మూత్రాశ్మ‌రి

0
490

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:

మూత్రాశ్మ‌రి
******************
అశ్మ‌ది అంటే రాయి. మూత్రాశ్మ‌రి అంటే మూత్రంలో కానీ మూత్రాశ‌య వ్య‌వ‌స్థ‌లో కాని రాయి ఏర్ప‌డ‌టం అని అర్థం.
కార‌ణాలు
1.మూత్రంలో చిక్క‌ద‌నం పెర‌గ‌డం..క్యాల్షియం..మెగ్నీషియంజ..ఫాస్ఫేట్‌..యూరిక్సిడ్ క‌లిగిన ప‌దార్థాల‌ను అతిగా తీసుకోవ‌డం
2. నీటిశాతం త‌గ్గ‌డం
అధిక ఎండ‌లో తిర‌గ‌డం..త‌ర‌చు అతిసారం కావ‌డం..మూత్రం వెలువ‌డుట‌కు వాడే మందులు..చెమ‌ట మూత్రం ద్వారా నీరు అధికంగా బ‌య‌ట‌కు వెళ్ళుట‌..ద్ర‌వ ప‌దార్థాలు త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల నీటి శాతం త‌గ్గుతుంది.
3.
మూత్ర వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చే మార్పులు
క్రింది కార‌ణాల వ‌ల్ల మూత్ర నాలాల్లోని లోప‌లి సున్నిత‌మైన పొర దెబ్బ‌తిని గ‌రుకుగా మారుతుంది. త‌ర్వాత కాలంలో ఇక్క‌డ రాయి ఏర్ప‌డ‌టానికి ఎక్కువ అవ‌కాశం ఉంటుంది.
1.మూత్ర‌నాళాల వాపు..ముఖ్యంగా ప్రొటియ‌స్ వ‌ల్గారిస్‌..స్టెఫైలోకోక‌స్‌..బాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్‌లో రాళ్ళు ఏర్ప‌డ‌టానికి అవ‌కాశం ఎక్కువ ఉన్నాయి.
2. త‌ర‌చుగా మూత్ర‌నాళ ప‌రీక్ష‌లు (సిస్టోస్కోప్‌, యురెట‌రోస్కోప్‌)చేయ‌డం. యూరిన‌రీ కాథెట‌ర్‌..వాడ‌టం.
ల‌క్ష‌ణాలు
న‌డుం నుంచి నొప్పి ప్రారంభ‌మై పొత్తిక‌డుపువైపు ప్రాక‌డం..మూత్రంలో నొప్పి..మంట‌..ర‌క్తం ప‌డ‌టం…మూత్రం ఆగి ఆగి రావ‌టం..వాంతులు..జ్వ‌రం మొద‌లైన సాధార‌ణ ల‌క్ష‌ణాలు ఉంటాయి.
ర‌కాలు
ఆయుర్వేదంలో ఐదు ర‌కాలైన రాళ్ళ‌ను గుర్తించారు.
1.వాత దోషం వ‌ల్ల వ‌చ్చేరాయి
దీనిలో పై ల‌క్ష‌ణాల‌తో పాటు నొప్పి తీవ్ర‌త అధికంగా ఉంటుంది. క్యాల్షియం ఆక్జ‌లేట్ రాళ్ళు ఈ కోవ‌లోనికి వ‌స్తాయి.
నొప్పి త‌గ్గ‌డానికి శంఖ‌వ‌టి..అజామోదార్క మొద‌లైన మందులు వాడాలి. మంట ఎక్కువ‌గా ఉంటే స‌ర్జాక్షార‌ము నీటిలో క‌లిపి తీసుకోవాలి. రాయి క‌ర‌గ‌డానికి నాషాణ‌బేద చూర్ణ‌ము, హ‌జుర‌ల్‌య‌హాద్ భ‌స్మం..చంద్ర‌ప్ర‌భావ‌టి..గోక్షుర క్వాధ మొద‌లైన‌వి తీసుకోవాలి.
2.పిత్త‌జ ఆశ్వ‌రి
సాధార‌ణ ల‌క్ష‌ణాల‌తో పాటు మూత్రంలో మంట‌..ర‌క్తం ప‌డ‌టం, జ్వ‌రం, చెమ‌ట‌ప‌ట్ట‌డం, మూత్రం ప‌సుపురంలో ఉండ‌టం..అధిక‌ద‌ప్పిక త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఉంటాయి. దీనిలో శారిబాద్యాస‌వం, ఉసీరాస‌వం, బృహ‌త్యాది క‌షాయం, హ‌జుర‌ల్‌య‌హాద్‌భ‌స్మం మొద‌లైనవి వాడాలి. ఇది యూరిక్ ఆసిడ్ రాళ్ళ‌ను పోలి ఉంటుంది.
3.
క‌ఫ‌జఅశ్వ‌రి
సాధార‌ణ ల‌క్ష‌ణాల‌తో పాటు మూత్రాశ‌యం బ‌రువుగా ఉండ‌టం..సూదితో గుచ్చిన‌ట్టు నొప్పి..మూత్రం చిక్క‌గా రావ‌డం..ఆక‌లి లేక‌పోవ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. నొప్పి తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంది. దీనిని క్యాల్షియం ఫాస్ఫేట్ రాయితో పోల్చ‌వ‌చ్చు. దీనిలో వ‌రుణాది క‌షాయం..ఉల‌వ‌ల క‌షాయం..ముల్లంగి క‌షాయం తీసుకోవాలి.
4.
స‌న్నిపాత ఆశ్మ‌రి
పై మూడింటి ల‌క్ష‌ణాలు దీనిలో ఉంటాయి. అయితే ఎక్కువ‌గా ఉన్న ల‌క్ష‌ణాల ఆధారంగా చికిత్స చేయ‌వ‌ల‌సి ఉంటుంది. దీనిని మిక్స్‌డ్ స్టోన్‌తో పోల్చ‌వ‌చ్చు.
5.
శుక్ర‌జ ఆశ్మ‌రి
వీర్యం గ‌ట్టిప‌డి రాయిగా మారుతుంది. నొప్పి పురుషాంగం మొద‌టి నుండి చివ‌రి వ‌ర‌కు ఉంటుంది. సంభోగ స‌మ‌యంలో నొప్పి ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని స్ఫెరోమోలిత్‌(spermolith)తో పోల్చ‌వ‌చ్చు. వీర్య‌శోధ‌న చూర్ణ‌ము..చంద్ర‌ప్ర‌భావ‌ట మందులు వాడాలి.
జాగ్ర‌త్త‌లు..రోజుకు నాలుగు లీట‌ర్ల నీటిని తాగాలి. ముల్లంగి..ఉల‌వ‌లు..కొబ్బ‌రి నీళ్ళు..చెరుకుర‌సం..ధ‌నియాలు..యాల‌కులు..బ‌త్తాయి జ్యూస్ అధికంగా తీసుకోవాలి.
వాత‌జ ఆశ్వ‌రీలో వంకాయ‌, శ‌న‌గ‌లు, వేరుశ‌న‌గ‌, చేప‌లు, మాంసాహారం తీసుకోకూడ‌దు. పిత్త‌జ ఆశ్వ‌రిలో ట‌మోట‌, క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్ తీసుకోకూడ‌దు. క‌ఫ‌జ ఆశ్వ‌రిలో పాల ప‌దార్థాలు, గుడ్డు, తిన్న వెంట‌నే పడుకోవ‌డం చేయ‌కూడ‌దు. తీపి ప‌దార్థాలు త‌గ్గించాలి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.