సయాటికా నొప్పి – తీసుకోవలసిన జాగ్రత్తలు

0
220

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:

సయాటికా నొప్పి – తీసుకోవలసిన జాగ్రత్తలు .
************************
ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు ఒత్తిడిని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు.

మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి.

ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.

సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి నరముల బలహీనతకు ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో గృ ధ్రసీవాతం అని అంటారు. .

లక్షణాలు –

నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.

ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .

సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.
సలహాలు – సూచనలు –

వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది.

సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.

ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు .
9949363498 call
ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు …

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.