శ్రీ కాళహస్తి రాహు-కేతు క్షేత్రం

0
529

శ్రీ కాళహస్తి రాహు-కేతు క్షేత్రం

పుత్ర శోకంకు గురియైన వశిష్ట మహర్షికి అయన తపఃఫలితంగా పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడుగా దర్సనమిచ్చి అయన ఆర్తిఫై బాపేను. ఈ నాగ లింగంను బ్రహ్మదేవుడు కుడా పూజించి సృస్ట్రీంఛి సృష్టి కార్యమును విగ్నంలేక చేయసాగెను. నాగరూప వేశేషంచే నీ క్షేత్రంకు `రాహు కేతు క్షేత్రం అని` పేరు వచ్చినది.సర్పదోషములు,రాహు కేతు గ్రహముల దోషం ఉన్నవారు ఈ స్వామిని పూజించి దోష నివారణలు అగుట కానవచ్చును. స్వామి కవచం నవగ్రహ కవచంకే అలంకారం,ఆరాధనలు చేయుదురు.

శ్రీ దక్షిణమూర్తి విశిష్టత
ఆలయ ప్రవేశ ద్వారం దక్షిణంవైపున ఉన్నదీ.అందు ఉత్తర ముఖముగా ప్రవేసింపగానే చిన్మ్రాద్రతో నుండు దక్షిణమూర్తిని చూడవచ్చును.చందోగ్యంలో నారద సనత్వుకుమార సంవాధోపదేశ ఘట్టమును ఈ మూర్తి స్వరూపం విశదికరించినట్ట్లుగా నగును. దీని చేత నిధి జ్ఞానప్రధాన క్షేత్రంమైనది.ఇట్టి దక్షిణమూర్తి విగ్రహం మరేచ్చట లేడు.. ఇది వైదికాయతనం,వైదిక సంప్రదయమిచ్చుట గలదని తెలియనగున.

భక్తుల కావాసం
బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు,భరద్వాజ ,వసిస్ట్ట,అగస్యది మహర్షులు జగద్గురువు శంకరాచార్యులు వంటి మత పెద్దలు,రామకృష్ణది అవతార మూర్తులు,శైవనాయన్మారులు నలుగురు మరియు ధూర్జటి,సత్కిరులవంటి మహాకవులు,యాదవ ప్రభువు, మధుర నుండి వచ్చిన వేశ్య కన్యలు,కన్నప్ప మున్నగు భక్తవ రెన్యులచే కొలువబడి వారల తరింపచేసిన ప్రతిబా మహిమాన్వితుడు శ్రీ కాళహస్తిశ్వర స్వామి.

తీర్ధ రాజములు
శ్రీ వేదవ్యాసముని ప్రణితమైన స్టలపురాణానుసారం ఇచ్చట 36 తీర్ధములు గలవు.అందు ముఖ్యంగా సహస్రలింగాల తీర్ధం,హరహర తీర్ధం,భరద్వాజ తీర్ధం (లో బావి) మర్కేందేయ తీర్ధం,మూక తీర్ధం, సూర్య చంద్ర పుష్కరిణిలు ముఖ్యమైనవి.ఇవి దక్షిణ కైలాస పర్వతంలోనున్నవి.గాక ప్రాశస్తములైనవి.

ఈ తీర్ధంలో స్నానములు పాపములను పోగొట్టుటతో పాటు జ్ఞానోదయం గూడా కిలిగించునవి.పెద్దలు చెప్పుదురు.ఈ తీర్ధముల స్నానం చే దేహ శుద్దియు,క్షేత్రవాసంచే అంతఃకరణ శుద్ధియు నేర్పాడుచున్నదని శాస్త్రవాదం.

రాహు -కేతు కాల సర్ప దోష పూజ

రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీ కాళహస్తిశ్వరఆలయంలో అత్యంత మహిమాన్విత పూజ` రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ “ రాహు కేతు దోషం వున్నవారు ,గ్రహదోషములు, సర్పదోషములు కలవారు,వివాహం కానివారి, సంతానం లేనివారు,దీర్గకాలిక సమస్యలతో సతమతమౌతున్నవారు ఈ ఆలయంలో రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు జరుపుకొంటె దోష నివారణ పొంది,తప్పక సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం,నిదర్శనం కుడా. ఈ దివ్య క్షేత్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ పూజలు జరుపుకోనుటకు దేశ విదేశాల నుండి వేలాది భక్తులు రాహు కేతు సర్ప దోష నివారణ పూజ జరుపుకొని సత్ఫలితాలు పొంది మళ్ళి వచ్చిమ్రొక్కులు తిర్చుకొంటున్నారు.

శ్రీ అధిదేవతా ప్రత్యదిదేవతా సహిత రాహు-కేతు సర్ప దోషములు ఉన్నవారు రాహు-కేతు స్వరుపులైఇచట వెలిసిన శ్రీ కాళహస్తిశ్వరులను ఆరాధించిన దోష నివృత్తి అగును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.