శాంతకుమారి (17-05-1920 & 16-01- 2006 ) గారి 99 వ జయంతి

0
295

శాంతకుమారి (17-05-1920 & 16-01- 2006 ) గారి 99 వ జయంతి

ప్రముఖ తెలుగు సినిమా నటి, ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య గారి సతీమణి. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈవిడ 1936లో ‘శశిరేఖా పరిణయం’ సినిమాతో నటజీవితం ప్రారంభించి షావుకారు 1950, సారంగధర 1957, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1960, రాముడు భీముడు 1964 (ఎన్.టి.ఆర్. అక్కగా) , కలిసొచ్చిన అద్రృష్టం 1967, తల్లా పెళ్ళామా 1970, చిన్ననాటి స్నేహితులు 1971 ,

అర్ధాంగి 1955, జయభేరి 1959, సిరి సంపదలు 1962, ప్రేమించి చూడు 1965, ప్రాణ మిత్రులు 1967, అక్కా చెల్లెలు 1970, ప్రేమ నగర్ 1971, సోగ్గాడు 1975, అందరూ బాగుండాలి 1976 మొదలైన వందకు పైగా సినిమాల్లో నటించారు.

సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.

1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు.

ఆశ్రమంలో వకుళమాతపై చిత్రీకరించిన ‘గోపాలా, నందగోపాల’

చిత్రం: శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1960 , రచన ఆత్రేయ , సంగీతం పెండ్యాల, గానం: పి శాంత కుమారి గారు రాగం : పీలు (నీకై వేచితినయ్యా, ఎక్కడమ్మా చంద్రుడు, ఏ దివిలో విరిసిన, ఓ పంచవన్నెల చిలుకా, ఔనంటే కాదనిలే, జయ మంగళ గౌరీ దేవీ, పిల్లన గ్రోవి పిలుపు, ప్రభు గిరిధారి శౌరి రావయా, వట పత్ర శాయికి, నీలాల కన్నుల్లో మెల మెల్లగా, ఓహో బస్తీ దొరసానీ, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేల..)

ఈనాటికి మధురమైన భక్తిగీతంగా అలరిస్తున్నది.

అలాగే 1970 లో వచ్చిన తల్లా పెళ్ళామా చిత్రంలో “మనసు తెలిసిన ఓ నాన్నా” రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టీ వీ రాజు, గాయని శాంత కుమారి. అద్బుతమైన పాట, మధ్యమావతి రాగం (అదివో అల్లదివో, సీతా రాముల కల్యాణం, సువ్వి సువ్వి, వరించి వచ్చిన, ఆశా ఆశా నీ నీడను, ఒంటరొంటరిగ పోయేదాన, కాశీకి పోయేను, వరాల బేరమయా, కల కల విరిసి జగాలే, సమయానికి తగు సేవలు, చూడాలని ఉంది అమ్మా, శంకరా నాద శరీరా, అనగనగా ఆకాశం ఉంది, అలరు చంచలమైన , పిడికెడు తలంబ్రాల…)

కడప జిల్లా ప్రొద్దుటూరు. వెల్లాల శ్రీనివాసరావు, పెద్ద నరసమ్మ దంపతుల గారాల పట్టి సుబ్బమ్మ (మే, 17,1920). శ్రీనివాసరావు రంగస్థల నటుడు. పెద నరసమ్మ సంగీతంలో నిష్ణాతురాలు. ఆ ఇంట్లో పూజలూ, నోములూ, వ్రతాలూ పాటల పల్లకిలోనే కొనసాగేవి. సంగీతాన్ని అంతగా ప్రేమించే కుటుంబం అది. ఆ కుటుంబంలో పుట్టిన సుబ్బమ్మ (శాంతకుమారి)కి సంగీతం పట్ల మక్కువ పెరిగింది. కూనిరాగాలతో పెరిగిన సుబ్బమ్మ … కచేరీల స్థాయికి ఎదిగింది. శాంతకుమారిని చూసిన పెద్దలు ‘కోకిల స్వరం, మృదువైన గొంతు. మంచి గురువుగారి దగ్గర చేర్పిస్తే గొప్ప సంగీత విద్వాంసురాలవుతుంది’ అని జోస్యం పలికారు. శ్రీనివాసరావు కూతుర్ని చెన్నపట్నం తీసుకెళ్ళి ప్రొ|| పి.సాంబశివరావు దగ్గర చేర్పించారు. వయోలిన్, వోకల్ వాయులీన విద్య. గాత్రం నేర్చుకున్నారు. ఆ సమయంలో శాంతకుమారి సహాధ్యాయిగా డి.కె.పట్టమ్మాళ్ కూడా సంగీతం నేర్చుకుంటుండేవారు. అభ్యాసం ఇద్దరి మధ్య పోటాపోటీగా సాగేది. పట్టమ్మాళ్ స్వర ప్రధానమైన అంశాల్లో ముందుంటే శాంతకుమారి గాత్ర ప్రధానమెనౖ భావయుక్తమైన ఉచ్ఛారణలో ముందుండేవారు. ఆ సమయంలో చెన్నై విద్యోదయ స్కూల్లో నెలకు రెండు రూపాయల జీతానికి శాంతకుమారి పనిచేసేరు. సమ వయస్కుడైన రాజేశ్వరరావుగారితో తరచూ చెన్నై ఆకాశవాణి కేంద్రంలో లలిత గీతాలు..సంగీత రూపకాల్లో పాలుపంచుకున్నారు. ఆ రోజుల్లో బాల సరస్వతి, రాజేశ్వరరావు యుగళ గీతమంటే శ్రోతలు చెవి కోసుకునేవారు. అటువంటి సమయంలో రాజేశ్వరరావుగారితో యుగళ గీతం పాడి శహభాష్ అనిపించుకున్నారు.

పి.పుల్లయ్య గారు అభిరుచిగల నిర్మాత, దర్శకుడు. శశిరేఖా పరిణయం చిత్రంలో శశిరేఖగా నటించిన శాంతకుమారిని చూసి ముగ్ధుడయ్యారు. అదే సంవత్సరంలో సారంగధర (మొదటి ఘట్టం) చిత్రంలో ”చిత్రాంగి” పాత్రకు జీవం పోసారు. అదే సంవత్సరంలో పుల్లయ్యగారితో పెళ్ళి జరిగిపోయింది.

పుల్లయ్య శాంతకుమారిల ఇల్లు ప్రేమ వాత్సల్యాలకు పెట్టింది పేరు. ఎన్.టి.ఆర్, ఎ.యన్.ఆర్లను స్వంత బిడ్డల్లా చూసుకునేవారు. సావిత్రి గారిని తన కూతురిలా చూసుకొనేవారు. హీరోయిన్లు ఎవరింటికొచ్చినా పసుపు కుంకుమ, పట్టుచీర తప్పనిసరి.

పెద్దమ్మాయి పద్మ పుట్టిన తరువాత పద్మశ్రీ బ్యానరు స్థాపించి సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అక్కినేనితో ‘జయభేరి’ తీశారు. రెండవ చిత్రం వేంకటేశ్వర మహత్యం. ఈ సినిమాకి మాటలు పాటలూ ఆత్రేయే. ఎన్ టి ఆర్ తెనుగునాట థియేటర్లను తిరుపతి పుణ్యక్షేత్రాలుగా మార్చిన చిత్రమది. ఎస్ వరలక్ష్మి లక్ష్మీ దేవిగా, సావిత్రి పద్మావతిగా ప్రాణ పతిష్ట చేసేరు. వకుళాదేవిగా శాంతకుమారి జీవించిందనే చెప్పవచ్చు. వేంకటేశ్వర స్వామికి తల్లి పాత్ర చెయ్యడమంటే మాటలా! ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు కావాలనే అభ్యర్థించి ‘శేషశైలా వాసా శ్రీ వేంకటేశా’ పాట చేయించగా ఆ పాట ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది.

షావుకారు చిత్రంలో శాంతి పాత్ర. సొంతంగా నిర్మించిన చిత్రాలు ”అర్ధాంగి”, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, సిరిసంపదలు , ప్రాణ మిత్రులు, ప్రేమించి చూడు, కొడుకు కోడలు మొదలైనవి.

”రాముడు -భీముడు” చిత్రంలో ఎన్.టి.ఆర్. అక్కగా నటించారు.. రాజనాల ఈ చిత్రంలో శాంతకుమారి భర్త పాత్రలో నటించి చిత్రహింసలకు గురి చేస్తాడు. అమాయకుడైన రాముడ్ని ప్రాణంగా చూసుకొనే అక్క పాత్రలో పదికాలాలు గుర్తుండే నటన. ఎన్.టి.ఆర్ స్వీయ నిర్మాత దర్శకత్వంలో వచ్చిన ‘తల్లా? పెళ్ళామా?’ చిత్రంలో తల్లి పాత్రలో తల్లులకూ, కోడళ్ళకీ కళ్ళు చెమర్చే విధంగా నటించేరు. ఈ చిత్రంలో మనవడ్ని చూసి ”మమతలెరిగిన నా తండ్రీ…. మనసు తెలిసిన ఓ నాన్నా… నాన్నమ్మా అని వచ్చావా” అంటూ ఆర్ధ్రతతో వినిపించింది. ఆమె నటననూ పదేపదే ప్రశంసించేవారు ఎన్.టి.ఆర్. ఏ చిత్రంలో నటించినా పాట పాడినా జీవం పోసేవారు. ఆరు పదులు దాటే వరకూ ఆమె గొంతులో మాధుర్యం తగ్గలేదు.

250 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.

జనవరి 16,2006 వ సంవత్సరంలో ఆమె కోరుకున్న ప్రకారం పుల్లయ్యగారి దగ్గరికే నవ్వులు వెదుక్కొంటూ పయనమయ్యారు. ఆ లోకంలో ఎన్ని నవ్వులు-పువ్వులు పూయిస్తున్నారో ఏమో!

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.