విప్లవ జ్యోతి అల్లూరి సీతా రామ రాజు (04-07-1897 & 07-05-1924) 121 వ జయంతి నేడు

0
611

విప్లవ జ్యోతి అల్లూరి సీతా రామ రాజు (04-07-1897 & 07-05-1924) 121 వ జయంతి నేడు.

అల్లూరి సీతారామరాజు అందరికీ పరచియం ఉన్న స్వాతంత్ర సమర యోధుడు. మన్యం ప్రాంతంలో ఆయన కొనసాగించిన పోరాటం బ్రిటిష్ వారి పుస్తకాల్లో “పితూరీ” గా వర్ణించారు. ఇరవయ్యో శతాబ్దపు తొలిరోజుల్లో జరిగిన ఈ స్వాతంత్ర పోరాటం సినిమాలోకి ఎక్కించాలని తాను అల్లూరి సీతారామ రాజు వేషం వెయ్యాలని, నందమూరి తారక రామారావు గారు ఎంతగానో ఉవ్విళ్ళూరారు. ఈ దశగా తన పద్ధతిలో కొనసాగుతూ, ఒక పాట కూడా వ్రాయించి రికార్డు చేయించారు 1955 లో.

గీత రచయిత పడాల .
గానం : ఎం ఎస్ రామారావు, ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది, సంగీతం : టీ వీ రాజు. శ్రీ Ramesh Panchakarla
గారు సౌండ్ క్లౌడ్ లో పెట్టిన ఈ అపురూప ఆడియో

పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
ఓహో.. హర హరం ప్రణవమున ఓంకార నాదాన
హర హరం ప్రణవమున ఓంకార నాదాన
పర ప్రభుత్వపు నీడ సీమదొరలా జాడ
క్రుంగుతూ బ్రతుకుటే జాతికే సిగ్గురా
ముక్కోటి తమ్ముళ్ళను ఒక్కటిగా నిలబెట్టి
మెడ బట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా
మెడ బట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
ఓహో.. హర హరం ప్రణవమున ఓంకార నాదాన
హర హరం ప్రణవమున ఓంకార నాదాన
పలనాటి చంద్రుని వెలుగు విక్రమ ధాటి
నాగులేటి నాగు బుగ బుగల పగ కాటు
రాణి రుద్రమ రౌద్ర రోషాన లజ్జానా
స్త్రీ మహా శక్తిరా.. శ్రీరామ రక్షరా
స్త్రీ మహా శక్తిరా.. శ్రీరామ రక్షరా
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
ఓహో.. హర హరం ప్రణవమున ఓంకార నాదాన
హర హరం ప్రణవమున ఓంకార నాదాన
గోదావరి పరుగు కృష్ణవేణి ఉరకా
పర్వతాలే రగులు మన్య తేజముతో
తెలుగు గడ్డే నీకు నివ్వాళులెత్తా
తొడగొట్టి జైకొట్టి జయము కొనరారా
తొడగొట్టి జైకొట్టి జయము కొనరారా

కానీ ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు. కృష్ణ అల్లూరి సీతా రామరాజు సినిమా స్కోప్ లో తీసి ఘన విజయం సాధించారు.

అల్లూరి సీతా రామ రాజు 1974 తెలుగు వీర లేవరా

అయితే ఎన్ టి ఆర్ సీతారామ రాజు గా సాంఘిక చిత్రాలలో కొన్ని పాటలలో కనిపిస్తారు.

అగ్గి రాముడు సినిమా కోసం నాజర్ బుర్ర కధ

సర్దార్ పాపారాయుడు లో బుర్ర కధ

మేజర్ చంద్ర కాంత్, పుణ్యభూమి నా దేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.