వస’లో ఏముంది?

0
482

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .
cell.9949363498:

• ‘వస’లో ఏముంది?
***********************
ఎక్కువగా మాట్లాడేవాళ్లను వసపిట్టలనీ, వాళ్లకు చిన్నప్పుడు బాగా వసబోసి ఉంటారనీ అంటుంటారు. కానీ వస అనేది ఆయుర్వేదంలో అత్యంత శక్తిమంతమైన ఔషధం. దీని సంస్కృతనామం వచ. అదే తెలుగులో వసగా మారింది. గడ్డి జాతికి చెందిన ఈ ఔషధ మొక్క వేరు పిల్లలకు వచ్చే అన్ని రకాల వ్యాధులనీ తగ్గిస్తుందట. అందుకే దీన్ని పిల్లల ఔషధం అనీ పిలుస్తారు. ఒకలాంటి తియ్యని వాసనతో ఉండే దీని వేరుని ఎండబెట్టి పొడి చేసి ఆయుర్వేదంలో రకరకాలుగా వాడుతుంటారు.

* తరచూ అజీర్తితో బాధపడే పిల్లలకు దీని వేరుని మంటమీద కాల్చి, పొడి చేసి, ఓ చిటికెడు పొడిని తల్లి పాలతో కలిపి తాగిస్తారు. అరకప్పు మరిగించిన నీళ్లలో ముప్పావు టీస్పూను శొంఠిపొడి, చిటికెడు వసపొడి వేసి తాగితే పెద్దవాళ్లలోనూ జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

* పిల్లల చేతికి ఈ వేరుని కంకణంగా కడుతుంటారు. వాళ్లు దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతుంటే ఆ రసం కొంచెంకొంచెంగా కడుపులోకి వెళ్లి బ్యాక్టీరియా, వైరస్‌ల్లాంటివి పొట్టలోకి చేరకుండా ఉంటాయట. గొంతునొప్పి, దగ్గులతో బాధపడేవాళ్లు చిన్న వస ముక్కని దంచి, కాసేపు నోట్లో పెట్టుకుని, కొంచెం కొంచెంగా ఆ రసాన్ని మింగితే ఉపశమనం ఉంటుంది. అలాగే మాటలు త్వరగా రానివాళ్లకి కూడా చిటికెడు పొడిని తేనెతో కలిపి నాకిస్తారు.

* మతిమరపు, డిప్రెషన్‌, మూర్ఛ… వంటి నరాల సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్లకి వస వేరుని దంచి, మరిగించి, చల్లార్చిన డికాక్షన్‌ని ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.

* డయేరియాకీ ఇది మంచి మందే. చిటికెడు వస పొడిని తేనెతో కలిపి ఇస్తే డయేరియా కూడా తగ్గుతుంది.

* దీన్నుంచి తీసిన గాఢ తైలాన్ని చర్మసంబంధ ఇన్ఫెక్షన్లు, తలనొప్పి, ఆర్థ్రయిటిస్‌, కీళ్లనొప్పులు తగ్గడానికీ వాడుతుంటారు.

* వసపొడిని కాసిని నీళ్లలో కలిపి ఇంట్లో అక్కడక్కడా చల్లడం ద్వారా కీటకాలను అడ్డుకోవచ్చు. అలాగే దీన్ని పలుచని బట్టలోకట్టి కబోర్డులూ బీరువాల్లో పెట్టితే బొద్దికలూ తెల్లని పుస్తకాల పురుగుల్లాంటివి చేరకుండా ఉంటాయి.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.