుభ్రపరచలేకపోవచ్చు. అప్పుడింక సర్జరీ చేసి డ్రెయిన్‌ చేయడం ఒక్కటే మార్గంగా అనిపించవచ్చు. కానీ, అది కూడా తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే పనిచేస్తుంది.

*దుష్ప్రభావాలే ఎక్కువ!*

ఎలర్జీ కారక పదార్థాలు దేహాన్ని తాకి చిరాకు పరిచినప్పుడు, శరీరం తన్ను తాను రక్షించుకోవడానికి యాంటీబాడీస్‌ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీలు ఎలర్జిన్‌ ఘర్షణ పడినప్పుడు శరీరం హిస్టమిన్‌ అనే రసాయనాన్ని తదితర రసాయనాల్ని ఉత్పత్తి చేసి రక్తప్రసరణ వ్యవస్థలోకి విడుదల చేస్తుంది. ఈ వర్గానికి చెందిన రసాయనాల వల్లే పైన ఉదహరించిన ఎలర్జీ లక్షణాలు దేహంలోని ఒక భాగంలో గానీ, అంతకన్నా ఎక్కువ భాగాల్లో గానీ కనిపిస్తాయి. ఇది బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి కనుక, యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం కొందరి చికిత్సా విధానంగా ఉంది. అయితే, సైనసైటిస్‌కు గురైన చాలామంది రోగుల మీద, సాధారణ యాంటీబయాటిక్స్‌ పనిచేయడం లేదు.

అందువల్ల వైద్యులు ఎక్కువ శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ సూచిస్తారు. అంతటి శక్తివంత మైన యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా తక్కువేమీ కాదుఈ స్థితిలో ముక్కులోని వాయు వాహికలు ఒకటి గానీ, రెండు గానీ తరుచూ దిబ్బడి వేస్తాయి. వీటివల్ల శ్వాస ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో కొంద రు సర్జరీకి సిద్ధమవుతారు. అయితే, ఒకటి రెండు సార్లు సర్జరీ జరిగిన తర్వాత కూడా చాలా మందికి సమస్య పరిష్కారమే కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేహంలోని వ్యాధి నిరోధక శక్తి కుంటుపడి, టిష్యూలు ఎలర్జీన్స్‌ వల్ల తేలికగా ప్రభావితమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడే రకరకాల ఎలర్జీలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి రోగిలోని వ్యాధినిరోధక శక్తిని పునరుద్ధరించే ప్రయత్నం జరగాలి. కానీ, చాలా సార్లు అది జరగడం లేదు. మూలికా వైద్యం మాత్రం ఆ వ్యాధినిరోధక శక్తిని పెంచడానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.

మూలికావైద్యం
*******************&&
సైనసైటిస్‌ను సమూలంగా నయం చేయగల శక్తి మూలికా వైద్యానికి ఉంది.
సైనసైటిస్‌ చికిత్సకు ఉపకరించే సుమారు పది రకాల శక్తివంతమైన మూలికలు ఈ వైద్య చికిత్పలో ఉన్నాయి. రోగి ఆరోగ్య నేపథ్యాన్ని బట్టి, ఎవరికి ఏ ఔషధాలు ఇవ్వాలో నిర్ణయించి, చికిత్స చేయడం జరుగుతుంది. మూలికా వైద్యం లక్ష్యం వ్యాధి లక్షణాలను నయం చేయడం కాదు. వ్యాది ఉత్పన్నానికి మూలకారణాలైన బాహ్య పరిస్థితులను, శారీరక సమస్యలను విశ్లేషించి వాటిని నివారించడం మూలికా వైద్యం ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. అంతే కాదు, సున్నితమైన మ్యూకస్‌ మెంబ్రేన్లను సామాన్య స్థితికి తేవడంతో పాటు, అవి సాధారణ బాహ్య పదార్థాలకు గానీ, మరే ఇతర విషయాలకు గానీ, అతిగా స్పదించకుండా చేయడం మూలికా వైద్యంలో సాధ్యమవుతుంది. నిజానికి, అత్యంత ఆధునిక యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని ఎలర్జీలను ప్రకృతి సిద్ధమైన మూలికా యాంటీబయాటిక్స్‌ పూర్తిగా నయం చేయగలవు. వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు సైనసైటిస్‌ సమస్యను సమూలంగా పోతుంది
Call 9949363498

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.