” శ్రీదేవి ” వీరికి ఆత్మశాంతి కలుగును గాక

0
407

” శ్రీదేవి ” వీరికి ఆత్మశాంతి కలుగును గాక !
శ్రీదేవి ఆగస్టు 13వ తేది 1963వ సంవత్సరములో శివకాశి (తమిళనాడు రాష్ర్టం)లో జన్మించింది, 24 ఫిబ్రవరి 2018 దుబాయ్ లో మరణించారు ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రెణి కథానాయకగా గుర్తింపుసంపాదించింది.

వ్యక్తిగత జీవితం
ఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. ఆమె తండ్రి లమ్హె అను చిత్రం నిర్మాణంలో ఉండగా, తల్లి జుదాయి అను చిత్రం నిర్మాణంలో ఉండగా మరణించారు. హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి, తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది.

కొన్ని కథనాలు శ్రీదేవి కొంతకాలం హిందీ కథానాయకుడు మిదున్ చక్రవర్తితో కలసి ఉన్నదని, వారిద్దరకూ రహస్యంగా వివాహం చేసుకొన్నారని, అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరమయినదని చెపుతాయి.

ఇది ఎంతవరకూ నిజం అనేదానికి తగిన ఆధారాలు మాత్రం లేవు. తరువాతి కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్ ను 1996 జూన్ 2న వివాహం చేసుకొన్నది. వారిరువురికి ఝాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు కలరు.

బాలనటిగా శ్రీదేవి
శ్రీదేవి ఒక అగ్ర కథానయక. శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది. ఆమె యువ నటిగా తొలుత, ఎక్కువగా తమిళం మరియు, మలయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రములకు ఎక్కువగా ఐ.వి. శశి గారు దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రములలో చెప్పుకోదగినవి : ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం. 1976 లో బాలచందర్ చిత్రం “మూండ్రు ముదచ్చు”లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తరువాత, శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో వీరితో (కమల్ హాసన్, రజనీ కాంత్) కలిసి నటించారు. కమల్ హాసన్ గారితో, ఆమె గురు, శంకర్ లాల్, సిగప్పు రోజక్కల్. తాయుళ్లమాల్ నానిల్లై, మీండుం కోకిల, వాజ్వే మాయం, వరుమైయిన్ సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రం పిరై, 16 వయత్తినిలే మొదలగు చిత్రాలలో నటించారు. రజనీ కాంత్ గారితో, ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. 1975-85 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక.

అదే సమయంలో, శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావు గారితో, ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు. ఎ.నాగేశ్వరరావు గారితో, ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ/కృష్ణ గారితో కలిసి ఆమె కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆదిలో, ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు, వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవి, ముఖ్యంగా కె. రాఘవేంద్ర రావు గారు మరియు కె.బాపయ్య గారు దర్శకత్వం వహించినవి.

1978 లో, శ్రీదేవి మొదటి హింది చిత్రం “సోల్వా సావన్” అమోల్ పాలేకర్ తో కలిసి నటించారు, ఆ చిత్రం విజయవంతం కాలేదు. కాని, ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం “హిమ్మత్వాలా” మంచి విజయం సాధించింది. ఆ చిత్రంతో ఆమెను ఉత్తర భారతదేశంలో “Thunder Thighs” అని పిలవసాగారు. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో (star) అయిపొయారు. ఆమె తదుపరి చిత్రం “సద్మ” ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి. 1980 లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని, “నగీన”, “మిస్టర్ ఇండియా”, “చాందిని”, “చాల్ బాజ్” మొదలగు చిత్రాలు. చాల్ బాజ్ చిత్రానికి హగానూ ఆమెకి మొదటి ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు “మిస్ హవ హవాయి” (Miss Hawa Hawai) అని పేరు వచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లీ చాప్లిన్గా మరువలేని నటనా ప్రతిభ కనబరిచారు. “చాందిని” చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయిక. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేవారు.

యాష్ చోప్రా ఆమెతో “చాందిని” చిత్రం తరువాత “లమ్హే” (1991) చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గానూ ఆమె రెండవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు, ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి (International Best Actress Award) పురస్కారాన్ని కూడా అందుకున్నారు. “ఖుదా గవా” మరియు “గుమ్రా” చిత్రాలలో ఆమె నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. “హాలీవుడ్”లో ప్రఖాతి గాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg), ఆమెతో సినిమా తీయదలచి, ఆమెను సంప్రదించారు. కాని సమయం లేని వలన ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం “రూప్ కీ రాణి చోరో కా రాజా” అపజయం అయ్యింది. విజయవంతమైన చిత్రం “జుదాయి” (1997) తరువాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. తరువాత ఆమె, “బోనీ కపూర్”ని వివాహమాడారు. ఇప్పుడు ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. ఆమె కూతుళ్ళ పేర్లు “జాన్వి” మరియు “ఖుషి”.

ఆరేళ్ళ విరామం తరువాత ఆమె సహార ఛానల్ లో ప్రసారింప బడిన “మాలినీ అయ్యర్ (2004 – 05)” అను సీరీయల్ లో నటించారు. అంతే కాకుండా, కరిష్మా కపూర్ నిర్వహించే “జీనా ఇసికే నామ్ (2004)” అనే కార్ర్యక్రమంలో కూడా అతిధిగా కనిపించారు. “కాబూమ్ (2005) అనే నృత్య పోటీలకు ఒక రోజు న్యాయనిర్నేతగా వ్యవహరించారు.

ఆమె త్వరలో “మిస్టర్ ఇండియా – 2” చిత్రంలో నటించవచ్చునని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె ఏసియన్ ఎకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక సభ్యురాలిగా పనిచేస్తున్నారు.

2007 ఫిబ్రవరి 24 న, 52 వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రధానం రోజున, ఆమె నర్తించి మెప్పించిన 80 లలోని కొన్ని పాటలకు, మరల నర్తించి అభిమానులను, తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు.

పురస్కారాలు – గౌరవాలు
ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు
1981 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, తమిళ చిత్రం “మీండుం కోకిల”
1983 “సద్మ” ఛిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కాని “అర్ధ్” చిత్రంలో నటించిన షబానా అజ్మి, ఆ పురస్కారం అందుకున్నారు.
1989 “చాందిని” ఛిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కాని, ఆమెకే “చాల్ బాజ్” చిత్రంలో నటించినందుకు గానూ ఆ పురస్కారం దక్కింది.
1989 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, హింది చిత్రం “చాల్ బాజ్”
1991 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, హింది చిత్రం “లమ్హే”
1992 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, తెలుగు చిత్రం “క్షణక్షణం”
1992 “ఖుదా గవా” చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కాని, “బేటా” చిత్రంలో నటిచిన మాధురీ దీక్షిత్, ఆ పురస్కారం అందుకున్నారు.
1993 “గుమ్రా” చిత్రానికి గానూ ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కాని, “హమ్ హై రహి ప్యార్ కె” చిత్రంలో నటించిన జూహీ చావ్లా, ఆ పురస్కారం అందుకున్నారు.
1994 “లాడ్లా” చిత్రానికి గానూ ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కానీ, “హమ్ ఆప్కే హైన్ కౌన్” చిత్రంలో నటించిన మాధురీ దీక్షిత్, ఆ పురస్కారం అందుకున్నారు.
1997 “జుదాయి” చిత్రానికి గానూ ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కానీ, “దిల్ తో పాగల్ హై” చిత్రంలో నటించిన మాధురీ దీక్షిత్, ఆ పురస్కారం అందుకున్నారు.
ఇతర పురస్కారాలు
1993 నంది పురస్కారం, తెలుగు చిత్రం క్షణక్షణం
1994 హిందీ సినిమా రంగంలో కృషికి గాను జైంట్ అవార్డు
1998 జుదాయి చిత్రానికై స్క్రీన్ అవార్డుల నామినేషన్
2003 హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఎం.ఏ.ఎం.ఐ అవార్డు
2005 వంశీ ఆర్ట్ ధియేటర్స్ ఇంటర్నేషనల్ వారి జీవితకాలపు కృషి పురస్కారం
1996 టొరొంటో చిత్రోత్సవ ఉత్తమ నటి పురస్కారం, మలయాళ చిత్రం దేవరాగం
సేకరణ : వికీపీడియా నుండి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.